మొన్నామధ్య నేను ఒక ఆటోలో స్నేహితులతో పయాణిస్తున్నాను. దారిన రోడ్ మీద బాలకిష్ణ సినిమా పోస్టరు ఒకటి కనిపించింది. ఇంతలో నా స్నేహితుడు బాబ్జి బాలక్రిష్ణ సినిమాల ప్రసక్తి తీసుకురావడంతో ఆ టాపిక్ అలా అలా సాగుతూ ఫెయిల్ అయిన సినిమాల దాకా వచ్చింది. నేను అన్నాను "నేను ఇంటర్ సెకెండ్ ఇయర్ చదువుతుండగా "చెన్న కేశవరెడ్డి" అనే సినిమా వచ్చింది. దాన్లో ఒక పాట "నలుపు నలుపు నలుపు నలుపు" చాలా ఛండాలముగా అన్ని డబుల్ మీనింగ్ లతో రాసారు. ఆ సినిమా అట్ట్ర్ ఫ్లాప్ అయింది" అని అన్నాను. ఉన్నట్టుండి ఆటో ఆగిపోయింది. ఆటో ఆపి డ్రైవర్ మా వైపు తిరిగాడు. ఆల్మోస్ట్ "మేల్ చంద్రముఖి" లా ఊగిపోతున్నాడు. మాకేం అర్థం కాలేదు.
సీరియస్ గా వెనక్కు తిరిగి హీరో లెవెల్ లో ఒక ఫోస్ ఇచ్చి.." ఎవరు చెప్పారు సార్ మీకు? బాలయ్య చెన్న కేశవరెడ్డి ఫెయిల్ అయింది అని?" అన్నాడు. ఓరి వీడి సిగతరగ! పుణ్యం కోసం గోదావరిలో రూపాయి వేస్తే, మొహం మీద బురదనీళ్ళు పడ్డాయంట. అలా ఉంది పరిస్టితి. మీకు నా గతం చెప్పాను కదా? (ఛీ ఛీ ఛీ... బాంబులు కాదండీ.. బఠానీలు..... టాపిక్ చూడండి) ఆ సమయం లోనే నాకు తెలిసింది ఫాన్స్ తో పెట్టుకోవడం, పేడనీళ్ళలో స్నానం చెయ్యడం ఒకటేనని. (గమనిక:అందరు ఫాన్స్ గురించి ప్రస్తావించడం లేదు)
మరీ వింత కాకపోతే సినిమా హిట్ కావాలని గుళ్ళో పూజలు, చేతిలో కర్పూరం వెలిగించుకోవడం, ఉపవాసాలుండడం.. ఏంటో నాకేం అర్థం అయ్యేది కాదు. చిరంజీవి ఫాన్స్, బాలక్రిష్ణ ఫాన్స్ కొట్టుకునే వారు. (ఒంగోలులో నేను చూసిన విషయం). ఒకసారయితే ఒకడు నిద్రలో కూడ కలవరిస్థున్నాడు సినిమా హిట్ అవ్వాలని. ఎదురింటోడి పెళ్ళాం నీళ్ళోసుకుంటే పక్కింటోడు స్వీట్ లు పంచిపెట్టినట్టు.. ఆ సినిమా గురించి చదువును డస్ట్ బిన్ లో వేసి మరీ ఆలోచించడం ఏంటో..
"ఇంట్లో పెళ్ళాం గోల, ఆఫీస్ లో పి.ఎ. గోల" అన్నట్టు కాలేజి రోజుల్లో దోస్తులగోల ఇప్పుడు ఈ ఆటో వాడిగోల.
నాకు ముందుగానే తెలిసి ఉండడం మూలాన "నాకు ఆ సినిమా గురించి అంతగా తెలియదు. హిట్ అయిందో, ఫ్లాప్ అయిందో.. ఆ టైమ్ లో నేను హాస్తలు లో ఉన్నాను. బయట టాక్ తెలియదు." అని చెప్పి సర్దేశాను.
ఇంక అసలు విషయానికి వస్తే... నేను రాసిన "ఛీ ఛీ ఛీ... బాంబులు కాదండీ.. బఠానీలు....." టాపిక్లో చివర కామెంట్ లో ఒక సన్నాసి "లఫూట్" అనే పదం వాడాడు. దానికి అర్థం నాకు తెలియదు కాని అదేదో తిట్టు అని మాత్రం అర్థం అయిందనుకోండి. ఈ పిడత మొహం సన్నాసి కూడా "మేల్ చంద్రముఖి" నే. అన్నట్టు మాంచి కామెంట్ కూడా జతచేశాననుకోండి వాడి కామెంట్ కు...
http://manogna-ssv.blogspot.com/2007/08/blog-post_1598.html
ఇది ఆ టాపిక్ లింక్
బుధవారం 12 సెప్టెంబర్ 2007
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
title bagundi.
ప్రత్యుత్తరంతొలగించుpost kuda
ఎప్పట్లా అదిరింది.
ప్రత్యుత్తరంతొలగించు