తెలుగులో రాయాలి, తెలుగులో మాట్లాడాలి, తెలుగు సాహిత్య విలువలు తగ్గుతున్నాయి.... ఇలా చాలా రకాలుగా ఆర్గ్యూ చేసేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, పూనకం వచ్చినట్టు.. తీరా చూస్తే కొన్ని సాంకేతిక పదాల దగ్గర తెల్లమొహం వేయక తప్పడం లేదు. డిక్షనరీ తిరిగేయాల్సి వస్తుంది.
ఒకసారి నా స్నేహితునితో సంభాషణ ఇలా సాగుతుంది.
నేను: ఇంగ్లీషు వాడకుండా తెలుగు మాట్లాడడానికి ట్రై చేసి చూడు ఒకసారి.
స్నేహితుడి: భాష ఏదయినా భావం ఒకటే కదా! నల్ల మేకయినా తెల్ల మేకయినా "మే" అనే అరుస్తాయి. మేకలు వేరు అయినా అరుపులు ఒకటే కదా? అలాగే భాషలు వేరయినా భావం ఒకటే కదా?
నేను: అలాంటిదే ఇంకొకటి చెప్పు ఎక్సాంపుల్!!
స్నేహితుడు: నల్ల కాకయినా తెల్ల కాకయినా "కావు" అనే అరుస్తాయి..... (అనేసి నాలుక కరుచుకున్నాడు.)
భాషలు వేరు అయినా భావం ఒకటే కావచ్చు, కాని దేని రూపం దానిదే.. కొన్నిటికి రూపం అనేదే ఉండదేమో!! దేశ భాషలందు తెలుగు లెస్స...
సోమవారం 17 డిసెంబర్ 2007
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
హకల్ బెరీ ఫిన్ నవలలో హక్ కీ, నీగ్రో బానిస జిం కీ ఒక వాదన జరుగుతుంది.
ప్రత్యుత్తరంతొలగించుహక్: ఫ్రెంచి వాడొచ్చి నీతో బోన్ జోర్ అంటాడు.
జిం: ఎవడన్నా నాతో అలా పేల్తే వాడి దవడ వాయగొడతా!
హక్: కాదు కాదు, అలా అంటే గుడ్ మాణింగ్ అని అర్థం.
జిం: మరి ఆ మాటే ఏడవచ్చు కదా? ఆ ప్తలతిక్క వాగుడెందుకు వాగుతాడు ఫ్రెంచి వాడు?
హక్:(బోధపరచడానికి ఓపికగా) ఆవు మనలా మాట్లాడుతుందా?
జిం: లేదు
హక్: కుక్క మనలా మాట్లాడుతుందా?
జిం: లేదు.
హక్: అలాగే ఫ్రెంచి వాడు కూడా వేరేగా మాట్లాడుతాడు.
జిం: ఓహో అలాగా? ఐతే హక్ గారూ, నాకో సందేహం. ఆవు మనిషేనా?
హక్: కాదు.
జిం: కుక్క మనిషేనా?
హక్: కాదు.
జిం: ఫ్రెంచి వాడు మనిషేనా?
హక్: అవును.
జిం: మరి వాడూ మనిషైతే మనిషిలాగా ఎందుకు మాట్లాడ్డు?
హక్: ???
వెంటనే తెలుగు ఒక్కముక్క కూడా వాడకుండా నీ చిన్ననాటి జ్ఞాపకమొకటి చెప్పవోయ్ అని ఎదురు ప్రశ్న వెయ్యాలండి
ప్రత్యుత్తరంతొలగించుతెలుగు వాడకుండా చిన్ననాటి జ్ఞాపకమా? కొంచెం కష్ట తరమే!! ఒక వేళ చెప్పినా కూడా "ఒక్క రోజులో షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేసిన కన్నడ సినిమా " లా ఉంటుంది..
ప్రత్యుత్తరంతొలగించు