Thursday, August 9, 2007

పాపి తలకు పది మేకులు...

(విన్నపము: ఒరేయ్ దిలీప్ గా! పొరపాటున ఇది చూసి విషయం అర్థమయితే కామెంట్స్ లో మాత్రం తిట్టకు రా! తిడితే నీ కాంటీన్ భాగోతం ఓపెన్ గా రస్తా! హ్హెహ్హెహ్హె..) అయినా వాడికి ఇంత చదివే ఓపిక లేదు లెండి. మీరు చదువుకోండి.

కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటన ఇది.

మా క్లాసుమేట్ దిలీప్ మా జూనియర్ కావ్య కు తెగ లైన్ వేసేవాడు. నేను ప్రాజెక్టు లీడరు గా ఉన్న ఒక ప్రాజెక్టులో కావ్య నా గ్రూపు మెంబరుగా ఉంది. దిలీప్ గాడికి కావ్య అంటే పిచ్చి. దిలీప్ ఒక వింత స్వభావి. నేను పట్టిన చేపకు మూడు కాళ్ళు అనే రకం. వాడు ఏది చేసినా అతనికన్నా గొప్పగా ఎవరు చేయరు అని ఫీల్ అయిపోయి క్లాసు బకరా గా మిగిలిపోయాడు. ప్రతీరోజు కాలేజి కి రాగానే కావ్యను ఒకసారి "హాయ్! ఈ రోజు అలా ఉన్నావు.. ఇలా ఉన్నావు." అంటూ చంపుకు తినేవాడు. నిజం చెప్పాలంటే కావ్యకు వీడిని చూడగానే చిరాకు, భయం. సీనియర్ అని భరిస్తుంది వీన్ని. ఆమె చిరాకు మొహం చూసయినా వీడు అర్థం చేస్కోడు. పొరపాటున నవ్వినా నాకోసం నవ్వావా? అంటాడు. పాపం ఆమెకు నవ్వడానికి కూడా స్వేచ్ఛ కరువయింది.

ఇది ఇలా ఉండగా ఒక రోజు...

నేను కావ్యతో ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాను. ఇంతలో పరుగెత్తుకుంటూ దిలీప్ వచ్చాడు. "మామా! నువ్వు కత్తిరా మామా! లక్కీ రా! మాటల్లో చెప్పలేను రా నీ అదృష్టం." అని నోటికివచ్చింది చెప్తున్నాడు. "తాగి వచ్చావా?" అడిగాను.. "మామా!!" గావు కేకపెట్టాడు ఒకసారి... "నన్ను చూస్తే తాగేవాడిలా కనిపిస్తున్నానా? చూడు మామా.. నన్ను చూడు." ఏడ్పు మొహం పెట్టి అడిగాడు. కావ్యకు వాన్ని చూస్తే నవ్వాగడం లేదు. నేను వర్కులో చాలా స్ట్రిక్టు. తిడతానేమో అని నవ్వాపుకుంది. "ఏంట్రా నీ బాధ! " చిరాగ్గా అడిగాను. "కొత్త డ్రెస్సు కొన్నా ఎలా ఉంది?" అని అడిగాడు. "రేపు వేసుకు రా! చూసి చెప్తాను." అని చెప్పాను. "ఇప్పుడు అదే వేసుకున్నాను రా! కాస్త చూసి చెప్పు..." అన్నాడు, చూసి అనే పదం కాస్త నొక్కి చెప్తూ.

వాడి ఉద్దేశ్యం కావ్య ముందు పొగడమని. కాని ఆ టైం లో ఒక స్క్రిప్టులో తల బాదుకుంటున్నాం కావ్య మరియు నేను. వాడిని పొగిడే పరిస్తితిలో లేను నేను. ఒకసారి మీద నుండి కింద దాకా చూసి.. " చూశాను! అడుక్కుని తొడుక్కున్నట్టుంది. ఎక్కడ కొట్టుకొచ్చావ్?" అన్నాను. "నిన్ను అడిగాను చూడు! నాది బుద్ది తక్కువ. పోనీలే కనీసం నేను ఎలా ఉన్నానో చెప్పు?" అడిగాడు. కనీసం వాడి మొహం కూడా చూడకుండా "అడవి పందికి అర మందాన ఫెయిర్ అండ్ లవ్లీ రాసినట్టు ఉన్నావు" అని చెప్పాను. " ఛి ఛి ఛి.. పొద్దున పొద్దున్నే నిన్ను కెలికాను చూడు.. నాది బుద్ది తక్కువ. ఇంక జన్మలో నీతో మాట్లాడను. గుడ్ బై." సీరియస్ గా వెళ్ళిపోయాడు.

మరోక్షణం లో నా ప్రాజెక్టులో ఉన్న చిక్కుముడి విడిపోయింది. పాపం కావ్య! నేనెక్కడ తిడతానో అని నవ్వాపుకుని కూర్చుంది. అసలే ముట్టుకుంటే కందిపోయే సుకుమార వదనం ఆమెది. అలా నవ్వాపుకుని ఉండడం వలన ముఖం అరుణమయ్యింది. ఎంత అందం గా ఉంది.. కావ్యకు- వాడికి అసలు కుదురుతుందా? వెన్నెల కరిగి చినుకులై కురిస్తే ఎలా ఉంటుందో అంత అందంగా, స్వచ్ఛంగా ఉంది. పంది నోట్లో పాల పీక పెట్టినట్టుంటాడు దిలీప్. ఈ ఆలోచనకే నవ్వొచ్చింది నాకు. నేను నవ్వ్డడం మొదలు పెట్టాక కాని కావ్య నోట అలలు అలలుగా అందమయిన చిరునవ్వు చిరుజల్లులుగా నా మీద కురవలేదు.

నేను కావ్యనే తదేకం గా చూస్తూ, సున్నితమయిన స్వరం తో.."కావ్యా! నువ్వు చాలా అందం గా ఉన్నావు."అన్నాను. థాంక్స్ చెప్పింది. " నీకు ఒక విషయం చెప్పనా? కాని చెప్పాక బాధ పడకూడదు." ఓరకంట చూస్తూ అడిగాను. కాస్త కంగారు పడుతూ.. అదురుతున్న పెదవులతో, మొహమాటం గా "చెప్పండి సార్!" అంది. నేను చెప్పిన మాటకు కావ్య ఒక క్షణం షాక్ అయ్యింది....

(ఏమ్ చెప్పానో రేపు చెప్తానేం.. నిద్రొస్తుంది... గుడ్ నైట్)

7 కామెంట్లు:

నరహరి said...

మామా...కొ0ప తీసి నువ్వు గాని కావ్య కు లైన్ వేయట్లేదుగా.....ప0ది పిల్ల కు పాల పీక బాగు0ది....య0డమూరి లెవెల్ లో సస్పెన్స్ లో పెడుతున్నావ....

radhika said...

"వెన్నెల కరిగి చినుకులై కురిస్తే ఎలా ఉంటుందో అంత అందంగా, స్వచ్ఛంగా ఉంది"చాలా అద్భుతమయిన వర్ణన.బాగా నవ్వించారు.కానీ కాలేజ్ లో ప్రోజెక్ట్ లీడ్ ఏమిటి ?అదే అర్ధం కాలేదు.

Niranjan Babu Pulipati said...

చాలా సరదాగా వుంది.. మంచి సస్పెన్సులో పెట్టారు.. తరివాతి భాగం తొందరగా వేయండి :)

Srinivas Ch said...

ఈ సస్పెన్స్ భరించలేము కాని రేపు కాస్త తొందరగా లేచి ఈ టపా పూర్తి చేయండి. మీ రచనా శైలి బావుంది. కీప్ ఇట్ అప్

శ్రీ said...

COL LO LIVE PROJECT. @ RADHIKA GARU

విహారి said...

Abbo super andi.
pandi notlo palapika
chaepaki 3 kaallu
hahaha

Arogyaraj said...

i liked ur writing style.
telugudanam chala uttipaduthndi meerachana shaililo. keep it up.
kanni ee suspension challa too muchhi andi, thondaraga purthi cheandi. prakka rastallalo unde maku mee lanti vallu elanti vishalatho chala santhosam kaligisuthnaru.
keep it up.
Raju.N