Tuesday, August 4, 2009
కామ కామ కామ లేదు
పడుకుంటే నిద్రరావాలి కాని నిలపడ్డా కూడా నిద్ర వస్తుంది. నిలపడ్డా నిద్ర వచ్చినా పర్లేదు! హైదరాబాద్ సిటీ బస్సులో ఒంటికాలు మీద తపస్సు చేస్తున్నా కూడా నిద్ర వస్తుంది అంటే.. ’ఛి వెధవ బ్రతుక” అనిపించింది ఒక్క నిమిషం. నిద్ర బారిన పడకుండా ఒక్క క్షణం దిక్కులు చూద్దాం అనుకుని అలా లుక్ టర్న్ ఇస్తే సీట్లో కూర్చున్న ఒకడు సాక్షి పేపర్ చదువుతున్నాడు. సాక్షి పేపర్ చూడ్డం కొత్త కాదు కాని అందులో న్యూస్ మాత్రం కొత్తగా నే కాక బహు చెత్తగా కూడా ఉంది. ఇంతకీ న్యూస్ ఏంట్రా నాయనా అంటే! "సమ్ ఊర్లో (కామ) సమ్ పర్సన్ (కామ) సమ్ పర్సన్ ఫోటో పెట్టుకుని (కామ లేదు) పూజ చేస్తున్నాడు. అతను ఇష్ట దైవం (కామ) కనిపించే దైవం (కామ) అడగకుండా వరాలు ఇచ్చే వాడు (కామ లేదు) ఆ ఫోటో లో ఉన్న వ్యక్తేనట మరి. అలాగని ఆ వ్యక్తి ఏ బాబ నో, ఏ నామాలు పెట్టుకుని పంగనామాలు పెట్టే సన్నాసో కాదు. సాక్శ్యాత్తు వై ఎస్ రాజశేకర్ రెడ్డి గారు. రాజ శేకర రెడ్డి మొత్తం ఆంధ్రావనికి ఎన్ని పంగనామాలు పెట్టినా అప్పుడే నామాల బాబాల లాగ ఫోటో లు ఎక్కి కూర్చుంటాడు అనుకోలేదు. నేను చెప్పే ఈ విషయం ఏ తమాషాకో కాదు.. భగవద్గీత ’సాక్షి’గా (కామ) మనస్సాక్షిగా (కామ) అక్షరాలా (కామ లేదు) వాస్తవం...
Thursday, January 22, 2009
కొత్త కుక్క....
ఈ మధ్యనే కొన్న ఒక కొత్త కుక్క పిల్లను మొట్ట మొదటిసారి మార్నింగ్ వాక్ కు తీస్కెళ్లాను.. పాపం ఊహ తెలిసాక మొట్ట మొదటిసారి బయటకు రావడం కదా... దానికి అన్నీ కొత్తగా కనపడుతున్నాయి.. ఇలా బయటకు వచ్చామో లేదో, పక్కన ఉన్న ఒక చెట్టును చూసి ఒక కాలెత్తింది.. అందులో అంతరార్థం గ్రహించిన నేను, దానిని వారించి, "తప్పమ్మా! ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు, మనకోసం వై. ఎస్. గారు సులభ్ కాంప్లెక్శ్ కట్టించారు.. అక్కడే ఇలాంటివి చేయాలి." అని చెప్పాను. కాంప్లెక్స్ అన్న పదం వినగానే అదేదో కుక్క బిస్కెట్లు దొరికే ప్లేస్ అనుకుందేమో.! నాలుక నాలుగు మీటర్లు బయట వేలాడేసింది..అది గ్రహించిన నేను.. ఇది నాలుక బయట పెట్టే విషయం కానే కాదు, కాలెత్తే విషయం అని చెప్పి సులభ్ కాంప్లెక్స్ కు తీసుకు వస్తే ఒకటికి ఒక రూపాయి చొప్పున వసూలు చేశాడు.. వాడికి నేను కాసులు ఇచ్చుకోవడం గమనించిన మా కుక్క మళ్ళీ ప్రశ్నార్థక వదనం పెట్టింది.. "అయ్యయ్యూ..! ఇది ఒకటికి పన్ను కాదు, వై.ఎస్. మనకు ఉచిత విద్యుత్ తో పాటు, ఉచితంగా కాలెత్తే సదుపాయం కలిగించాడు. మనం డబ్బు చెల్లించింది అవి శుభ్రంగా ఉంచే వాడు బ్రతకడానికి.." అని దాని సందేహాన్ని తీర్చాను..
అవసరం తీర్చుకుని ఆ ప్రదేశం వదిలి వస్తుంటే మా కుక్క ఒక చోట ఆగి నా ముఖాన్ని, రోడ్ ను మార్చి మార్చి చూస్తుంది.. ఆ రోడ్ కొత్తగా వేసినట్టుంది. నల్లగా నిగనిగలాడుతుంటే ఆ రోడ్ మీద నడవాలా వద్దా అని దాని సందేహమేమో అనిపించి.. "ఇది రాజీవ రహదారి.. మనం ధైర్యంగా నడవచ్చు" అని దానికి అభయం ఇచ్చాను. ఆ రోడ్ మీద అడుగు పెట్తగానే దానికి అభిముఖంగా పెద్ద హోర్డింగ్ కనిపించింది.. ఆ హోర్డింగ్ ను మా కుక్కకు చూపించాను. మా కుక్క అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అన్నట్టు చూసింది.. పాపం అసలే మాట్లాడలేని ప్రాణి కదా, దాని భావం అర్థం చేసుకుని.. "ఆయన మన సి.ఎం. వై. ఎస్. రాజశేఖర రెడ్డి గారు, పక్కన ఇందిరా గాంధి, ఆ పక్కన రాజీవ్ గాంధి, ఆ పక్కన సోనియా గాంధి.." అని చెప్పాను..
అంత వివరంగా చెప్పినా అది ఒకసారి తల విదిలించి మళ్ళీ నా వైపు సందేహం గా చూసింది.. ఏంటసలు దీని సందేహం అని ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తే అప్పుడు అర్థం అయింది దాని సందేహం.. "హ్హ.. హ్హ.. ప్రధాని మన్మోహన్ సింగ్ లేడని వెతుకుతున్నావా!! ఆయన సోనియా గాంధీ వెనుక నిలపడి ఉంటారు.. కనపడరు లే.. ఫోటో కదా!" అని చెప్పాను.. దాని సందేహం తీరినట్టుంది, ముఖం మమూలుగా పెట్టింది.. ఈ మధ్య దీనికి టి.వి. 9 చూడడం ఎక్కువై తెలివి మీరిపోయింది..
మరి కొంత దూరం నడవగానే అక్కడ సాక్షి పత్రిక అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ కనిపించింది. మళ్ళీ దాని వంక సందేహంగా చూసింది మా కొత్త కుక్క.. తప్పదు కదా, సందేహ నివృత్తి చేయాల్శిందే.. "అది సాక్షి పత్రిక అని, వై.ఎస్. గారి కొడుకు జగన్ గారి సారధ్యంలో పార్టీకి పట్టుకొమ్మలా నిలిచింది.." అని చెప్పాను.. ఆ మాట విన్న మా కుక్క కొంటెగా ఒక చూపు విసిరింది. దాని చూపులో బూతును సంగ్రహించిన నేను.. "సాక్షి పత్రిక ఇందిరమ్మ పథకం, రాజీవ పథకం లేదా దొంగ భూముల మీద వెనకేసిన దానితో స్టార్టు చేసింది కాదు.. ధర్మకర్తల సామూహిక పెట్టూబడి.."అని వివరించాను..
మరో అడుగు వేయగానే కుయ్యొ! మొర్రో! అనుకుంటూ 108 వాహనం భారీగా శబ్దం చేస్తూ, భారంగా కదులుతూ వెళ్ళిపోయింది. షరా మమూలే! మళ్ళే సందేహం.. "ఇది రాజీవ్ ఆరోగ్య భీమా పథకం కింద ప్రారంభించిన ఆంబులెన్స్ లు.. ఎప్పుడైనా ఎక్కడైన ఆక్సిడెంట్ జరిగితే, గాయ పడిన వారిని ఆసుపత్రికి చేర్చు వాహనం. గాయపడిన వ్యక్తి బాగా ఉన్నవాడైతే పెద్ద ప్రైవేటు హాస్పిటల్ కు తీస్కెల్తాయి.. లేకపోతే గవర్నమెంటు ఆసుపత్రికి చేర్చుతాయి.. " అని చెప్తే, అంటే కలర్ ఫుల్ మార్చురీ వ్యాన్ ఆ? అన్నట్టు చూసింది..
దీని సందేహాలు భరించలేక దాని కళ్లు మూసి తీసుకు వెళ్తుంటే, దార్లో ఒక వ్యక్తి ఇంగ్లీష్ లో అడుక్కుంటున్నాడు.. నీట్ గా డ్రెస్స్ చేసుకుని ఉన్న ఆ వ్యక్థి అలా అడుక్కోవడం నేను వింతగా చూస్తుంటే మా కుక్క నన్ను అక్కడ నుండి లాక్కెళ్ళింది.. ఆ వింత నుండి తేరుకునే లోపు "ఆ వ్యక్థిని పోల్చుకున్నావా?" అని ఎక్కడ నుండో స్వరం వినిపించింది..
ఎక్కడనుండి ఆ స్వరం వచ్చిందా అని వెతుకుతుంటే మా కుక్క మళ్ళీ మనిషిలా మాట్లాడుతుంది.. " ఆ వ్యక్థి ని పోల్చుకో లేక పోయావా? అతని డ్రెస్సింగ్, మెడలో ID కార్డును బట్టి చూస్తే అతను సత్యం కంప్యూటర్స్ మాజీ ఉద్యోగి అయి ఉండాలి. 30 రూపాయలు పెట్టి బియ్యం, వందలు పెట్టి కూరగాయలు, గ్యాసు కొనుక్కోలేక అవస్తలు పడుతుంటే, ఉద్యోగం లేదని పెళ్ళాం వదిలేసి వెళ్ళిపోతే పాపం, ఇలా అడుక్కుంటున్నాడు.. " అని చెప్పింది. అయినా నా సందేహ వదనం మారక పోవడంతో మళ్ళీ మా కుక్క చెప్పడం స్తార్టు చేసింది.. " కంగారు పడడానికి ఏం లేదు ఇక్కడ, అతనికి రెండు రూపయల బియ్యం కాని, వంద రోజుల పని హామీ పథకం కాని, ఉచిత విద్యుత్ కాని, పావలా వడ్డీ పథకం కాని, చివరికి ఇందిరమ్మ ఇళ్ళు కాని ఏవి వర్తించవు.. కనుక పాపం అలా అడుక్కు తినాల్శిందే.." అని చెప్పింది..
"అయ్యో! మరి నేను అతనికి ఏమైన సహాయం చేసే వాన్ని కదా? ఎందుకు లాక్కొచ్చావ్?" అని అడిగితే.. "ఇప్పుడు నువు సహాయం చేస్తే అతను నీతో పాటు వచ్చేస్తాడు.. అప్పుడు నాతో పాటు అతన్ని కూడా పోషించాల్సి వస్థుంది... " అని సమాధానపరిచింది.. మరిప్పుడు ఏం చేద్దాం? అని నేను అడిగితే.. రాజీవ్ పల్లె బాట, నగర బాటలా.... మనం మన ఇంటి బాట పడదాం!.. అంటూ ముందుకడుగేసింది..

Labels:
నవ్వుల నజరానా,
విమర్శలు-రాజకీయం,
సరదా సరదాగా
Friday, November 7, 2008
ఓడి పోతున్నావా? ఇదిగో దారి...
ఓడి పోతున్నావా? ఇదిగో దారి...
నువ్వు ఏదయిన సాధించగలవని తెలుసుకున్నప్పుడే... నీ పయనం గమ్యానికేసి సాగుతుంది. ప్రపంచం లో మనిషి సాధించలేనిది ఏది లేదని ఈ నాటి మానవ ప్రగతిని చూస్తే తెలుస్తుంది. మనిషి ప్రపంచాన్నే జయించగలడు అనడానికి సాక్ష్యం ఆటం బాంబ్.
ముందుగా, నువ్వు తలచుకుంటే ఏదయినా సాధించగలవు అని తెలుసుకోవాలి. ఒకే ఒక నమ్మకం మనలను ముందుకు వెళ్లడానికి దారి చూపిస్తుంది. అదే మనం ఏదైన సాధించగలం అనే పట్టుదల. ఆత్మ విశ్వాసం లేని చోట అనుకున్నది సాధించలేము. పట్టుదల, ఆత్మ విశ్వాసం అనే ఆయుధాలు ఎంత గొప్పవో తెలుసుకోవాలంటే గాంధీజీ స్వతంత్రోద్యమం గురించి తెలుసుకో, ఆ ఆయుధాల పదును తెలుసుకోవాలంటే అర్థరాత్రి చీకటి ముసుగులో వెనుతిరిగిన తెల్లవాడిని చూసి తెలుసుకో. గాంధీగారి స్వతంత్రం సాధించాలనే పట్టుదల, సాధించగలననే ఆత్మవిశ్వాసమే మనకు స్వతంత్రాన్ని తెచ్చి పెట్టింది.
ఎదురీతలో ఎదురుదెబ్బలు తప్పవు అనే నిత్య సత్యాన్ని మర్చిపోవద్దు. పదే పదే ఓటమిని చవి చూసేవారు ఓటమి నా సొంతం, విధి అంతే, నో లక్ అనుకుంటూ జీవితాన్ని కుష్టువాడి తోపుడు బండి వెనుక కట్టి ముందుకు నెట్టుకొస్తూ ఉంటారు. వారి కళ్ళు ఎదుటి వారి కళ్ళలో వీళ్లపై గల జాలి కోసమే వెతుకుతాయి. జాలి కోసం వెతుక్కునేవాళ్ళు బ్రతికినా చచ్చిన్నా ఒకటే.
ప్రతీ ఓటమి ఎందుకు ఓడి పొయావో చూపిస్తూ నిన్ను వెక్కిరిస్థుంది. ఆ ఓటమిని ఓడించకపోతే అది నిన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. నీ ఓటమిని చూసి జాలి పడేవాళ్ళ కోసం వెతుక్కుంటూ ఉంటే "గెలుపు" అనే శక్తి నీ దరిదాపులకు కూడా రాదు. పాజిటివ్ గా ఆలోచిస్తే ప్రపంచం లో అన్నిటికన్నా గొప్ప గురువు "ఓటమి". విచిత్రంగా ఉంది కదూ.. ఓడించే ఓటమే మన గురువు అని నమ్మడానికి. కాని ఇది అక్షర సత్యం. ప్రతీ ఓటమి నువ్వు ఎందుకు ఓడిపోయావో తెలుసుకునే అవకాశం ఇస్తుంది. నోలక్.. అనే పదం నీనుండి నుండి వస్తే, ఆ గురువు నీకు శత్రువు అయి నీ శిరోభారం అవుతుంది.
ఓడిపోతే నువ్వు చేయవలసిన పని= గెలవడానికి నువ్వు చేయవలసిన పని. రెంటికీ అర్థం ఒక్కటే కదా? కాకపోతే కొంచెం తిరగేసి తికమక పెట్టాను??? అలా అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే.. ఓడి పోతే చేసేది గెలిచే ప్రయత్నం, కాని ఆరంభమే గెలవడానికి కావలసింది కట్టుదిట్తమైన కృషి. ఏది ఏమైనా అసలు గెలిచే ప్రయత్నం ఎలా చేయాలి? ఎలా గెలవాలి? ఎలా ఓటమిని దూరమ్ చేసుకోవాలి.. తెలుసుకోవాలంటే
>గమ్యం అగమ్యగొచరమ్ గా ఉండకూడదు. అంటే మన టార్గెట్ స్పష్టం గా ఉండాలి.
>వేసే ప్రతీ అడుగు గమ్యానికేసే ఉండాలి.
>మనం అసలు ఆ పని ఎందుకు చేయాలనుకుంటున్నాం, ఎలా చేస్తే మన టార్గెట్ రీచ్ అవుతాం అనేది పదే పదే ఆలోచించుకోవాలి.
>మనం అనుకున్న విధం, ఆచరణలో చాలా మార్పులకు లోనవుతుంది. ఆ మార్పును పాజిటివ్ గా తీసుకోవాలి. అంటే ముందు మనం చేసుకున్న ప్లాన్ లో, మనకు నచ్చిన విధంగా సాఫీగా, సునాయాసంగా ఉంటుందనే భావనతోనే ముందుకు అడుగేస్తాం. కాని పరిస్థితులు మనకు లోబడి ఉండవు అని తెలుసుకొవాలి.
>అన్నిటికన్నా అతి ముఖ్యమయినది.... "తొలి అడుగు". ఇది చేయగలమా, అది చేయగలమా అనుకుంటూ టైం వేస్ట్ చేసుకునేవాళ్ళు ఎప్పటికి ఏపనీ చేయలేరు. ఒక కార్యం అనుకున్నాక ప్రారంభిస్తేనే ముందుకు సాగుతుంది.
>కాలం చాలా విలువైనది అని తెలుసుకోవాలి. మనం కాలంతో పోటీ పడాలి. ఒక అడ్డంకి వస్తే, దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలే కాని, దూరంగా పారిపోకూడదు. ఆలా పారిపోతే మళ్ళీ మొదటికి వచ్చినట్టే. మనతో పాటుమన కాలం కూడా వెనక్కు రాదనే విషయం గుర్తుంచుకోవాలి.
>ఎవరూ చెప్పని గొప్ప సూత్రం భయం=ధైర్యం. అంటే ఎంత భయపడితే అంత ధైర్యం వస్థుంది అని కాదు. భయం ను దూరం చేయాలంటే దానికి సరి సమానమయిన ధైర్యం కావాలి. అది ఆత్మ విశ్వాసం,పట్టుదల తో వస్తుంది.
ఇక్కడ ఒక ఉదాహరణతో వివరిస్తాను. ఒక తండ్రి కొడుకును భయం అనే పాలు పోసి పెంచాడు. ఎలాగో ఎదిగాడు ఆ అబ్బాయి. కొంతకాలానికి తన నిర్ణయమ్ తను తీసుకోగలిగే వయసు వస్తుంది. తండ్రి ఆ స్వేచ్చ ఇచ్చినా భయం అనే ఒక అడ్డుగోడ తన శక్తిని చంపి వేస్తూ ఉంటుంది. ఆ అబ్బాయికి డాక్టరు అవ్వాలనే ఆశ. తండ్రికేమో కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఐతే విదేశాల్లో బాగా సంపాదించి సుఖ పడతాడు అని ఆశ. ఇక్కడ ఆ అబ్బాయి డాక్టరు కావాలంటే, తన ఆశయం నెరవేరాలంటే ఏం చేయాలి. పైన చెప్పినవాటిలో కొన్ని అప్లై చేద్దాం...
టార్గెట్: డాక్టరు అవడం..
ఎందుకు డాక్టర్ అవాలి: మనసుకు నచ్చిన పని కనుక, ఇష్టం లేకుండా చేసే ఏ పనిలో సంపూర్ణ విజయం సాధించలేం గనుక.
ఎలా డాక్టర్ అవాలి: ఇంటర్ బై.పి.సి తీస్కోవాలి. మంచి ప్రతిభ కనపరచాలి. ఎం.సెట్ లో మంచి ర్యాంక్. ఎం.బి.బి ఎస్ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేయాలి.
టార్గెట్ ఈజ్ క్లియర్. సో, అంతా బాగానే ఉంది. అనుకున్న విధంగా చదివి కష్తపడితే ఫ్యూచర్ = ఆ అబ్బాయి డాక్టర్.
బట్ ఇక్కడ కావలసింది ఫస్ట్ స్టెప్. ఒక్కసారి బై.పి.సి లో అడుగు వేస్తే ప్రాయాణం స్తార్ట్ అయినట్టే. ఎవరు ఆపరు. కాని ఆ తొలి అడుగు వేయాలంటే వాళ్ల డాడ్ అడ్డం. కదా? ..... ఏమంటారు? మీ అభిప్రాయం చెప్పండి. ఎలా ఆ అబ్బాయిని డాక్తర్ ను చేద్దామో?
{క్రితం ఏవో కొన్ని సరదాగా రాశాను. తరువాత కొన్ని కారణాల వల్ల రాయలేకపోయాను. కాని నా చుట్టూ ఉన్న తల్లితండ్రులను, పిల్లలను, కొంత మందిని చూశాక నా భావాలు మీతో పంచుకోవాలని, తద్వారా ఇతరులకు పంచాలని నిర్ణయించుకున్నాను. మీ అభిప్రాయాలు పంచుకోండి. నా అభిప్రాయాలకు ఊపిరి ఇవ్వండి.}
ఇది నా తొలి అడుగు.. రెండవ అడుగుతో మళ్ళీ తదుపరి పోస్టులో..

Tuesday, June 3, 2008
చేతులు కాలాక ఆకులు పట్టుకుందామంటే ఆకులే దొరకడం లేదు!!
చాలా రోజుల నుండి పుస్థకాలు ముట్టలేదేమో! ఈ రోజు పుస్తకాల రాక్ లో తల పెట్టి చూస్తే, డస్టులో పొర్లిన కోడిలా ఉన్నాయి పుస్తకాలు. నేను నాకు తోచిన మాటలు అప్పుడప్పుడూ రాసుకునే పుస్తకం వెతికి పట్టి బయటకు లాగితే దాని వెనకాల ఒక లారీ డస్ట్ బయటకు వచ్చింది. అతి కష్టం మీద ఆ పుస్తకాన్ని శుభ్రపరచి ఇదిగో.. ఈ సోది రాస్తున్నా.. "ఏంటో అంత ప్రత్యేకమయిన విషయం.." అనుకుంటున్నారా? అదేం పెద్ద విషయం కాదండీ.. మనకు తెలిసిన విషయమే... అదేనండీ!! "చేతులు కాలాక ఆకులు పట్టుకుందామంటే ఆకులే దొరకడం లేదు.."
అసలు ఈ విషయం మొన్ననే రాయాల్సింది. మన బాబు తెలుసు కదా! అయ్యో నా బాబు కాదండోయ్.. మాజీ సి.ఎం. బాబు.. తన హయాం లో వర్షాలు పడలేదని ఇప్పటికీ ఫీల్ అవుతున్నట్టు.. మన కె.సి. ఆర్. (టి.ఆర్. ఎస్) ఓట్ల వర్షం పడలేదని మొన్నట్నుండే ఫీల్ అవడం స్టార్టు చేశాడు. "చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం" అన్న సామెత కూడా ఇక్కడ పనికి వచ్చేలా లేదు. ఆనాటి హనుమంతుడు చిన్న తనం లో తెలియక సూర్యున్ని మింగబోయి ఎర్రగా మూతి కాల్చుకున్నట్టు, తెలిసి తెలిసి తెలంగాణాను మింగబోయిన కె.సి.ఆర్. నల్లగా మూతి మాడ్చుకున్నాడు. హనుమంతున్ని దేవుడు అన్నారు కదా అని.. తెలంగాణా నవ కల్కి అవాలనుకున్నాడేమో..! ఆ దెబ్బకు మనసారా ఏడ్వాలన్నా కూడా మీడియా వదలడం లేదు ఫ్రీగా..! (మీడియా వదిలేసరికి ఏడ్చే మూడ్ మారుతుందనుకోండి..)
పాత చింతకాయ పచ్చడి టేస్టు అదురుతుంది.. ఈ విషయం అందరికి విధితమే. కాని దాన్ని పాడవకుండా సంరక్షించాల్సిన బాధ్యత తీసుకుంటేనే నిల్వ ఉంటుంది. ఈ విషయాన్ని మన తాతలు పళ్ళు ఊడినా, పచ్చడి నాక్కుంటూ, మరీ మరీ చెప్పారు. ఈ విషయం కె.సి.ఆర్. తెలుసుకోలేదేమో! (కె.సి.ఆర్. ఇంట్లో పాత చింతకాయ పచ్చడి లేదనుకుంటా! పార్టీ కార్య కర్తలంతా కలిసి ఒక జాడీ కె.సి.ఆర్. కు గిఫ్ట్ గా ఇస్తే, కనీసం అది నాక్కుంటూ అయినా కర్తవ్యం తెలుసుకుంటాడేమో..!) తెలంగాణా అని పార్టీ పెట్టి ఆ పార్టీ నే రక్షించుకోలేక పోతే తెలంగాణానేం సాధిస్తాడు? సామాజిక విలువలను, అభివృద్దిని, ప్రజలలో తమపై నమ్మకాన్ని కాపాడుకుంటేనే ప్రజలు అబిమానిస్తారని మర్చిపోయి, కేవలం సెంటిమెంట్ కే ప్రజలు పట్టం కడతారని ఎలా అనుకున్నాడో పాపం.
ఎంతకాదనుకున్నా కె.సి.ఆర్ మీద నాకు ఒక సైడ్ సాఫ్ట్ కార్నర్ లేకపోలేదు. కారణం నేను కూడా తెలంగాణా వాన్ని అవడం అయి ఉండవచ్చు. కాని షడ్రుచులు లేని ఉగాది పచ్చడిలా రాష్ట్రం ముక్కలవడం నా మనసుకు ఇష్టం లేదు. కారణం భాషాభిమానం, కళల పట్ల మక్కువ. ... .. .. ఇలా ఏదయినా కావచ్చు. ఆలోచిస్తే కెసిఆర్ ది స్వార్హపూరిత రాజకీయం అనే విషయం ఎవరికయినా తడుతుంది. బలా బలాల పరీక్ష కోసం పార్టీ కార్య కర్తల నడ్డి విరగ తన్ని, తెలంగాణా పార్టీలోనే చిచ్చు రేపుకున్నాడు. స్టౌ కు నిప్పెడితే వంట చేసుకోవచ్చు కాని, సిలిండర్ కు నిప్పెట్టి చికెన్ బిర్యాని చేస్కోవాలనుకుంటే ఇల్లు కాలుతుందని ఇప్పుడిపుడే తెలుసుకున్నట్టున్నాడు..

Sunday, March 23, 2008
ఇంటి కోసం ఒంటరి పోరాటం..
అర్థరాత్రి అమావాస్య టైం లో పుట్టిన కాకి పిల్లకు పోలియో వస్తే ఎలా ఉంటుందో.. ఆల్మోస్ట్ అలానే అయ్యేవాడినేమో..! ఏదో యంగ్ ఏజ్ లో ఉన్నా కాబట్టి, తుప్పు పట్టిన మేకుకు సిల్వర్ కోటింగ్ ఇచ్చినట్టు.. స్టైల్ గా నడుస్తున్నట్టు నటిస్తున్నా.. (రోడ్ మీద జనాలున్నారు మరి..) అదే నాలుగు గోడల మధ్య ఉంటే బాటిల్ - రా- రమ్ కొట్టిన దేవదాసులా ఉసూరుమంటూ కుప్పకూలిపోయేవాన్నేమో.. !
ఇదేం సిటీరా బాబు.. అద్దెకొంప కోసం 333 కొంపలు వెతికినా ఒక్కటీ దొరకదే.. ఒకటీ అరా దొరికినా.. నీళ్ళ ప్రాబ్లం.. లేదంటే ఇంకేదో ప్రాబ్లం. కొన్నిఇళ్ళలో టాయిలెట్ లకు కూడా టూ-లెట్ బోర్డ్ పెట్టి మూడు వేలదాకా దండుకుంటున్నారు. అంత రెంటా అంటే.. అదేదో తాజ్ మహల్ ను అవమానిస్తున్నట్టు పైకి కిందకు చూస్తారు. ఇల్లు కొంచెం బాగుంటే చాలు.. అదేదో రాజ ధర్భారులా ఫీల్ అయిపోయి రెంట్ మరో ఐదు వేకారాలు (లకారాలు టైప్ వేకారాలు అంటే వేలు) పెంచేస్తారు. ఇక పోతే ఇక్కడ ఒక ఇంటి గురించి చెప్పుకోక తప్పదు మరి..
అప్పటికే ఆరు వీధులు వెతికి అలసిపోయి ఒక ఇంటి ముందు టూలెట్ బోర్డు కనపడితే హమ్మయ్య..అనుకుని గేట్ తీసుకుని లోనికి వెళ్ళి ఒకసారి ఇల్లు చూడాలనే ఉద్దేశ్యంతో తల తిప్పి చూశాను. నేను ఇంటి కోసం వీధుల్లో ట్రావెల్ చేస్తున్నానా.. లేదా పొరపాటున టైమ్ ట్రావెల్ చేస్తున్నానా..? అని సందేహం వచ్చింది. ఇంకొక సందేహం కూడా వచ్చింది.. ఆ ఇంట్లో లంకె బిందలేమయినా దొరికాయేమో అని... వరుసగా ఆరు గుంటలు ఒక మనిషి పట్టేంత లోతు, వెడల్పు.. ఎప్పుడో ఒక పుస్తకంలో చదివినట్టు గుర్తు.. ఒకనాటి కాలం లో అందరు తమ గురించి గొప్పలు కుప్పలు కుప్పలుగా తాటాకుల మీద రాసి తమ ఇళ్ళలో గోతుల్లో తవి పెట్టుకునేవారట.. అలాంటిదేమయినా చేస్తున్నారేమో.. మల్లె పందిరెక్కబోయి కాలు జారి గులాబి పొదలో పడ్డట్టు.. నాకెందుకులే ఈ గొడవ అనుకుని వెనక్కు తిరిగితే ఒక క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అదేం కుక్కో ఏంటో.. సింహం సైజ్ లో ఉంది.. కదలకుండా కూర్చుని నా వైపు చూస్తుంది.. నాకసలే కుక్కలంటే భయం.. పిల్ల బొచ్చు కుక్కను చూస్తేనే పారిపోయేంత అమాయకున్ని.. ఆపెద్ద కుక్కను చూసి ఇంకా ఎలా బ్రతికున్నానో ఏంటో..
అసలే నాకు కుక్కలంటే,పిచ్చి కుక్కను చూసినంత భయం.. మా లాబ్ ఇంచార్జ్ ఉండేవాడు వెంకటేశ్వర్లు అని.. అచ్చం వాడిలానే చూస్తుంది. మొరిగే కుక్క కరవదు అని ఎవడు చెప్పాడో.. అది నేను ఎందుకు విన్నానో.. విన్నవాన్ని మర్చిపోక ఆ సమయం లో ఎందుకు గుర్తుకు తెచ్చుకున్నానో.. ఓర్నాయనో.. కింద తడిచిపోతుందేమో అన్నట్టుగా ఉంది. తంతే కుక్కల బోనులో పడ్డట్టయింది. ఇంతలో డోర్ ఓపెన్ చేసుకుని ఒక పిల్ల వచ్చింది.. "జిప్సీ.. కమ్ ఇన్" అంటూ నన్ను చూసి "ఏంకావాలి?" అని అడిగింది. ఎంత అందంగా ఉందో.. ఈ పిల్లకు కుక్కల పిచ్చి ఏంటో.. అనుకుంటూ.. స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్నా.. ఈ కుక్క ఏం అనదు. అని చెప్పి మీకెంకావాలి అని అడిగింది. టూలెట్ చూసి వచ్చాను.. మీ కుక్కను చూశాక నిర్ణయం మార్చేసుకున్నాను.. అని చెప్పి వెనకకు అడుగు వేసి.. ఇంలో ఒక ధర్మ సందేహం వచ్చి ఆగిపోయాను.. "ఎక్స్యూజ్ మి.. ఆ గుంటలు ఎందుకు తవ్వారో తెలుసుకోవచ్చా?" అని వినయంగా అడిగాను. పైనుండి కిందదాకా ఒక లూక్ ఇచ్చి డోర్ వేసుకుంది. ఇదేదో కొంచెం తేడాగా ఉందనిపించి.. ఏం మాట్లాడకుండా సందేహాన్ని చంకలో పెట్టుకుని మళ్ళీ వీధుల్లో పడ్డాను.. ఏం చేయను మరి.. విధి వీధుల్లో తిప్పుతుంది.... శని అపోజిషన్ లేని రూలింగ్ పార్టీలాగా నా చుట్టూ తిరుగుతుంటే, నేను వీధులన్నీ తిరిగి, ఒక బాత్ రూమ్ కూడా అద్దెకు దొరక్క లేనత్తకన్నా గుడ్డత్త నయం అని పాతకొంపలో పది కాలాలు చల్లగా ఉండాలని నిర్ణయించేసుకున్నా..

Subscribe to:
Posts (Atom)