ఆదివారం 30 డిసెంబర్ 2007

.... అదండీ విషయం.. పోస్టు రాయడం అయిపోయింది.

ట్రింగ్.. ట్రింగ్ అంటూ అరవడానికి నాదేం తాతల కాలం నాటి ఫోన్ కాదు. కాని రింగ్ టోన్ మాత్రం పాత పాటే.. ఉదయాన్నే "మాటరాని మౌనమిది.. మౌనవీణ గానమిది.." అంటూ మహర్షి సినిమా లోని పాట పాడుతుంది నా మొబైల్. నవీన్ అనే ఒక ఫ్రెండ్ కాల్ చేశాడు. మాట్లాడాడు..

కాల్ కట్ చేసి.. విషయానికి వస్తే..

వాడు నన్ను ఎప్పుడూ సలహాలు అడుగుతాడు. కొన్ని రోజుల క్రితం వాడొక కోర్సులో చేరితే అక్కడ ఒక మంచి బ్యూటీని చూసి గుండె, ప్రేమ బిన్ లో పడెస్కున్నాడు. మా ఫ్రెండ్స్ బిజినెస్ ల దగ్గర నుండి పర్సనల్ మాటర్స్ దాక అన్నిటికీ నన్నే సలహాలడుగుతారు ఇప్పటికీ. ఒక దుర్ముహూర్తాన కాల్ చేసి.. ఇది విషయం.. ఆ ఎర్ర డ్రెస్ పిల్లను చూసి మనసు పడేస్కున్నాను. ఏదయినా సలహా ఇచ్చి పుణ్యం కట్టుకో మామా! చచ్చి వచ్చే జన్మలో నీ కడుపున పుడతా! అన్నాడు. "స్టూపిడ్ ఫెల్లో! వచ్చే జన్మలో నన్ను ఆడపిల్లగా చేసి, నీ అయ్యతో లైన్ వేయిద్దమనుకుంటున్నావా? నేను అసలు నీకు హెల్ప్ చేయను పో!!" అన్నాను. ఏదోలా బ్రతిమాలుకుని మొత్తం మీద నా సలహాతో ఒక రెస్టారెంట్ కు డైలీ కస్టమర్ అయ్యాడు..

అంతవరకూ బాగానే ఉంది. ఉదయాన్నే కాల్ చేసి "మామా! నాకొక మంచి ఐడియా వచ్చింది. ఎంతో మంది ప్రేమికులకు నీ సలహాలు అవసరం. నువ్వు ఏదయినా చేసి అందరికీ సహాయం చెయ్యి." అన్నాడు. "ఓరి నీ ఇంట్లో చుంచెలుకలు కాపురం పెట్ట! నన్ను బ్రోకర్ ను చేసేద్దామనుకుంటున్నావా?" అన్నాను. "అలా కాదు రా! చెప్పెది విను. ఒక బూక్ రాసెయ్! అమ్మాయిని ప్రేమలో దించడం ఎలా! అని. మనమే పబ్లిష్ చేద్దాం! మంచి ప్రాఫిట్ ఉన్న సబ్జెక్టు.మార్కెట్ లో బుక్స్ అంత మంచివి లేవు. ఉన్నవి కూడా ఏ ఇంగ్లీషువో, లేదా వాటి ట్రాన్సిలేషన్స్ ఉన్నాయి. అవి శుధ్ధ దండగ. నువ్వు బాగా చెప్తావు, బాగా రాస్తావు. రాసెయ్ మామా! అని చెప్పి కాల్ కట్ చేశాడు.

ఆలోచిస్తే అదేదో బాగానే ఉంది అనిపించింది. అయినా ఇలాంటి బుక్స్ రాసి, తండ్రుల జేబులు కొడుకులతో ఖాళీ చేయించడం అవసరమా? అని ఆలోచించాను. కాని రెస్టారెంట్శ్, సినిమా హాల్స్, మొబైల్ నెట్వర్క్స్ కు మాత్రం చాలా ప్రాఫిట్ వస్తుంది, నేను బుక్ రాసేస్తే! అంటే దేశం డెవలప్ అవుతుంది. లవర్స్ పెరిగి పోతారు. లవ్ చేసి, చదువులు దొబ్బి ఏం చేయాలో అర్తం కాని వాళ్ళు, తండ్రుల ఆస్థులు ఉంటే రెస్టారెంట్లు, అప్పటికే తండ్రుల ఆస్థులు గర్ల్ ఫ్రెండ్ చేతుల్లో కరిగిపోతే అదే రెస్తారెంట్ లో పని చేస్తారు. హాపీ గా న్యూ జెనరేషన్ లవర్స్ ను అనలైజ్ చేస్తూ బ్రతుకుతారు! ....
....
(నా మనసులో నవ్వుకుంటూ అనుకున్న నా ఊహలు ఇవి. అంతే కాని.. ఆ లెవెల్ లో బుక్ రాస్తాను అని కాదు.!)

చాలా ఆలోచించాక! "ఉన్నవాడు ఊరికి పెద్ద! చచ్చిన వాడు కాటికి పెద్ద!" అన్నట్టు ఎలా బ్రతికేవాడు అలా బ్రతుకుతాడు లే అని.. ఒక శుభ ముహూర్తాన రాయడానికే నిర్నయించుకున్నాను.

టైం వీలు చేసుకుని ముందు పేజీ ప్రారంభించాను ఒక శుభముహూర్తాన. అందులో ఇంట్రడక్షన్ పార్టు రాయడం అనేది నా ప్రథమ కర్తవ్యం.. "ప్రేమ గురించి చదివే ముందు, ప్రేమించే ముందు, అమ్మాయిల మనస్తత్వం గురించి తెలుసుకోవాలి. వారికి నచ్చేవి, నచ్చనివి, సాధారణ మిడిల్ క్లాసు అమ్మాయిల నుండి, హై క్లసు హైటెక్ అమ్మాయిల వరకు అందరి మెంటాలిటీని అనలైజ్ చేయగలిగితే అమ్మయిలను ప్రేమలో దించడం సులభమవుతుంది.. .. .. బ్లా బ్లా బ్లా..."

ఇలా రాస్త్తూ పోతుంటే.. ఈ సోది అవసరమా? బుక్ రాయాలంటే ముందు అమ్మయిల సైకాలజీ బాడీ లాంగ్వేజి గురించి రాసి, వాళ్ల ఇష్టా ఇష్టాల గురించి రాసి.. ఇంకా ఒక వంద ఎక్సాంపుల్స్ ఇచ్చేసరికి నేను బొందలోకి పోయే ఏజ్ వస్తుంది.. ఈ పనికి మాలిన పని అవసరమా? అనిపించింది. దీని బదులు సక్సెస్ గురించి ఆర్టికల్స్ రాసినా ఒక పది మందికి ఉపయోగ పడతాయి. అనిపించింది. ఇంక రాయడం ఆపేశాను. ఆ పని పక్కన పెట్టేసి ఆ విషయం అక్కడితో మర్చిపోయాను.

నవీన్ కాల్ చేసి, " మామా! ఎక్కడీదాకా వచ్చింది బుక్ రాయడం?" అని అడిగాడు. "చెప్తాను కాని! ఈ విషయం విన్నావా? మా ఫ్రెండ్ ఒకడు పెళ్ళి చేస్కోబోతూ, పెళ్ళికి పనులకు సాయం గా ఉంటాడని వాళ్ల పెద్దమ్మ కొడుకును పెళ్ళి తర్వాత కూడా ఇంట్లో ఉంచుకుంటే, పెళ్ళీ పిల్లను ఎత్తుకెళ్ళాడట. ముందు వాన్ని వెతకాలి రా మనం!" అని చెప్పాను. "వెతికి ఏం లాభం? ఎలాగో వెళ్ళిపోయారు. ఎవరు మాత్రం ఏం చేయగలరు?" అన్నాడు. వాన్ని వెతికి మనం అనుకున్న పుస్తకం వాడితో రాయిద్దాం! పెళ్ళి పిల్లను పెల్లయిన వారం లో లేపుకెళ్ళాడంటే, వాడు బాగా పనికి వస్తాడు, ఈ బుక్ రాయడానికి. అని చెప్పి ఫోన్ కట్ చేశాను.

కొడుకులు గుడ్డలు ఊడదీసుకు పోతే, మనవడు మొల తాడు లాక్కెళ్ళాడట... ఈ బుక్ మొదలు పెడితే ఫ్యూచర్ లో నా పరిస్తితి ఇలానే ఉంటుంది.

.... అదండీ విషయం.. పోస్టు రాయడం అయిపోయింది.

6 కామెంట్లు:

  1. మీ టపా అదిరందండోయ్. మధ్య మధ్యలో సామెతలు డీటీయస్ సౌండ్ తో పేలాయి

    ప్రత్యుత్తరంతొలగించు
  2. చాల బాగుంది మాస్టరు మీ way of writting, dialogues, నవ్వొచ్చింది so పుస్తకం రయట్లెదు అన్న మాట కనీసం బ్లాగ్ రాయగలరెమొ ఆలొచించండి.

    next blog కోసం ఎదురుచుస్తున్నా

    సుబ్బు

    ప్రత్యుత్తరంతొలగించు
  3. "కొడుకులు గుడ్డలు ఊడదీసుకు పోతే, .."
    హ హ్హ హ్హ .. సామెతలు సూపరు.

    ప్రత్యుత్తరంతొలగించు
  4. నేను వచన రచనలకే పరిమితమై పోతే బగుంటుందేమో! కవితలు నాకు సూట్ అయ్యేలా లేవు. ఎమోషనల్ వి అసలే సూట్ అవవు నాకు. కవితలెలా ఉన్నయ్ అని ఒక స్నేహితురాలిని అడిగితే! "తోక తీసేస్తే మాత్రం కోతి మనిషవుద్దా? నీకు ఎమోషనల్ డైలాగ్స్ పనికి రావు కాని, నీ కోతి బుద్దులన్నీ రాతల్లో చూపిస్తూ సెటిల్ అయిపో." అని ఒక ఉచిత సలహా ఇచ్చింది. ఆలోచించాల్సిన విషయమే!!

    స్నేహితులకు, పెద్దలకు ధన్యవాదాలు. చెప్పుకుంటూ పోతే, నా జీవితం లో నేను చేసిన పనుల లిస్టు చాలా ఉంది. మొత్తం కాకపోయినా కొన్ని రాసి మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేస్తాను.

    ప్రత్యుత్తరంతొలగించు
  5. సామెతలు చాలా బాగున్నాయి, మీ రచనా శైలికూడా బాగుంది.

    ప్రత్యుత్తరంతొలగించు