"దిలీప్ నిన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా?" అన్నాను కాస్త స్వరం తగ్గించి. నేను చెప్పిన మాటకు నోరు తెరిచి అలా ఉండిపోయింది. తను ఏం మాట్లాడకపోవడం తో మళ్ళీ నేనే "అయ్యో! నీకు తెలీదా?" అని అడిగాను. అలా అడగడంతో ఈ దేవి ఈ లోకం కు వచ్చి తెలుసన్నట్టు తల ఊపింది. "తెలిసినప్పుడు ఎందుకలా షాక్ అయ్యవ్?" మందు తిన్న ఎలుకలా బిత్తరచూపులు చూస్తూ అడిగాను. "చెప్తా కాని ఏం అనుకోకూడదు." అని చెప్పింది సిగ్గు పడుతూ. ఏం చెప్పబోతుందో నాకు తెలీదా ఏంటి.. (ఇది చదువుతున్న మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది.) "టెన్షన్ పెట్టకుండా చెప్పు. చెప్పాక తీరిగ్గా సిగ్గుపడు." అని చెప్పాను. "మరేమో!! మీరు నాకు ప్రపోజ్ చేస్తారనుకున్నాను. మీరు చెప్పిన స్టైల్ అలాగే ఉంది. కాని తీరా చూస్తే దిలీప్ ప్రేమిస్తున్నాడని చెప్పేసరికి కొంచెం షాక్ అయ్యాను." మెలికలు తిరిగిపోతూ చెప్పింది. ఈ విషయం ను ఇంతటితో కట్ చెయ్యకపోతే నా కొంప మునుగుతుందని.. టాపిక్ మార్చాను.
"దిలీప్ నీకు సరిపోడు. ఎన్నో లవ్ స్తోరీలు వాడికి. కొన్ని సక్సెస్. కొన్ని ఫెయిల్. ఎక్కడికెళ్ళినా తలకు మేకులు కొట్టించుకుంటాడు." అని చెప్పాను. "మేకులు కొట్టించుకోవడం ఏంటి....?" కళ్ళు రెపరెపలాడిస్తూ అడిగింది. "చావు తప్పి కళ్ళు లొట్ట పోవడం అన్న మాట" చెప్పాను. ఇంకా ఆ ప్రశ్నార్థక వదనం అలాగే ఉంది. "చెప్పుతో కొట్టించుకునే పరిస్థితి తెచ్చుకుంటాడు" అని చెప్పాను. "ఓహో! అవునా?" అంది దీర్ఘం తీస్తూ..
కాసేపు దీర్ఘాలోచన తర్వాత మళ్ళీ తనే అడిగింది "మరి నువ్వేంటలా మొహం మీదే తిట్టేస్తున్నావు?" "ఒహ్! అదా! అదొక పెద్ద కథ లే... సింపుల్ గా చెప్పాలంటే మా క్లాసులో ఒకడి చెల్లెల్ని ఎవడో ఏడ్పిస్తునాడని నాకు తెలిసింది. ఎవడా అని ఆరా తీస్తే, వాడెవడో కాదు.. వీడే! అప్పన్నుండి క్లాసులో ఎవరూ వీన్ని పట్టించుకోరు. బురద పందిని చూసినట్టు చూస్తారు వీన్ని. అయినా వీడికి సిగ్గులేదు. కావాలంటే చూడు. సాయంత్రం మళ్ళీ నాదగ్గరకు వచ్చి నీ విషయం లో హెల్ప్ చేయమంటాడు." అని చెప్పాను.
"అవునా!" అంది ఏదో అర్థమయినట్టు. చదువులో పర్లేదు కాని లోక జ్ఞానం సున్న నీకు అన్నాను. చిలిపి గా ఒక నవ్వు నవ్వింది. కావ్యతో ఇంత నవ్వుతూ, సరదాగా మాట్లాడడం ఇదే మొదటి సారి. మనసు పియానో లాగా మ్రోగుతుందేమో అనిపించింది. కాని ఎందుకో మ్రోగలేదు.
సాయంత్రం అయ్యింది. అందరూ ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు. నేను కావ్యతో మాట్లాడిన రాక్షసానందం లో ఊహాలోకం లో స్వైర విహారం చేస్తూ ఇంటికి పయనమయ్యాను. ఇంతలో "శ్రీ!" అని ఒక చిన్న పిలుపు. ఒక క్షణం ఆగి పక్కకు చూశాను. ఇంకెవరు.. మన దిలీప్. పొద్దున తిట్టాను కదా! వీన్ని ఎలాగయినా కూల్ చేయకపోతే ఏడ్చేస్తాడేమో! అనుకుని... "కొత్తా పాంటు, కొత్త చొక్కా, న్యూ హెయిర్ స్టైలు... అదిరింది మామా! కత్తిలెక్క ఉన్నవ్." అన్నాను. నో రిప్లై! వాడేం మాట్లాడకుండా ఉండే సరికి.. "అరె భై! ఏమయింది రా? కప్పను తిన్నట్టు పెట్టినవ్ మొహం. ఊరికే గిట్ల పరేషాన్ కాకు." అని అన్నాను. " ఇంకేం మిగిలింది భయ్యా. ఆ పోరి ముందు నా గాలి మొత్తం తీసేసినవ్. రేపు పొద్దున ఈ తలకాయ ఎట్ల చూపెట్టాలె.." అని తెగ బాధ పడిపోయాడు. "అరె మామా! నీకు తెలుసు కదా? నేను పనిల ఉన్నప్పుడు కెలుకుతె నాకు చిరాకు అని? ఇంతకు ముందు దీప్తి తో కొట్టిచ్చుకున్నవ్ గిట్లనే చేసి" గతం గుర్తు చేసాను. "అయ్యో సారీ మామా! మర్చిపోయిన! ఏం అనుకోకు. గా పిల్లను నాకు సెట్ చేసి పెట్టు. నీకు తాజ్ ల పార్టీ ఇస్త.." బ్రతిమాలుతున్నట్టు అడిగాడు.
ఐస్ క్రీం పుల్లను ఆరు రొజులు నాకే వీడు పార్టీనా... కలరా వచ్చిన కాకి మొహం వీడూను. ఎప్పుడయినా అద్దంలో చూసుకున్నాడా వీడు. పనసకాయమీద నూడిల్స్ పెట్టినట్టు జుట్టు, సర్కస్ వాళ్ళేసుకునే డ్రెస్సులు.. తద్దినానికి వెళ్ళి నిండుగా భోజనం చేసి తిరిగి వచ్చేటప్పుడు "అయ్యొ! గిఫ్ట్ తీసుకురావడం మరిచిపోయాను!" అనే రకం వీడు. వీడు నాకు తాజ్ లో పార్టీ ఇస్తాడంట. అది నేను నమ్మాలంట..!!
"మామా! నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అప్పుడు ఏదో చిరాకులో అలా అన్నానేకాని తర్వాత చాలా బాధ పడ్డాను. నీ స్నేహితుని గా నీకోసం ఏం చెయ్యలేనా అనిపించింది. అనిపించిందే తడవుగా కావ్యకు నీ గురించి చాలా చెప్పాను. నువ్వు చాలా గుడ్ అని... ఇంకా చాలా చాలా చెప్పాను." అని చెప్పాను దిలీప్ కు. వాడు సంతోషంతో "మామా! నువ్వు కింగ్ మామా! పైకు చూడ్డానికి అలా కనపడతావు కాని నీ మనసు ఐస్ క్రీం మామా.. " మాట్లాడుతూ ఉండగా వాడికొక ధర్మ సందేహం వచ్చింది.. "మామా! కావ్యకు నా గురించి చెప్పావు కదా? ఇంతకీ కావ్య ఏమంది?" అడిగాడు...
"పాపి తలకు పది మేకులు! ఒక మేకిస్తే నేను కూడ ఒక చెయ్యేస్తా అంది మామా!"అని చెప్పాను. "అంటే ఏంటి మామా?" అడిగాడు... "అదేదో భూతనిపించి అడగలేదు మామా!" సమాధానం చెప్పి అక్కడనుండి చల్లగా జారుకున్నాను.
(అయిపోయింది.)
Friday, August 10, 2007
Subscribe to:
Post Comments (Atom)
6 కామెంట్లు:
అయ్యబాబొ ఏం కామెడి అండి.
కలరా వచ్చిన కాకి,
పనసకాయమీద నూడిల్స్ పెట్టినట్టు జుట్టు.
మీ టపాలో హాస్యం ముఖ్యంగా ఆ తిట్లు జంధ్యాలగారి సినిమాలో సుత్తి వీరభద్రరావు తిట్లని గుర్తుకు తెప్పిస్తున్నాయి. భేషో భేష్.
నవ్వులతో
రాజేంద్ర ఆలపాటి
పెద్దలకు ధన్యవాదాలు. మీ ఆశీస్సులతో మరిన్ని హాస్యరసభరితమయిన కథలను అందించగలను.
మరొక్కసారి నా కథలను చదువుతున్న పెద్దలకు (పేరు పేరునా చెప్పాలంటే ఇండియన్ గూడ్స్ ట్రైన్ అంత పొడవవుతుందని పెద్దలు అని సంభోధించాను.) ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
మీ రచనలు చాల బావుంటున్నాయి. సందొర్బోచితంగా వాక్యాలు బాగా పేలు తున్నాయి.
ఇలాగే ముందుకు సాగండి.
-- విహారి
http://blog.vihaari.net
nuvvu...katti mama....keep coming more
Icecream pullani aarrojulu naake--LOL! Keep it up.
Post a Comment