అదేంటి..? "కుక్క కాటుకు చెప్పు దెబ్బ" అని కదా అనాలి! ఇతనేంటి ఇలా రాశాడు? అని అనుకోకండేం...!!
ఇది అక్షరాలా నిజం. వండర్ వరల్డ్ పేపర్ లో లాగా... మరీ సాగదీయకుండా విషయనికి వస్తే.... ఆదిలాబాద్ జిల్లాలో, ఒక కుగ్రామం లో, మీరు ఎక్కడ చూసిన ఆరంజ్ కలర్ లో ఉన్న ఒక వింత చెప్పులు కనిపిస్తాయి. అవి అక్కడ లోకల్ మేడ్ చెప్పులన్న మాట. ఆ చెప్పులు మామూలు వ్యక్తులు ధరించలేరు. పొలాల్లో పనులు చేసి కాళ్ళు బండబారి పోయిన వాళ్ళు మాత్రమే ధరించగలరు. కొత్త కొత్తగా చెప్పులు వాడే వాళ్ళకు ఈ చెప్పులు కాటేస్తాయి. అంటే కాళ్ళు ఒరుసుకుపోయి మంటలొస్తాయన్న మాట. అలా జరిగితే అక్కడ జనాలు ఉపయోగించే వైవిధ్యమయిన వైధ్యం .. ఉప్పు వేయడం. భరించడం కొంచెం కష్టమే కాని...
ఈ చెప్పు కాటుకు ఉప్పు దెబ్బ మాత్రం అదుర్స్ కదా? ఏమంటారు?
Wednesday, September 12, 2007
Subscribe to:
Post Comments (Atom)
1 కామెంట్లు:
:)
Post a Comment