అనుకోని పరిస్తితుల వలన " కాకి ముసలిదయితే తెల్ల వెంట్రుకలొస్తాయా?" అనే అంశం ను రీసెర్చ్ చేయడంలో బిజీ గా ఉండి కొంతకాలం నా బడాయి కబుర్లు రాయలేక పోయాను. అంతే కాక ఈ తొక్కలో రీసెర్చ్ కోసం మన బండ భీమం గారి ప్రేమకథను కూడా పక్కన పెట్టాను అన్న విషయం సదరు ప్రేమికులకు (అయ్యయ్యో! ఈ పదం వాడడం తప్పేమో!!) సదరు స్నేహితులకు, పెద్దలకు తెలిసినదే. ఇక్కడ ప్రేమికులు అంటే హాస్యప్రియులని నా ఉద్దేశ్యం. ఇక పోతే నా రిసెర్చ్ పూర్తయింది అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. రిజల్ట్ ఏంటంటే...
అయినా నా పిచ్చి కాని, పందికి పావ్ బాజీ తినిపించి నంది నెత్తిన నారికేళం (కొబ్బరికాయ) కొడితే పుణ్యం వస్తుందా చెప్పండి? అర్థం కాలేదా? అంటే నాదొక చెత్త రీసెర్చ్ అన్న మాట.. అయినా నేను ఒకటి కనిపెట్టాను. బహుమతి రెడీ చేస్కొండి. కాకి ముసలిదయితే కొంగవుద్ది.. వైట్ హెయిర్ వచ్చి.... ముసలి తనం వల్ల మెడ సాగిపోయి, కాల్లు లాక్కుపోయి... ముక్కు నొక్కుబడి.. ఇంక చెప్పక్కర్లేదేమో కదా???
..................
ఇకపోతే...
కొన్ని కారణాల వలన నాకు రాయడానికి తగిన సమయం దొరకడం లేదు. అయినా చాలా కాలం గా రాయకపోవడం వల్ల నాకు కూడా ఏదోలా ఉంది. చాలా సోది చెప్పాలి మరి. అందుకే తీరిక చేసుకుని సముద్రం లో కలం ముంచి, ఆకాశం మీద తాటికాయలంత అక్షరాలు రాద్దామనే అనుకున్నాను. అంతలోనే "గాలిలో ఉమ్మేయకురా సన్నాసీ!!" అన్న తాతగారి మాట గుర్తొచ్చి, ఆకాశంలో చూపులను, ఆకాశాన్నంటే నా ఆలోచనలను కొంచెం అదుపులో పెట్టి పేపరు మీద పెన్ను, సారీ! కీ బోర్డ్ మీద చెయ్యి పెడుతున్నాను. "కత్తికన్నా కలం మిన్న, కలం కన్నా కీబోర్డ్ మిన్న!!" అంటే ఇదేనేమో కదా?
గురువారం 23 ఆగస్టు 2007
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
welcome
ప్రత్యుత్తరంతొలగించుఇప్పుడే మీ బ్లాగును బుక్మార్కు చేసుకున్నాను. బాగుంది.
ప్రత్యుత్తరంతొలగించుthank u frens.! time kudaraka rayadam ledu.. konchem aalasayamayina nelaku oka 10 to 20 posts andaru mechevi rasthanu..
ప్రత్యుత్తరంతొలగించు