Sunday, August 5, 2007

నా తొలి ప్రేమకథ -ముగింపు భాగం

(ముందుగా మీకొక విషయం చెప్పాలి. ముందుభాగం (నా ప్రేమకథ) లో కాలేజి నెలవు దినాలలో నాకు ఎదురయిన ఒక అనుభవాన్ని "మా ఊరి పర్యటన" గా రాయబోతున్నాను. నా పుట్టిన ఊరు నాకు ఇచ్చిన బహుమతి సారమే నేను రాయబోయే తదుపరి కథ. "మనిషికి మనిషే శత్రువు" అని ఈ కథలో చూపబోతున్నాను. నా నిజజీవిత కథలను చదువుతున్న నా స్నేహితులకు, పెద్దలకు ధన్యవాదాలు. ఇట్లు- మీ ఆశీస్సులతో ముందుకు సాగే ఒక చిన్నారి.)

గమనిక:ప్రతీ సినిమా కథకు ముగింపు పర్యం ’ఆహా! ఓహో!’ అనేలా ఉంటాయి. కాని నా ముగింపు ఒక విషాద గాథ. మీ గుండెలు చెరువులయితే ఫ్రిడ్జు లో కూర్చొని చదవమని ప్రార్థన. (నా ఉద్దేశ్యం గుండెరాయి చేస్కోమని.)

చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓటమి పాలయినప్పుడు కూడా అంత బాధ పడలేదేమో! నా సుందరి నాకు దూరమయి నన్ను గడ్డంలేని దేవదాసును చేసింది. (నాకు ఇంకా గడ్డం రాలేదు, పెంచుకుందామనుకున్నా!) "ఎవరికోసం? ఎందుకోసం?..." నాగేశ్వర రావు గారి పాట పాడాలనుకున్నాను. కాని కనీసం ఆ పాటకూడా రాని అభాగ్యున్ని. రోజులు భారంగా, వైరస్ సోకిన కంప్యూటర్ అంత స్లోగా ముందుకు కదులుతున్నాయి. కాలేజీ లో క్లాసులు గడుస్తున్నా కొద్దీ చదివే భాగం "మునిసిపాలిటీ ఆఫీసు లో విత్తనాల కోసం రైతులు పెట్టుకున్న అప్లికేషను ఫారం ల లా కుప్పలు కుప్పలు’ గా పెరుగుతుంది.

ఇది ఇలా ఉండగా ఒక రోజు... రిజల్ట్శ్ వచ్చాయి. నాకు మంచి ఉత్తమమయిన స్కోరు. "అత్త పుష్కరాల్లో కొట్టుకుపోతే కోడలు ఎంత సంతోష పడుతుందో", అంత సంతోషం. నేను ఆ సంతోషం లో ఉండగా, "శ్రీ ! నీ కోసం ఎవరో వచ్చారు." వార్డెన్ చెప్పాడు. నేను మా హాస్టలు గెస్ట్స్ రూమ్ కు వెళ్ళాను. కత్తి ఫైటు కాంతారావుతో, ఐశ్వర్యారాయ్ డ్యూయెట్ చూసినంత షాక్ అయ్యాను. నాకోసం వచ్చింది ఎవరో కాదు. ఆనాటి సుందరాంగి. "అదేనండి! నేను లైను వేస్తే, నా వీపు గోకి, పేపరు కాపి కొట్టి, థాంక్సు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది కదా!!" ఆ సుందరి. (నేనంటే ప్రేమలో పడ్డాను కాబట్టి గుర్తుంటుంది. మీకెలా గుర్తుంటుంది మరి!! అందుకే గుర్తు చేశాను.)

"హాయ్! నేను గుర్తున్నానా? నేను ’సౌమ్య’." అంది. "ఆహా! సౌమ్య.. ఎంత అందమయిన పేరు. నీ అందానికి సరిపోయేంత సౌమ్యంగా ఉంది. అసలు మర్చిపోతే కదా! ’గుర్తున్నావు’ అని చెప్పడానికి.." తనను చూసిన ఆనందం లో బయటికే అనేశాను, మనసులో అనుకోవాలనుకుని. ఆ అమ్మాయి ఏమనుకుందో మరి, ముభావంగా, బాధాపూరిత వదనంతో, అసహనంగా అలా కూర్చుండి పోయింది. "ఏమయింది రా? బాధాగా ఉంది. నాకు లేని బాధ నీకెందుకు రా! నా బాధ నీ బాధ కాదా?" జయం సినిమాలో పాట గుర్తొచ్చింది. ’ఏమయింది?’ అని అడిగాను. ’హాల్ టికెట్.. పోయింది.’ పొడి పొడి గా సమాధానం. చావుకబురు చల్లగా విన్నట్టుంది నాకు. ’వ్వాట్!’ షాక్ అయ్యాను. ’ఆ రోజు పరీక్ష అయ్యాక మా డాడికి ఆరోగ్యం బాగాలేదని కంగారులో పరుగెత్తుకెళ్ళాను.’ కథ చెప్పింది. ’ఆ తొందరలో హాల్ టికెట్ తీస్కెళ్ళడం మర్చిపోయాను. నీకు దొరికిందేమో! అని కనుక్కోవడానికి వచ్చాను.’ మెల్లిగా చెప్పింది. నాకు వెంటనే గతం గుర్తొచ్చింది. ఆ రోజు తననే చూస్తూ నా హాల్ టికెట్ తో పాటు తనది కూడా తెచ్చేశాను. కాని అసలు ఆ విషయమే మర్చిపోయాను. తన మత్తులో పడి అసలు దాన్ని తెచ్చాను అనే విషయం కూడా మర్చిపోయాను. కనీసం దాని మీద ఉన్న ఆమె పేరుకోసమయినా దాన్ని చూడలేదు. ’ఒక్క నిమిషం’ అని చెప్పి నా రూమ్ కు పరుగెత్తుకెళ్ళి నా లెక్కల పుస్తకాలు వెతికాను. దొరికింది. ’య్యాహూ....!’ గట్టిగా అరిచేశాను. దాని మీద చూశాను. అందమయిన తన ఫోటో, ఎమ్. సౌమ్య.... ’ఎంత ముద్దుగా ఉంటుంది ఈ పిల్ల. గాలి పటం ఎగిరిపోయినా, దారం ఇంకా నా దగ్గరే ఉందన్న మాట’ అనుకున్నాను. "తెగబోతున్న దారం చేతులు మారబోతుంది." (దీనికి అర్థం చివర్లో చెప్తాను.)

పరుగున తీసుకు వెళ్ళి ఆమెకు ఇచ్చాను. చాల సంతోషపడింది. రిజల్ట్ ఏంటి అని ఆడగగా, మొదటిది ఐదు, రెండవది డెబ్బై ఐదు. ( మొదటి పేపరులో మొత్తం డెబ్బై ఐదుకు గాను ఐదు మార్కులు, రెండవ పేపరులో డెబ్బై ఐదుకు డెబ్బై ఐదు.)"నేను పెద్దగా షాక్ అవలేదు కాని, మిగిలిన వాళ్ళు మాత్రం ష్యూర్ గా దెబ్బై పోతారు’ అనుకున్నాను. ’మీ ఇంట్లో అంతా కులాసాయేనా?’ వేరే ఉద్దేశ్యం తో అడిగాను. (మార్కులు చూసి ఏమయిపోయారో అని) "బాగున్నారు.థాంక్స్!" అని చెప్పింది."ఆ థాంక్స్ నా పేపరు ఇచ్చినందుకా? లేక హాల్ టికెట్ కా? లేక కుశల ప్రశ్నలడిగినందుకా?’ నాకు అర్థం కాక తల గోక్కోబోయి, పేలున్నాయనుకుంటుందేమో! అని ఆగిపోయాను.

"నువ్వు ఏం అనుకోను అంటే నిన్నొక విషయం అడగనా?" అంది. ’నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనో, లేక ఐ లవ్ య" అంటుందేమో అనుకుని,"త్వరగా అడుగు’ అన్నాను’, సిగ్గు పడిపోతూ. "ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు రాస్తున్నావా?" అంది. నాకు తన ఉద్దేశ్యం అర్థమయి " నాకు లెక్కలు రెండు పేపర్లలో పూర్తి మార్కులు వచ్చాయి. సారీ!" అని చెప్పాను. "ఫరవాలేదు లే!, నీకొక నిజం చెప్పాలి. బాధ పడను అంటే చెప్తాను" అంది. ఆ మాటకే నాకు బాధేసింది. చెప్పమన్నట్టుగా తల ఊపాను, మాట్లాడలేక. "ఆ రోజు నేను త్వరగా వెళ్ళింది నా పెళ్ళి చూపుల కోసం. వచ్చేవారం నా పెళ్ళి. మీ క్లాసులోనే మా తమ్ముడు ఉన్నాడు. నీ విషయం చెప్పాడు. నా వయసు 22. గత మూడేళ్ళుగా లెక్కలు రాస్తూనే ఉన్నాను. నీ వల్ల ఒకటి పాసయ్యాను. సారీ!" అని చెప్పింది. మొదటి ముద్దుకే పళ్ళు రాలినట్టుంది నా పరిస్తితి. మరొక్క మాట మాట్లాడకుండా, ఆమె తమ్ముడెవరో కూడా తెలుసుకోకుండా వెనక్కు తిరిగి వెళ్ళిపోయి, హాస్టలు గదిలో పడుకున్నాను. ఏడ్వడం లేదు. కాని మనసు బరువెక్కింది. ఈ లోగా వార్డెను రూము తలుపు తీసి ఉండడముతో లోపలకు వచ్చి, క్లాసు కెళ్ళకుండా పడుకున్నావు అని కొట్టాడు. ఇంక ఏడ్పాగలేదు. "నేను చదువుకోను, ఒక్క నిమిషం కూడా హాస్టలు లో ఉండను, వెళ్ళిపోతున్నాను." అని గట్టిగా అరచి బట్టలు సర్దుకుంటుంటే వార్డెను వెళ్ళి హాస్టల్ ఇంఛార్జ్ ను తీసుకు వచ్చాడు. మా ఇంఛార్జ్ కు బాదడమే తెలుసు. ఇంఛార్జ్ వచ్చి అరగంట బాధాడు, వర్డెన్ ను ఎదిరించానంటూ. నేను హాస్టల్ వదిలి పారిపోతాననుకుని నాకు గొలుసులు కట్టి లాక్ చేయించాడు. ఆ దెబ్బలకన్నా మనసు పడే బాధే ఎక్కువేమో! ఈ సారి ఏడ్పాగలేదు. ఎన్ని గంటలు ఏడ్చానో కాని చివరికి నిద్రాదేవి లాలనలో, కలత నిద్రలోకి జారుకున్నాను...

తెగిపోయిన నా గాలిపటం, దారం తో సహా చేతులు మారబోతుంది.
(అయిపోయింది.)

12 కామెంట్లు:

valluri said...

శంకర్ దాదా ఉరఫ్ చిరంజీవి "ఓ ప్రేమా" అంటు చెప్పిన సినీమా కథలా వుంది. ఏది ఎమైనా గుర్తుకోస్తున్నయీ అంటు నెమరువేసుకుని చెప్పిన మీ ఆటోబయోగ్రఫి లోని ఒక పార్శ్వం బాగుంది. keep it up.

...వల్లూరి

radhika said...

abbaa..abbaa...bhale ayindi...bhale ayindi.[sunakaanamdam]

Shankar Reddy said...

చాలా బాగా వ్రాసారు....అద్బుతంగా వుంది .....

చిన్ని యశస్వి said...

వల్లూరి గారు! షుమారుగా అన్ని టీనేజ్ ప్రేమల చివరిఫలితం ఇలాగే ఉంటుంది. రాధికగారు.. నాకు కూడా ఆనందం గానే ఉంది, అది ఫెయిల్ అయినందుకు. సక్సెస్ అయితే ఇప్పుడు ఈ బ్లాగుల బదులు, కాకా హోటల్ లో బిల్స్ రాసేవాన్ని. ధన్యవాదాలు వల్లూరిగారు, రాధిక గారు, శంకర్ రెడ్డి గారు.

ఇక పోతే ప్రేమించడం తప్పు కాదు కాని ఈ టీనేజ్ ప్రేమలు యువత జీవిత గమ్యాన్ని, తీరు తెన్నులను మార్చేస్తాయి. పెద్దవారు కల్పించుకోకపోతే నా కథలాగే అంతర్థానమవుతాయి.

టీనేజ్ కుర్రకారుకు ఒక చిన్న మనవి. టీన్ ఏజ్ అనేది ఆటపాటల కొలువు మాత్రమే కాదు, జీవిత గమ్యాన్ని నిర్థేశించే కీలకమయిన వయసు. ఆలోచించండి ఒక్కసారి!! ఇంటర్ మీరు డాక్టరా, ఇంజనీరా, లేక ఇంకా ఏదయినా వృత్తా అనేది నిర్దేశిస్తే, ఆ తదుపరి సబ్జెక్టు (ఇంజనీరింగ్, ఎం.బి.బి.ఎస్, మొదలయినవి) మీ జీవితం లో మీ గమ్యానికి సరయిన మెట్టు. అది మీ వృత్తిని నిర్ధేశిస్తుంది అనడంలో సందేహం లేదు. టీనేజ్ ను నవ్వుతూ గడపండి, కాని నవ్వుల పాలయ్యేలా కాదు.

శ్రీ!!

కొత్త పాళీ said...

నీ పోలికలు అనితర సాధ్యం, బాసూ.
ఫస్టులవ్వు ఫెయిలైతే అయింది గానీ .. జీవితంలో ఇంకా ఇలాంటివి ఎన్ని పరీక్షలో .. నా మాట నమ్మకపోతే తోటరాముడి రెండ్రెళ్ళు ఆరు బ్లాగు చదువు! :-)

మూడు బ్లాగులు ఆరొందల వ్యాఖ్యలుగా వర్ధిల్లు.

Srinivas Ch said...

ఆహా, సూపర్, మంచి కామెడీ టపాచదివి చాలా రోజులు అయ్యింది. ఈ టపాతో ఆ లోటు తీరింది. మీలో మంచి హాస్యచతురత ఉంది. కీప్ ఇట్ అప్.

శ్రీ said...

హ్హ హ్హ.. కొత్త పాళీ గారు! మీరు చెప్పిన బ్లాగు చూశాను. ఒకప్పటి కాలం లో నే ఈ కష్టాలు. ఇప్పుడు ఒక్కొక్కరికి ముగ్గురేసి గర్ల్ ఫ్రెన్డ్స్. బొత్తిగా సిగ్గు కూడా తగ్గిపోయిందండి. సిగ్గు లేకుండా అడిగి మరీ బిల్లు కట్టిస్తున్నారు అబ్బాయిలు. అబ్బయిలు లౌక్యం తెలుసి మసలుకుంటున్నారు. ధ్యన్యవాదాలండి! ఈ బ్లాగు పరిచయం చేసినందుకు. తోటరాముడు గారు మంచి హాస్యచతురులు. శ్రీనివాస్ గారు! ధన్యవాదాలు. మరిన్ని కొత్త రచనలతో మిమ్మల్ని నవ్విస్తాను.

Naveen Garla said...

మిశ్టర్ శ్రీ...నువ్వు వయసులో మాత్రమే చిన్నారివి. నీ ఆసక్తి అనుసారం వీలైనప్పుడు తెవికీలో (తెలుగు వికీపెడియా) వ్రాస్తూండు.

soulmate said...

sri congrats
iam a daily viewr of ur sight.
can u write a story with full humour, it should be such a humour that people should always remember you.
keep it up.

Siva Kumar said...

కథనం అదిరింది, ఒకదానికొకటి కలిపె విదానం బోలెడు అదుర్స్..

Nagaraja said...

చాలా బాగుంది కథ. ఇలా వ్రాయాలనుకోవడం నాకు ఒక కల మాత్రమే!

SAI KRISHNA said...

hai
this is sai krishna
your blog is so cute
but i have one question
how to use final sense template in my blog. please inform me at saikrishnaca2011@gmail.com

thanks in advance.