గురువారం 9 ఆగస్టు 2007

ఛీ ఛీ ఛీ.. బాంబులు కాదండీ.. బఠానీలు.....

నేను ఒంగోలు లో ఉన్నప్పటి మాట!!

నా కాలేజ్ స్నేహితులంతా చాలా వరకు కడప వాళ్ళు, కాగా మరికొందరు ఆ చుట్టు పక్కల ప్రాంతాల వాళ్ళు. మా తెలంగాణా గ్యాంగ్ కాలేజి మొత్తం మీద అక్షరాలా పందొమ్మిది మంది. చెప్పకూడదు కాని కడప వాళ్ళకు ఫాక్షన్ సినిమాలంటే మహా సరదా అండి. ఎంత ఇష్టమంటే సినిమా రిలీజయిన రోజునుండి ఒక నెలదాకా అవ్వే డైలాగ్ లు. "ఒరేయ్ రంగనాయకులు! అర్జెంటు రా! ప్లీజ్ ఆ బాత్ రూమ్ వదిలి బయటకు రారా!" అంటే "కడప గడ్డ మీద, అమ్మ రొమ్ము పాలు తాగి పెరిగిన వాడెవడు వెనుకకు అడుగేయడు." అది వాడి డైలాగ్. "బయటకు వస్తే బూస్టు పాలు తాగిస్తా! బయటకు రారా! ప్లీజ్!!." అని బ్రతిమాలితే "గట్టిగా తొడ చరిస్తే ..... (నికృష్టపు బూతు) " వీడికి పిచ్చి ముదిరింది అనుకుని పక్క రూమ్ కు వెళ్ళాల్సి వచ్చేది.

ఇక్కడ వీడి గురించి కొంచెం చెప్పాలి. రంగనాయకులు- ది గ్రేట్- యువరత్న ఫాన్. పొద్దున లేస్తే రాత్రయ్యేదాకా బాలక్రిష్ణ పాటలు, డైలాగ్ లు, డాన్స్ లు. చంపేవాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే మా కెమిస్ట్రి లెక్చరరు ఇంకొక ఎత్తు. సార్! వీడు క్లాసుకు వేపకాయ తెచ్చాడు అని చెప్తే, అంటే నేను ఏం తేలేదని వేటకారమా? అంటాడు. వీడికి వేపకాయంత వెర్రయితే, మా సారుకు హైబ్రిడు గుమ్మడికాయంత తల తిక్క. మా రంగనాయకులు గాడికి కూడా ఈ "పొట్టి కెమ్మి" (పొట్టి కెమిస్ట్రి సారు ముద్దు పేరు) సారును చూస్తేనే డౌట్స్ వస్తాయి. సారు ఏ పాఠం చెప్పినా నరికేసారు సార్! అంటాడూ. (బాగ చెప్పారు అని అర్థం.) కార్బన్ కాంపౌండ్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఎక్కడ బాండ్శ్ కనిపించినా "తెగ నరకండి సార్!" అంటాడు. సార్ ఏదయినా ఈక్వేషన్ ఇచ్చి బాలన్స్ చెయ్మమంటే "అమ్మతోడు అడ్డంగా నరుకుతా! (ఆది సినిమా అప్పుడే వచ్చింది లెండి.)" అనేవాడు. (సార్ ను కాదు! ఈక్వేషను ను). వీడి డైలాగ్స్ అంటే మా కెమ్మి సారుకు చాలా ఇష్టం. లెక్చరర్ కాకపొతే క్లాసులోనే తొడకొట్టేవాడేమో వీడి మాటలకు ఖుషి అయ్యి. "ద్రౌపతి చీర లాగేస్తున్నారు సార్! అని చెప్తే ఒక సీమ చెల్లెలికి ఇంత అవమానమా? తియ్యండిరా సుమో లు" అన్నట్టుండేది వీళ్ళ కాంబినేషన్.

నేను క్లాసులో మొదటి బెంచ్ లో కూర్చునేవాన్ని. రంగనాయకులు అన్ని క్లాసులలో వెనుకకు వెళ్ళేవాడు కాని, కెమ్మిసార్ క్లాసులో నా పక్కన చచ్చేవాడు. ఇంక వీర బాదుడు. క్లాసులో రోజుకొక ఫాక్షను సినిమా చూపెట్టేవాళ్ళు. ఒక రోజు సమర సింహారెడ్డి అయితే, రెండవరోజు నరసింహా నాయుడు. మాట్లాడితే బాంబులెయ్యమంటారు. చివరికి H2O (నీటి అణువు) (H-O-H ఇది దాని అణు నిర్మాణము.) ను మా సార్ స్టైల్ లో చెప్పాలంటే.. "అటొక H ఇటొక H. మధ్యలో కడప బాంబు" అంటాడు. ఎలక్ట్రానులను బాంబులతో పోల్చేవాడు. ఒక దాని నుండి ఒకదానికి ఎలక్ట్రాన్స్ వెళ్తే "ఒకదానికి ఒకటి బాంబులు ఇచ్చుకుని బాండ్ గట్టిగా చేసుకున్నాయి" అంటాడు. ఎలక్ట్రాన్ లాస్ అయితే బాంబు బ్లాస్ట్ అంటాడు.

మా కెమ్మిగారికి ఇంకొక తిక్క ఉంది. సిమ్రాన్ కు వీర ఫాన్. ఏం పోల్చినా కూడా "బాలక్రిష్ణ, సిమ్రాన్ ల కాంబినేషన్ ల లాగా ఉంటుంది" అంటాడు. నా చేతివ్రాత బాగుంటుంది. రికార్డు వర్కు చూపిస్టే, "అచ్చం సిమ్రాన్ రాసినట్టుంది" అన్నాడు. వీడి కాంప్లిమెంటు తగలెట్ట. ఆసిడ్ లో ఆవకాయ బద్దేసుకుని నాకే వెధవ. బల్లి తోకూపినా కూడా సిమ్రాన్ నడుము కదిలినట్టుంది అంటాడు. ఫినాయిల్ లో హార్లిక్సు కలిపి తాగించాలి వెధవకు, శని వదులుతుంది. రాను రాను నాకు ఈ క్లాసు అంటే భయం స్టార్టు అయింది. చివరికి కలలో కూడా ఫాక్షను గొడవలు. ఒక రోజు కలలో "బాలక్రిష్ణ విమానం నుండి నేల మీద ఉన్న నా మీద కడప బాంబు వేశాడు. బాంబు పేలలేదు కాని, అంత ఎత్తునుండి పడేసరికి తల పగిలి చచ్చిపోయాను. అక్కడనుండి కిందకు దూకుతాడు బాలక్రిష్ణ. అప్పుడు ఒక భారీ డైలాగ్-బాంబులతో కాదు రా! బఠానీలతో చంపేస్తా." (విసిరింది బాంబు కాదు! బఠాణీ గింజ అన్న మాట)

ఇంక సహనం నశించి కంప్లెయింటు చేద్దామని ప్రిన్సిపల్ సార్ దగ్గరకు వెళ్ళాను. సార్ కు విషయం చెప్పాను. "సార్ క్లాసు నేను చాలా సార్లు విన్నాను. క్లాసు వింటే బాలక్రిష్ణ సినిమా చూసినట్టు ఉంటుంది. గంట సమయం ఇట్టే గడిచిపోతుంది. నీకు ఎలా నచ్చలేదు అసలు. సార్ బాగా చెప్తారని నెలకు ఇరవై వేల సాలరీకి తీసుకువచ్చాం. నీకు నచ్చకపోవడం ఎంటి."

ఏం మాట్లాడకుండా వెనుకకు తిరిగాను... ఈ చదువులకన్నా బస్టాండులో బాంబు లమ్ముకోవడం నయం. ఛీ ఛీ ఛీ.. ఈ చెత్త పదం నాకంటుకుందేంటి.. బాంబులు కాదండీ.. బఠానీలు.....

12 కామెంట్లు:

  1. మస్తు రాసారు :) ' ఆసిడ్ లో ఆవకాయ బద్దేసుకొని నాకే వెధవ.... ' మాట వినగానే జంధ్యాల సినిమా 'మొగుడూ పెళ్ళాలు.. ' సినిమా లో తిట్ట్లు గుర్తు వచ్చాయి :)

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ప్రస్తుతం నేను నిజ నీవిత కథలను మాత్రమే రాస్తున్నాను. ఇంక కథల్ చెప్పుడు షురూ జెయ్యలే! నేను కథల్ చెప్పుడు గిట్ల మొదలు పెడ్తే.. దవుడల్ దఢ దఢలాడాలె! ఇప్పటి సార్లు గూడ ఒకప్పటి పోరగాల్లే. పంది తిక్క పందిది, నంది తిక్క నందిది. పంది బురుదల మూతి పెట్టి కెలుకుతె, నంది కొమ్ములు పెట్టి కెలుకుతది. గీ సారు గూడ గింతె... ఇంక మా ఇంగ్లీసు సారు గురించి మీకు ఎరుకలే... అది కూడ ఒక దినంల చెప్త!!

    కామ్రేడ్! నాకు జై కొట్టిన అన్నలకు, అక్కలకు దండాలు....

    ప్రత్యుత్తరంతొలగించు
  3. జల్లెడలో 'బాంబులు' అని వెతికితే మీ టపా వచ్చింది. చాలా బాగా నచ్చింది. గిలిగింతలు పెట్టేవి చాలా ఉన్నాయి...:)

    ప్రత్యుత్తరంతొలగించు
  4. are laffot gallu andharu NBK meedha padi edustaremdhukuraaa.


    ee hero kanna NBK thakkuva kaadhu.

    ee fans kanna NBK fans thakkuva kaadhu.

    neelo vundeee asuyani ila tercukontunnavaaa neee ye....

    ప్రత్యుత్తరంతొలగించు
  5. నాయనా, బాబూ శ్రీను.. ఆ పందికి నంది అని పేరు పెట్టినంత మాత్రాన దాని గుణం మారుతుందా? ఆ శ్రీనివాసులు పేరు పెట్టుకుని ఇంత అందముగా మాట్లాడుతున్నారు? గర్ధభము (గాడిద) ఒకసారి పరవశం తో పాట పాడుతూ తను గంధర్వ లోక "పాప్ సింగర్" అని ఫీల్ అయిందట. కాని నీకు, నాకు, మనకు తెలియదా చెప్పు?, పంది పాటలో ఉన్న మాధుర్యం. మీరు కూడా అంతే తెలివిగా మాట్లాడుతున్నారు. నాలుక మీద కుక్క గొడుగులున్నాయేమోనని సందేహం వేసింది, ముందు మీ కామెంట్ చూడగానే. కాని దాన్ని అభిమానం అంటారు అని సాలోచన వల్ల తెలిసింది. పంది బురదలో పొర్లుతూ పన్నీటి జలకాలాట లా ఫీల్ అయిందట. అలాగే ఉంది నీ కామెంట్. గట్టిగా తొడకొట్టకుండానే రాస్తున్నా ఈ కామెంట్.

    నీ కోసమే గురూ..

    ప్రత్యుత్తరంతొలగించు
  6. ఇక పోతే అసూయ అంటావా? దాన్ని అసూయ అని చెప్పిన వెధవను "శ్రీనివాసులు (దేవుడు) వరాహావతారం లో వాడిన పాదుకలతో కొట్టాలి". అసూయ అనే పదానికి అర్థం తెలిస్తే నీకు ఆ పదం ఎక్కడ వాడాలో తెలుస్తుంది.

    ప్రత్యుత్తరంతొలగించు