బుధవారం 12 సెప్టెంబర్ 2007

బర్త్ డే కాదు, అసలు స్పెషల్ ఏం లేదు.. కాని నీకు పార్టి ఇస్తాను...

మొన్న నాకు ఒక ఫ్రెండ్ ఒక ఎస్.ఎం.ఎస్. చూపించాడు. అది ఆస్ ఇట్ ఈజ్ గా ఇక్కడ ఇస్తున్నాను.

"అన్నా! నీకు పార్టీ ఇద్దామనుకుంటున్నాను. ముందుగా గోకుల్ చాట్ లో చాట్ తిని, లుంబిని పార్క్ లో లేజర్ షో చూసి, తర్వాత పంజాగుట్ట ఫ్లై ఓవర్ కింద డిన్నర్ చేద్దాం!! ఈ పార్టీ నీకోసమే! కొత్త బట్టలు వేసుకుని, నీ ఐడెంటిటి జనాలకు తెలియడం కోసం పాకెట్ లో ఏదయినా ఐడెంటిటి కార్డు పెట్టుకుని రా.. సాయంత్రం నీకోసం దిల్ షుక్ నగర్ ఫూట్ ఓవర్ బ్రిడ్జి కింద నల్ల బ్యాగు తో వెయిట్ చేస్తా!!" ఇది ఆ ఎస్.ఎం.ఎస్.

ఈ ఎస్. ఎం. ఎస్. మొదట రాసింది నేనే!

5 కామెంట్లు:

  1. హా.హా...హా..
    ఇన్నాళ్ళూ పిల్లలు తప్పిపోతే తెలుసుకొని అప్పగించడానికి అడ్రస్సు రాసిన స్లిప్పు పెట్టేవాళ్లం.ఇప్పుడు ఏమయినా అయితే మనల్ని ఎవరన్నా గుర్తుపట్తడానికి ఐడెంటీ కార్డులు పెట్టుకుని తిరగాలి.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. దిల్‍షుక్‍నగర్లో కలుస్తామన్న సంగతి మర్చిపోయి, నేను కేకే ఇంటి దగ్గర చాలా సేపు వేచి చూశాను నీ కోసం. అయినా ఎంతకీ రాలేదు!!!?

    ప్రత్యుత్తరంతొలగించు
  3. హ్హహ్హహ్హ...

    మీరు అక్కడకు వస్తారని నేను ఊహించలేదు కదా? !

    రాధికగారు.. ఇప్పటి పరిస్థితి అలాగే ఉంది. బయటకెళ్తే ఇంటికి తిరిగి వస్తామన్న నమ్మకమేలేదు.

    ప్రత్యుత్తరంతొలగించు
  4. కొత్త పాళీ గారు..
    క్షమించాలి.. నేను నవ్వింది ముందు గౌరి కుమార్ గారి కామెంట్ కు. తర్వాత రిప్లయ్ రాధిక గారికి ఇచ్ఛాను.

    ప్రత్యుత్తరంతొలగించు