బుధవారం 21 నవంబర్ 2007

పాలిచ్చే దున్నపోతులు

దున్నపోతునుండి పాలు పితుకుతున్నట్టుంది ఈ కాలం సినిమాల స్థితి. టైటిల్ ను పట్టి కథను లాగుతున్నారో లేక.. కథను బట్టి టైటిల్ రాస్తున్నారో అర్థం కావడం లేదు. కొన్ని మూవీల పేర్లు చెప్పడం వ్యర్థం కాని.. వాటిల్లో అయితే హీరో ఏమేం ఫీట్లు చేయగలడో, ఆక్టింగ్ ఎంత బాగా చేయగలడు, లేదా ఎన్ని వేషాలు మార్చగలడు.. ఇలాంటి విషయాలను చూపెట్టడానికి మాత్రమే తీస్తున్నారు. చిరుత సినిమా కేవలం హీరో నటన ను తెరకెక్కించడానికే రాసినట్టుంది కాని అదొక సినిమా, దాన్ని హీరోకోసం మాత్రమే జనాలు చూడరు అనే విషయం సదరు తెరవెనుక వ్యక్తులు మర్చిపోయారు. చిరంజీవిగారి తనయుడు కనుక ప్రతిభ చూపించాలనే తపన తప్ప సినిమాలో చూడదగ్గ అంశాలు లేవు అనేది వాస్తవం. తులసి సినిమా చూస్తున్నంతసేపు ఎందుకు చూస్తున్నానో తెలియలేదు. అలగే అతిధి కూడా..

ఈ కాలం హాస్యం అంటే అసభ్యమయిన మాటల కొలువు. అల్లోరా శిల్పాలు చూసే శ్రమ ఎందుకు? అని ముంబై భామల అందాలన్నీ తెర మీద ఆరేసి పారేస్తున్నారు. ఆరేసిన అందాలకోసం అయినా ఆ సినిమాలను చూస్తారని కాబోలు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు బాలివుడ్ ను చూసి టాలీవుడ్ అతివల అంగాంగ ప్రదర్శన చేస్తుంది. బుల్లి తెర దర్శకేంద్రులు కూడా ఈ ప్రతిభ కనపరిస్తే .... ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలనీ పాలిచ్చే దున్నపోతులు. (సినిమా ఎలా ఉన్నా చూసే వారున్నారు కదా మరి???)

ఏంటో... తులసి చూసి మైండ్ చెడి రాసాను. ఆయా ఫాన్స్ బాబులు నన్ను తిట్టే ప్రయత్నం చేయకండి.. నేను చేసిన కామెంట్లు డైరెక్టర్ల మీద కాని హీరోల మీద కాదు. కథ దర్శకత్వం బాగుంటేనే కదా సినిమా బాగుండేది..

1 కామెంట్లు: