ట్రింగ్.. ట్రింగ్ అంటూ అరవడానికి నాదేం తాతల కాలం నాటి ఫోన్ కాదు. కాని రింగ్ టోన్ మాత్రం పాత పాటే.. ఉదయాన్నే "మాటరాని మౌనమిది.. మౌనవీణ గానమిది.." అంటూ మహర్షి సినిమా లోని పాట పాడుతుంది నా మొబైల్. నవీన్ అనే ఒక ఫ్రెండ్ కాల్ చేశాడు. మాట్లాడాడు..
కాల్ కట్ చేసి.. విషయానికి వస్తే..
వాడు నన్ను ఎప్పుడూ సలహాలు అడుగుతాడు. కొన్ని రోజుల క్రితం వాడొక కోర్సులో చేరితే అక్కడ ఒక మంచి బ్యూటీని చూసి గుండె, ప్రేమ బిన్ లో పడెస్కున్నాడు. మా ఫ్రెండ్స్ బిజినెస్ ల దగ్గర నుండి పర్సనల్ మాటర్స్ దాక అన్నిటికీ నన్నే సలహాలడుగుతారు ఇప్పటికీ. ఒక దుర్ముహూర్తాన కాల్ చేసి.. ఇది విషయం.. ఆ ఎర్ర డ్రెస్ పిల్లను చూసి మనసు పడేస్కున్నాను. ఏదయినా సలహా ఇచ్చి పుణ్యం కట్టుకో మామా! చచ్చి వచ్చే జన్మలో నీ కడుపున పుడతా! అన్నాడు. "స్టూపిడ్ ఫెల్లో! వచ్చే జన్మలో నన్ను ఆడపిల్లగా చేసి, నీ అయ్యతో లైన్ వేయిద్దమనుకుంటున్నావా? నేను అసలు నీకు హెల్ప్ చేయను పో!!" అన్నాను. ఏదోలా బ్రతిమాలుకుని మొత్తం మీద నా సలహాతో ఒక రెస్టారెంట్ కు డైలీ కస్టమర్ అయ్యాడు..
అంతవరకూ బాగానే ఉంది. ఉదయాన్నే కాల్ చేసి "మామా! నాకొక మంచి ఐడియా వచ్చింది. ఎంతో మంది ప్రేమికులకు నీ సలహాలు అవసరం. నువ్వు ఏదయినా చేసి అందరికీ సహాయం చెయ్యి." అన్నాడు. "ఓరి నీ ఇంట్లో చుంచెలుకలు కాపురం పెట్ట! నన్ను బ్రోకర్ ను చేసేద్దామనుకుంటున్నావా?" అన్నాను. "అలా కాదు రా! చెప్పెది విను. ఒక బూక్ రాసెయ్! అమ్మాయిని ప్రేమలో దించడం ఎలా! అని. మనమే పబ్లిష్ చేద్దాం! మంచి ప్రాఫిట్ ఉన్న సబ్జెక్టు.మార్కెట్ లో బుక్స్ అంత మంచివి లేవు. ఉన్నవి కూడా ఏ ఇంగ్లీషువో, లేదా వాటి ట్రాన్సిలేషన్స్ ఉన్నాయి. అవి శుధ్ధ దండగ. నువ్వు బాగా చెప్తావు, బాగా రాస్తావు. రాసెయ్ మామా! అని చెప్పి కాల్ కట్ చేశాడు.
ఆలోచిస్తే అదేదో బాగానే ఉంది అనిపించింది. అయినా ఇలాంటి బుక్స్ రాసి, తండ్రుల జేబులు కొడుకులతో ఖాళీ చేయించడం అవసరమా? అని ఆలోచించాను. కాని రెస్టారెంట్శ్, సినిమా హాల్స్, మొబైల్ నెట్వర్క్స్ కు మాత్రం చాలా ప్రాఫిట్ వస్తుంది, నేను బుక్ రాసేస్తే! అంటే దేశం డెవలప్ అవుతుంది. లవర్స్ పెరిగి పోతారు. లవ్ చేసి, చదువులు దొబ్బి ఏం చేయాలో అర్తం కాని వాళ్ళు, తండ్రుల ఆస్థులు ఉంటే రెస్టారెంట్లు, అప్పటికే తండ్రుల ఆస్థులు గర్ల్ ఫ్రెండ్ చేతుల్లో కరిగిపోతే అదే రెస్తారెంట్ లో పని చేస్తారు. హాపీ గా న్యూ జెనరేషన్ లవర్స్ ను అనలైజ్ చేస్తూ బ్రతుకుతారు! ....
....
(నా మనసులో నవ్వుకుంటూ అనుకున్న నా ఊహలు ఇవి. అంతే కాని.. ఆ లెవెల్ లో బుక్ రాస్తాను అని కాదు.!)
చాలా ఆలోచించాక! "ఉన్నవాడు ఊరికి పెద్ద! చచ్చిన వాడు కాటికి పెద్ద!" అన్నట్టు ఎలా బ్రతికేవాడు అలా బ్రతుకుతాడు లే అని.. ఒక శుభ ముహూర్తాన రాయడానికే నిర్నయించుకున్నాను.
టైం వీలు చేసుకుని ముందు పేజీ ప్రారంభించాను ఒక శుభముహూర్తాన. అందులో ఇంట్రడక్షన్ పార్టు రాయడం అనేది నా ప్రథమ కర్తవ్యం.. "ప్రేమ గురించి చదివే ముందు, ప్రేమించే ముందు, అమ్మాయిల మనస్తత్వం గురించి తెలుసుకోవాలి. వారికి నచ్చేవి, నచ్చనివి, సాధారణ మిడిల్ క్లాసు అమ్మాయిల నుండి, హై క్లసు హైటెక్ అమ్మాయిల వరకు అందరి మెంటాలిటీని అనలైజ్ చేయగలిగితే అమ్మయిలను ప్రేమలో దించడం సులభమవుతుంది.. .. .. బ్లా బ్లా బ్లా..."
ఇలా రాస్త్తూ పోతుంటే.. ఈ సోది అవసరమా? బుక్ రాయాలంటే ముందు అమ్మయిల సైకాలజీ బాడీ లాంగ్వేజి గురించి రాసి, వాళ్ల ఇష్టా ఇష్టాల గురించి రాసి.. ఇంకా ఒక వంద ఎక్సాంపుల్స్ ఇచ్చేసరికి నేను బొందలోకి పోయే ఏజ్ వస్తుంది.. ఈ పనికి మాలిన పని అవసరమా? అనిపించింది. దీని బదులు సక్సెస్ గురించి ఆర్టికల్స్ రాసినా ఒక పది మందికి ఉపయోగ పడతాయి. అనిపించింది. ఇంక రాయడం ఆపేశాను. ఆ పని పక్కన పెట్టేసి ఆ విషయం అక్కడితో మర్చిపోయాను.
నవీన్ కాల్ చేసి, " మామా! ఎక్కడీదాకా వచ్చింది బుక్ రాయడం?" అని అడిగాడు. "చెప్తాను కాని! ఈ విషయం విన్నావా? మా ఫ్రెండ్ ఒకడు పెళ్ళి చేస్కోబోతూ, పెళ్ళికి పనులకు సాయం గా ఉంటాడని వాళ్ల పెద్దమ్మ కొడుకును పెళ్ళి తర్వాత కూడా ఇంట్లో ఉంచుకుంటే, పెళ్ళీ పిల్లను ఎత్తుకెళ్ళాడట. ముందు వాన్ని వెతకాలి రా మనం!" అని చెప్పాను. "వెతికి ఏం లాభం? ఎలాగో వెళ్ళిపోయారు. ఎవరు మాత్రం ఏం చేయగలరు?" అన్నాడు. వాన్ని వెతికి మనం అనుకున్న పుస్తకం వాడితో రాయిద్దాం! పెళ్ళి పిల్లను పెల్లయిన వారం లో లేపుకెళ్ళాడంటే, వాడు బాగా పనికి వస్తాడు, ఈ బుక్ రాయడానికి. అని చెప్పి ఫోన్ కట్ చేశాను.
కొడుకులు గుడ్డలు ఊడదీసుకు పోతే, మనవడు మొల తాడు లాక్కెళ్ళాడట... ఈ బుక్ మొదలు పెడితే ఫ్యూచర్ లో నా పరిస్తితి ఇలానే ఉంటుంది.
.... అదండీ విషయం.. పోస్టు రాయడం అయిపోయింది.
ఆదివారం 30 డిసెంబర్ 2007
శనివారం 29 డిసెంబర్ 2007
ఖాళీ జిలెట్ ట్యూబు..
సిటీ రోడ్ల పక్కన చెత్తలా, ఎన్ని సార్లు షేవ్ చేసినా పెరిగిపోతూ ఉంది నా గడ్డం.. విసుగెత్తి తీయడం మానేస్తే అమెరికలో బిల్డింగుల్లా ఎదిగిపోతుంది. నాకు జార్జ్ బుష్ (bush=పొద) అని పేరు పెట్ట్లాల్సింది అనిపించింది. గడ్డం చాలా పెరుగుతుంది Bush లాగ. చిన్నతనం లో అద్దం లో చూస్కుని నాకు గడ్డం వస్తే ఎలా ఉంటుందా? అని మొహానికి కర్రబొగ్గు రాసుకుని మరీ చూస్కునేవాన్ని. మా తాతయ్య అనేవారు, "మనవడా! నీకు సింహం గడ్డం వస్తుంది." అని. పైన తథాస్తు దేవతలు ఉంటారనేది నిజమేనేమో! సింహం జూలులా పెరిగిపోతుంది. ఒకరోజు మా పిన్ని కొడుకు (వయసు ఆరు సం||) వాడి టాలెంట్ ఉపయోగించి మొహానికి ఏకంగా గేట్ కు వెయ్యడానికి తెచ్చిన నల్లని నేరోలాక్ ఆయిల్ పెయింట్ రాసేస్కున్నాడు. కడగడానికి చుక్కలు కనపడ్డాయి. అప్పుడు మనసులో అనుకోబోయి బయటికే అనేశా... " నీకు నా ఏజ్ వస్తే ఈ నెరోలాక్ పెయింటే బెస్ట్ అనిపిస్తుంది." అని. గడ్డం బాగా ఉన్నందుకు ఒక వైపు సంతోషం గా ఉన్నా, తీసేటప్పుడు మాత్రం ఆడవాళ్ళపనే బెస్ట్ అనిపిస్తుంది. ఒకప్పటి నా టెంత్ స్నేహితుడు శేఖర్ అని, పిల్లికి చైనా మీసలు పెట్టినట్టు ఉండేవాడు. గడ్డం ఉండేది కాదు. "ఏంటి శేఖర్! ఇంకా గడ్డం రాలేదు?" అంటే, ఆ పిల్లి మీసాలు మెలి వేసి, మా వంశం లో ఎవరికీ గడ్డం లేదు అనేవాడు. నవ్వుకునేవాన్ని చాలా.
ఇక పోతే మొన్న షేవింగ్ చేయించుకోవడానికి సెలూన్ కు వెళ్ళాను. సెలూన్ కు వెళ్ళడం చాలా తక్కువ నేను. ఆ సెలూన్ ఇంటి దగ్గరే అయినా, అంత పరిచయం లేదు. వెళ్ళి చైర్ లో కూర్చున్నాక ఒక బుర్ర మీసాల వాడు వచ్చి నా వెనుక నిల్చున్నాడు. నా ముందున్న అద్దం లో నేను అతని మీసాల్నే తదేకంగా చూస్తున్నాను. ట్రైన్ బ్రేకులు పడుతున్న శబ్దం చేస్తూ గొంతు సవరించుకుని, " నేను మిలట్రీ నుండి వచ్చాను." అని అన్నాడు. అతని సుమధుర కంఠం మత్తులో నుండి ఇంకా తేరుకోని నేను.. ఆలోచించకుండా, "నేను నడుచుకుంటూ వచ్చాను." అని చెప్పాను. క్షణం లో తేరుకుని ఏమన్నానో గుర్తుకు తెచ్చుకుని, అతని మాటను, నా సమాధానాన్ని తలచుకుని గట్టిగా నవ్వేశాను. నాకసలే నవ్వాగదు. నా నవ్వు చూసి ఆ యుద్ద వీరుడు నల్ల తేలు చంకలో కుట్టినట్టు, అదోలా మొహం పెట్టి నన్నే చూస్తున్నాడు. పక్కనే ఉన్న ఒక అతను, "గోల్కొండ దగ్గర మిలటరీ కాంప్ వేస్తే వాళ్లకు గడ్డాలు చేయడానికి వెళ్ళాడు ఒకసారి. పెద్ద గొప్పలు చెప్పుకుంటాడు, అలాగే." అన్నాడు. ఇంక నాకు అసలు నవ్వు ఆగలేదు. కళ్లవెంట నీళ్ళు కారిపోతున్నాయి. ఎందుకో ఆ రోజు మాంచి నవ్వేమూడ్ లో ఉన్నాను. ఇంక కంట్రోల్ చేస్కోలేక, అక్కడ నవ్వుతూ ఉండలేక షేవింగ్ చేస్కోకుండానే వచ్చేశాను.
దాని ఫలితమే ఇది. వడ్లు దులిపాక మిగిలిన గడ్డికుప్పలా తయారయ్యింది ఫేసు. అద్దం లో చూస్కున్నాను. అసలే నా పొడవాటి చింపిరి జుట్టుకు, ఈ గడ్డం తోడై "కింగ్ కాంగ్" లో గోరిల్లా లా అనిపించాను. ఇంక దీన్ని ఇలా వదిలేయకూడదు అని జన్మభూమి కార్యక్రమానికి సిద్దమయ్యాను. అంతా సరంజామా సిద్దం చేసుకున్నాక, బ్రష్ మీద షేవింగ్ క్రీమ్ రాయాలని జిలెట్ ట్యూబు తీసి మృదువుగా నొక్కాను. నో రిప్లై.. కొంచెం గట్టిగా నొక్కి చూశాను. మళ్ళీ నో రిప్లై. అయిపోయిందా? "పెళ్ళి చూపులకు వచ్చిన అబ్బాయి లడ్డు కొరకబోతూ పళ్ళూడగొట్టుకుంటే, ఆ పెళ్ళి కూతురు ఎంత షాక్ అవుతుందో..", అంత షాక్ అయ్యాను. "అకటా! ద్రౌపతి వస్త్రాపహరణం సీన్ లో కృష్ణుని దగ్గర చీరలు, షేవింగ్ టైం లో జిలెట్ జెల్ అయిపోకూడదే!!" ఎదవ డైలాగ్ ఒకటి విసిరాను. (నేను ఒంటరిగా ఉంటాను. అందువలన ఫీలింగ్స్ బయటకే అనడం అలవాటు.) టైం చూస్తే రాత్రి పదకొండు.. "ఈ రోజు పని ఇప్పుడే చెయ్యి, కుదిరితే రేపటి పని కూడా ఇప్పుడే చెయ్యి.." అంటూ లెక్చర్ లు ఇచ్చేవాళ్ళకు ఈ జిలెట్ ట్యూబు గిఫ్ట్ గా ఇవాలనిపించింది.
ఇంకా గట్టికా నొక్కాను ట్యూబును. ఈ సారి బబూల్స్ వస్తున్నాయి. మాంచి అలోచన వచ్చి, మగ్ లో డిటర్జెంట్ కలిపి ఈ ట్యూబ్ దాన్లో ముంచి, గట్టిగా నొక్కుతూ బబుల్స్ తో ఆడుకున్నా కాసేపు. సరదా తీరాక షేవింగ్ పని రేపటికి వాయిదా వేసి.. ఈ పోస్టు రాశాను.
అదీ సంగతి...
ఇక పోతే మొన్న షేవింగ్ చేయించుకోవడానికి సెలూన్ కు వెళ్ళాను. సెలూన్ కు వెళ్ళడం చాలా తక్కువ నేను. ఆ సెలూన్ ఇంటి దగ్గరే అయినా, అంత పరిచయం లేదు. వెళ్ళి చైర్ లో కూర్చున్నాక ఒక బుర్ర మీసాల వాడు వచ్చి నా వెనుక నిల్చున్నాడు. నా ముందున్న అద్దం లో నేను అతని మీసాల్నే తదేకంగా చూస్తున్నాను. ట్రైన్ బ్రేకులు పడుతున్న శబ్దం చేస్తూ గొంతు సవరించుకుని, " నేను మిలట్రీ నుండి వచ్చాను." అని అన్నాడు. అతని సుమధుర కంఠం మత్తులో నుండి ఇంకా తేరుకోని నేను.. ఆలోచించకుండా, "నేను నడుచుకుంటూ వచ్చాను." అని చెప్పాను. క్షణం లో తేరుకుని ఏమన్నానో గుర్తుకు తెచ్చుకుని, అతని మాటను, నా సమాధానాన్ని తలచుకుని గట్టిగా నవ్వేశాను. నాకసలే నవ్వాగదు. నా నవ్వు చూసి ఆ యుద్ద వీరుడు నల్ల తేలు చంకలో కుట్టినట్టు, అదోలా మొహం పెట్టి నన్నే చూస్తున్నాడు. పక్కనే ఉన్న ఒక అతను, "గోల్కొండ దగ్గర మిలటరీ కాంప్ వేస్తే వాళ్లకు గడ్డాలు చేయడానికి వెళ్ళాడు ఒకసారి. పెద్ద గొప్పలు చెప్పుకుంటాడు, అలాగే." అన్నాడు. ఇంక నాకు అసలు నవ్వు ఆగలేదు. కళ్లవెంట నీళ్ళు కారిపోతున్నాయి. ఎందుకో ఆ రోజు మాంచి నవ్వేమూడ్ లో ఉన్నాను. ఇంక కంట్రోల్ చేస్కోలేక, అక్కడ నవ్వుతూ ఉండలేక షేవింగ్ చేస్కోకుండానే వచ్చేశాను.
దాని ఫలితమే ఇది. వడ్లు దులిపాక మిగిలిన గడ్డికుప్పలా తయారయ్యింది ఫేసు. అద్దం లో చూస్కున్నాను. అసలే నా పొడవాటి చింపిరి జుట్టుకు, ఈ గడ్డం తోడై "కింగ్ కాంగ్" లో గోరిల్లా లా అనిపించాను. ఇంక దీన్ని ఇలా వదిలేయకూడదు అని జన్మభూమి కార్యక్రమానికి సిద్దమయ్యాను. అంతా సరంజామా సిద్దం చేసుకున్నాక, బ్రష్ మీద షేవింగ్ క్రీమ్ రాయాలని జిలెట్ ట్యూబు తీసి మృదువుగా నొక్కాను. నో రిప్లై.. కొంచెం గట్టిగా నొక్కి చూశాను. మళ్ళీ నో రిప్లై. అయిపోయిందా? "పెళ్ళి చూపులకు వచ్చిన అబ్బాయి లడ్డు కొరకబోతూ పళ్ళూడగొట్టుకుంటే, ఆ పెళ్ళి కూతురు ఎంత షాక్ అవుతుందో..", అంత షాక్ అయ్యాను. "అకటా! ద్రౌపతి వస్త్రాపహరణం సీన్ లో కృష్ణుని దగ్గర చీరలు, షేవింగ్ టైం లో జిలెట్ జెల్ అయిపోకూడదే!!" ఎదవ డైలాగ్ ఒకటి విసిరాను. (నేను ఒంటరిగా ఉంటాను. అందువలన ఫీలింగ్స్ బయటకే అనడం అలవాటు.) టైం చూస్తే రాత్రి పదకొండు.. "ఈ రోజు పని ఇప్పుడే చెయ్యి, కుదిరితే రేపటి పని కూడా ఇప్పుడే చెయ్యి.." అంటూ లెక్చర్ లు ఇచ్చేవాళ్ళకు ఈ జిలెట్ ట్యూబు గిఫ్ట్ గా ఇవాలనిపించింది.
ఇంకా గట్టికా నొక్కాను ట్యూబును. ఈ సారి బబూల్స్ వస్తున్నాయి. మాంచి అలోచన వచ్చి, మగ్ లో డిటర్జెంట్ కలిపి ఈ ట్యూబ్ దాన్లో ముంచి, గట్టిగా నొక్కుతూ బబుల్స్ తో ఆడుకున్నా కాసేపు. సరదా తీరాక షేవింగ్ పని రేపటికి వాయిదా వేసి.. ఈ పోస్టు రాశాను.
అదీ సంగతి...
నా కన్న తల్లి ఏడుస్తుంది..
నా కన్న తల్లి ఏడుస్తుంది..
ఎవరు...?
ఎవరా మూర్ఖ్హుడు?..
రైతా....?
విసిరేది ఎరువులా...? విత్తనాలా...?
అవి ఎ.కె 47 తూటాలై
నా తల్లి గుండెల్ని చీలుస్తున్నాయి..
పాలు లేని చన్నులను
ఎరువులు విషమయం చేస్తుంటే..
హైబ్రిడు విత్తనాలు..
ఉక్కు గొట్టాల్లాంటి వేళ్ళతో,
నా తల్లి రక్తాన్నే పీలుస్తున్నాయి...
ఎవడది.. ?
ఎవడా ఆసామి.. ?
విసురుతున్నాడు ప్లాస్టిక్ సంచిని..
టెర్రరిస్టుల హాండ్ గ్రానైడ్ లా..
ఎవరు...?
ఎవరా మనిషి..?
ఇండస్ట్రియలిస్టా.. లేక
డబ్బు రక్తం లో ఇంకిపోయి
మెదడు మొద్దుబారిన
లూకోడైస్ట్రఫీ** వ్యాధిగ్రస్తుడా?
నా జన్మభూమి పాలయిన
భూగర్భ జలాల్లో
విషరసాయనాలు కలుపుతున్నాడు..
***
రాతిరమ్మ చల్లగాలి పంపుతుంటే,
వెన్నెలమ్మ వెలుగులు పంచుతుంటే..
నా తల్లి,
ఆ వెలుగులో
పాలిపోయిన తన ఎడారి బుగ్గలను చూసుకుంటూ,
ఒక్క కన్నీటి చుక్క కారిస్తే....
రెప్పలయినా దాటని
ఆ అమృత జలాన్ని,
మోటార్లతో లాగేస్తున్నారు.
ఇది నేటి తరం అభివృద్దని
కళ్ళు లేని పేపర్లు చెప్తుంటే,
పతనా వస్తకు చేరుకున్న ప్రపంచం,
ముందుకు పోతుందని..
గుడ్డి మేధావులు చెప్తున్నారు.
ఒక్క తూటాకే ఏనుగు చస్తుందా.. అని,
ప్రతీ వాడూ కలుషితమనే తూటాలతో,
భూమాత గుండెలను కుళ్ళబొడుస్తున్నాడు..
...
ఈ విషహోమం ఆగేదెన్నటికి?
ఓ వాసుదేవుడా?
ఆక్రోషించక నువ్వయినా వేడి తగ్గించవయ్యా!!
నీ నేస్తం కష్టకాలం లో ఉంది..
ఆదుకోవయ్యా..!!
....
....
....
(లూకోడైస్ట్రఫీ అనేది ఒక శాశ్వత నివారణ లేని మెదడు సంబంధిత వ్యాధి. ఈ వ్యాధిగ్రస్తుల మెదడులోని అన్ని విభాగాలు ఒకదానితో ఒకటి కలిగి ఉన్న మెంటల్ లింక్స్ ను కోల్పోతాయి. శరీరం లోని ఆయా భాగాలు వాటి కార్యాలను సక్రమంగా నిర్వర్తించలేవు.)
ఎవరు...?
ఎవరా మూర్ఖ్హుడు?..
రైతా....?
విసిరేది ఎరువులా...? విత్తనాలా...?
అవి ఎ.కె 47 తూటాలై
నా తల్లి గుండెల్ని చీలుస్తున్నాయి..
పాలు లేని చన్నులను
ఎరువులు విషమయం చేస్తుంటే..
హైబ్రిడు విత్తనాలు..
ఉక్కు గొట్టాల్లాంటి వేళ్ళతో,
నా తల్లి రక్తాన్నే పీలుస్తున్నాయి...
ఎవడది.. ?
ఎవడా ఆసామి.. ?
విసురుతున్నాడు ప్లాస్టిక్ సంచిని..
టెర్రరిస్టుల హాండ్ గ్రానైడ్ లా..
ఎవరు...?
ఎవరా మనిషి..?
ఇండస్ట్రియలిస్టా.. లేక
డబ్బు రక్తం లో ఇంకిపోయి
మెదడు మొద్దుబారిన
లూకోడైస్ట్రఫీ** వ్యాధిగ్రస్తుడా?
నా జన్మభూమి పాలయిన
భూగర్భ జలాల్లో
విషరసాయనాలు కలుపుతున్నాడు..
***
రాతిరమ్మ చల్లగాలి పంపుతుంటే,
వెన్నెలమ్మ వెలుగులు పంచుతుంటే..
నా తల్లి,
ఆ వెలుగులో
పాలిపోయిన తన ఎడారి బుగ్గలను చూసుకుంటూ,
ఒక్క కన్నీటి చుక్క కారిస్తే....
రెప్పలయినా దాటని
ఆ అమృత జలాన్ని,
మోటార్లతో లాగేస్తున్నారు.
ఇది నేటి తరం అభివృద్దని
కళ్ళు లేని పేపర్లు చెప్తుంటే,
పతనా వస్తకు చేరుకున్న ప్రపంచం,
ముందుకు పోతుందని..
గుడ్డి మేధావులు చెప్తున్నారు.
ఒక్క తూటాకే ఏనుగు చస్తుందా.. అని,
ప్రతీ వాడూ కలుషితమనే తూటాలతో,
భూమాత గుండెలను కుళ్ళబొడుస్తున్నాడు..
...
ఈ విషహోమం ఆగేదెన్నటికి?
ఓ వాసుదేవుడా?
ఆక్రోషించక నువ్వయినా వేడి తగ్గించవయ్యా!!
నీ నేస్తం కష్టకాలం లో ఉంది..
ఆదుకోవయ్యా..!!
....
....
....
(లూకోడైస్ట్రఫీ అనేది ఒక శాశ్వత నివారణ లేని మెదడు సంబంధిత వ్యాధి. ఈ వ్యాధిగ్రస్తుల మెదడులోని అన్ని విభాగాలు ఒకదానితో ఒకటి కలిగి ఉన్న మెంటల్ లింక్స్ ను కోల్పోతాయి. శరీరం లోని ఆయా భాగాలు వాటి కార్యాలను సక్రమంగా నిర్వర్తించలేవు.)
శుక్రవారం 28 డిసెంబర్ 2007
అంతా మాయ..
ఘనీభవించిన నా హృదయం లో
కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి.
ఎండకు ఎండి, వానకు తడిచి
చలిలో మొద్దుబారిన నా హృదయం..
షాజాహాన్ తాజ్‘మహల్ లా శిధిలమవుతూ..
ఆగిఆగి సవ్వడి చేస్తుంది.
ఎక్కడో దూరంగా నువ్వు..
ఆకాశం లో అరుంధతీ నక్షత్రంలా!!
స్మశాన నిశ్శబ్దం లో,
పెళ పెళ మని శబ్దం చేస్తూ,
నా కదలిక నీ వైపుకు-
విఫలయత్నం చేస్తూ..
అప్రయత్నం గా..
ప్రాణం లేని నా గాజు కళ్ళలో
ఒక కన్నీటి బిందువు.
...
లబ్ డబ్..
లబ్ డబ్..
నిశ్శబ్దం..
నిశ్శబ్దం..
నిశ్శబ్దం..
స్థబ్దమయిందా కాలం..
లేదే..
నాలా ఒంతరిదయిన ఒక వీధి దీపం..
మిలుకు మిలుకు మంటూ..
మతం గోడల్లాంటి నల్లని చీకటి కవచాల్ని,
చీల్చే విఫల యత్నం చేస్తూ
తన ఉనికిని చాటుతుంది..
మరి నా ఉనికి ఎక్కడ???
...
...
తుఫాను సమయం లో నీ చేజారిన
నా మనసు గొడుగు,
దూరం గా కొట్టుకు పోతూ,
నీకేసి చూస్తూ,
మౌనం గా రోదిస్తుంది..
నీవు పీల్చే ఆ గాలిలో నా శ్వాస లేదు.. ..
నీ మనసులో చోటు సంపాదించలేని నన్ను,
ఈ ప్రపంచం కూడ వెలివేస్తుంది.
...
ఇది ముగింపు కాదు..
నీ ప్రేమకోసం వేచే
నా మనోగమనానికి
ఇదే ఆరంభం...
మళ్ళీ కలుస్తా..
నీ ప్రేమను అర్థిస్తూ..
******
టక్ టక్..
టక్ టక్..
కుమ్మరి కొలిమిలో కాలిన ఉక్కును,
నలగ్గొడుతున్న శబ్దం..
కర్ణభేరి పగిలిపోయేలా..
భుజం మీద అసహనం తో కూడిన స్పర్శ..
నన్ను ఊపేస్తున్నట్టు..
కళ్ళు తెరిస్తే..
ఎదురుగా కండక్టర్..
వన్ మాన్ ఆర్మీ లాగా..
"మీ ఊరు వచ్చింది..."
...
నాలో నేను నవ్వుకున్నాను.. నా ఊహలకు.
బస్ దిగి అన్ని దిక్కులూ చూశాను..
దిక్పాలకుని లా..
ఎదురుగా..
ఆ ఇల్లే..
ఎన్నేళ్ళనుండో మార్చకుండా,
త్రుప్పే భారంగా విరిగి వ్రేలాడుతున్న
ప్రాణం లేని గేట్,
ముట్టుకోవాలనే ఆలోచనకే కూలిపోయేలా ఉన్న
శిధిలమయిన గోడ.. చైనా గ్రేట్ వాల్ లా..
తొంగి చూశాను..
పది సంవత్సరాల క్రితం
ఎలా దొంగ చూపులు చూశానో అలా!!
...
గూడ్సు రైలు లా శబ్దం చేస్తూ గేట్ తెరుచుకుంది.
తనే!!
తనతో ఇద్దరు పిల్లలు...
ఎక్కడికో బయల్దేరుతున్నట్టున్నారు..
తనలో ఏ మార్పు లేదు..
అదే అందం..
అదే అమాయకత్వం..
అదే నాజూకుతనం..
.. ఎంత అందం...
తను నన్నే చూస్తుంది..
నా వైపుకే వస్తుంది..
పిల్లలు పిలుస్తున్నారు డాడీ అంటూ..
బుడి బుడి అడుగులు వేస్తూ..
అచ్చం బుల్లి చందమామల్లా..
"ఏమండీ!!
ఇదేనా రావడం..
ప్రయాణం ఎలా జరిగింది.."
తను అడుగుతుంది..
నన్నేనా???
వెనక్కు తిరిగి బిత్తిరి చూపులు చూశాను..
ఎవరూ లేరు...
"ఏంటండీ అలా పిచ్చి చూపులు చూస్తున్నారు.."
తన ప్రశ్న..
*****
రణభేరి లా సెల్‘ఫోన్ మ్రోగడంతో,
కలల మేఘం దారి మళ్ళీంది.
..
అంతా మాయ..
::శ్రీ::
కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి.
ఎండకు ఎండి, వానకు తడిచి
చలిలో మొద్దుబారిన నా హృదయం..
షాజాహాన్ తాజ్‘మహల్ లా శిధిలమవుతూ..
ఆగిఆగి సవ్వడి చేస్తుంది.
ఎక్కడో దూరంగా నువ్వు..
ఆకాశం లో అరుంధతీ నక్షత్రంలా!!
స్మశాన నిశ్శబ్దం లో,
పెళ పెళ మని శబ్దం చేస్తూ,
నా కదలిక నీ వైపుకు-
విఫలయత్నం చేస్తూ..
అప్రయత్నం గా..
ప్రాణం లేని నా గాజు కళ్ళలో
ఒక కన్నీటి బిందువు.
...
లబ్ డబ్..
లబ్ డబ్..
నిశ్శబ్దం..
నిశ్శబ్దం..
నిశ్శబ్దం..
స్థబ్దమయిందా కాలం..
లేదే..
నాలా ఒంతరిదయిన ఒక వీధి దీపం..
మిలుకు మిలుకు మంటూ..
మతం గోడల్లాంటి నల్లని చీకటి కవచాల్ని,
చీల్చే విఫల యత్నం చేస్తూ
తన ఉనికిని చాటుతుంది..
మరి నా ఉనికి ఎక్కడ???
...
...
తుఫాను సమయం లో నీ చేజారిన
నా మనసు గొడుగు,
దూరం గా కొట్టుకు పోతూ,
నీకేసి చూస్తూ,
మౌనం గా రోదిస్తుంది..
నీవు పీల్చే ఆ గాలిలో నా శ్వాస లేదు.. ..
నీ మనసులో చోటు సంపాదించలేని నన్ను,
ఈ ప్రపంచం కూడ వెలివేస్తుంది.
...
ఇది ముగింపు కాదు..
నీ ప్రేమకోసం వేచే
నా మనోగమనానికి
ఇదే ఆరంభం...
మళ్ళీ కలుస్తా..
నీ ప్రేమను అర్థిస్తూ..
******
టక్ టక్..
టక్ టక్..
కుమ్మరి కొలిమిలో కాలిన ఉక్కును,
నలగ్గొడుతున్న శబ్దం..
కర్ణభేరి పగిలిపోయేలా..
భుజం మీద అసహనం తో కూడిన స్పర్శ..
నన్ను ఊపేస్తున్నట్టు..
కళ్ళు తెరిస్తే..
ఎదురుగా కండక్టర్..
వన్ మాన్ ఆర్మీ లాగా..
"మీ ఊరు వచ్చింది..."
...
నాలో నేను నవ్వుకున్నాను.. నా ఊహలకు.
బస్ దిగి అన్ని దిక్కులూ చూశాను..
దిక్పాలకుని లా..
ఎదురుగా..
ఆ ఇల్లే..
ఎన్నేళ్ళనుండో మార్చకుండా,
త్రుప్పే భారంగా విరిగి వ్రేలాడుతున్న
ప్రాణం లేని గేట్,
ముట్టుకోవాలనే ఆలోచనకే కూలిపోయేలా ఉన్న
శిధిలమయిన గోడ.. చైనా గ్రేట్ వాల్ లా..
తొంగి చూశాను..
పది సంవత్సరాల క్రితం
ఎలా దొంగ చూపులు చూశానో అలా!!
...
గూడ్సు రైలు లా శబ్దం చేస్తూ గేట్ తెరుచుకుంది.
తనే!!
తనతో ఇద్దరు పిల్లలు...
ఎక్కడికో బయల్దేరుతున్నట్టున్నారు..
తనలో ఏ మార్పు లేదు..
అదే అందం..
అదే అమాయకత్వం..
అదే నాజూకుతనం..
.. ఎంత అందం...
తను నన్నే చూస్తుంది..
నా వైపుకే వస్తుంది..
పిల్లలు పిలుస్తున్నారు డాడీ అంటూ..
బుడి బుడి అడుగులు వేస్తూ..
అచ్చం బుల్లి చందమామల్లా..
"ఏమండీ!!
ఇదేనా రావడం..
ప్రయాణం ఎలా జరిగింది.."
తను అడుగుతుంది..
నన్నేనా???
వెనక్కు తిరిగి బిత్తిరి చూపులు చూశాను..
ఎవరూ లేరు...
"ఏంటండీ అలా పిచ్చి చూపులు చూస్తున్నారు.."
తన ప్రశ్న..
*****
రణభేరి లా సెల్‘ఫోన్ మ్రోగడంతో,
కలల మేఘం దారి మళ్ళీంది.
..
అంతా మాయ..
::శ్రీ::
నేనొక ఫ్యూచర్ కోటీశ్వరున్ని...
నేనొక ధనవంతున్ని!
కోట్ల ఆస్థికి అధిపతిని..!!
నా కోటుకి బంగారు బొత్తాలు,
ఆ బొత్తాలకు కోటు చోటిస్తే..
ఆ కోటును నేను చేరదీశాను.
వజ్రాలు పొదిగిన ఉంగరానికి,
నా వ్రేలు చోటిస్తే,
పాలీషు చేసిన ప్లాటినం బూట్లకు..
నా పాదం చోటిచ్చింది..
నా ఆస్థికి స్విస్ బ్యాంకు చోటిచ్చింది.
చుట్టూ చూశాను..
నా నీడెక్కడ??
పాపం..
చోటు వెతుక్కుంటుందేమో!?
చోటులేక ఏ వీధి దీపం క్రిందనో
తల దాచుకుందో!!
ముందు చెప్పినట్టు నేను కోటీశ్వరున్ని..
కాని నాకు కారు లేదు..
పెట్టుకునే చోటు లేదు అని కొనలేదు..
పోనీ.. ఒక జెట్ విమానం కూడా లేదు..
ఆకాశం లో ఆక్సిడెంట్లు అనేవార్త విని
అది కూడా కొనలేదు..
కనీసం ఇల్లు కూడా లేదు..
దొరక్క దొరక్క దొరికితే..
ఆరు స్క్వేరు అంగులాల ప్లేసు కొన్నా..
ఆరవై కోట్ల రూపాయలకు.
కనీసం నా ప్లాటినం బూట్లకయినా పనికొస్తుందని..
కొన్న రెండు క్షణాలకే..
అది నాదంటూ..
నిన్ను ఎవరో మోసం చేసారంటూ
అడ్డుపడ్డడొక ఆసామి..
మౌనంగా కదిలాను అక్కన్నుండి..
చెవులను విందు చేస్తూ,
చంద్రునిపై ఇళ్ళంటూ,
ఆకాశవాణి వినిపించింది.
కదిలి వెళ్ళి ఒక ఎకరం అడిగాను.
ప్లాట్లు ఖాళే లేవంటూ,
ఆరు అడుగుల నేలకు..
నా ఆస్తిలో సగం రాయించుకున్నాడు.
చచ్చాక పనికి వస్తుందేమో
అని బుక్ చేస్కున్నా..
అలసిపోయాను.
నిద్రవస్తుంది..
నిలపడి నిద్రపోవడం అలవాటయిన నాకు
కలలే కలగా మిగిలాయి.
అయినా సరే!!
ముందు చెప్పినట్టు..
నేను కోటీశ్వరున్ని..
కోట్లు ఎక్కడ ఎవరికి రాసేస్తానో అని..
నా నీడ ట్రాఫిక్ కొంచెం తగ్గాక.
చప్పుడు చేయకుండా నన్ను చేరింది.
::శ్రీ::
కోట్ల ఆస్థికి అధిపతిని..!!
నా కోటుకి బంగారు బొత్తాలు,
ఆ బొత్తాలకు కోటు చోటిస్తే..
ఆ కోటును నేను చేరదీశాను.
వజ్రాలు పొదిగిన ఉంగరానికి,
నా వ్రేలు చోటిస్తే,
పాలీషు చేసిన ప్లాటినం బూట్లకు..
నా పాదం చోటిచ్చింది..
నా ఆస్థికి స్విస్ బ్యాంకు చోటిచ్చింది.
చుట్టూ చూశాను..
నా నీడెక్కడ??
పాపం..
చోటు వెతుక్కుంటుందేమో!?
చోటులేక ఏ వీధి దీపం క్రిందనో
తల దాచుకుందో!!
ముందు చెప్పినట్టు నేను కోటీశ్వరున్ని..
కాని నాకు కారు లేదు..
పెట్టుకునే చోటు లేదు అని కొనలేదు..
పోనీ.. ఒక జెట్ విమానం కూడా లేదు..
ఆకాశం లో ఆక్సిడెంట్లు అనేవార్త విని
అది కూడా కొనలేదు..
కనీసం ఇల్లు కూడా లేదు..
దొరక్క దొరక్క దొరికితే..
ఆరు స్క్వేరు అంగులాల ప్లేసు కొన్నా..
ఆరవై కోట్ల రూపాయలకు.
కనీసం నా ప్లాటినం బూట్లకయినా పనికొస్తుందని..
కొన్న రెండు క్షణాలకే..
అది నాదంటూ..
నిన్ను ఎవరో మోసం చేసారంటూ
అడ్డుపడ్డడొక ఆసామి..
మౌనంగా కదిలాను అక్కన్నుండి..
చెవులను విందు చేస్తూ,
చంద్రునిపై ఇళ్ళంటూ,
ఆకాశవాణి వినిపించింది.
కదిలి వెళ్ళి ఒక ఎకరం అడిగాను.
ప్లాట్లు ఖాళే లేవంటూ,
ఆరు అడుగుల నేలకు..
నా ఆస్తిలో సగం రాయించుకున్నాడు.
చచ్చాక పనికి వస్తుందేమో
అని బుక్ చేస్కున్నా..
అలసిపోయాను.
నిద్రవస్తుంది..
నిలపడి నిద్రపోవడం అలవాటయిన నాకు
కలలే కలగా మిగిలాయి.
అయినా సరే!!
ముందు చెప్పినట్టు..
నేను కోటీశ్వరున్ని..
కోట్లు ఎక్కడ ఎవరికి రాసేస్తానో అని..
నా నీడ ట్రాఫిక్ కొంచెం తగ్గాక.
చప్పుడు చేయకుండా నన్ను చేరింది.
::శ్రీ::
బుధవారం 19 డిసెంబర్ 2007
సావిత్రి ఎందుకు గొప్ప నటి అయ్యింది...

మునిసిపాలిటీ ఎన్నికలు అర్థంతరం గా వచ్చినట్టు, ఒకరోజు మా ఫ్రెండ్స్ మధ్య సినిమా హీరోయిన్ల టాపిక్ వచ్చింది. మా ఫ్రెండ్ ఒకడు సౌందర్య ఫోటోలతో ఒక డెమో వెబ్ సైట్ చేస్తుంటే ఈ టాపిక్ మొదలయింది. దీపక్ సౌందర్య ఫ్యాన్. భారంగా నిట్టూరుస్తూ, "సౌందర్య నన్ను వదిలేసి పోయింది రా!" అని తెగ ఫీల్ అయిపోతున్నాడు. అది విని చరణ్ "నీ పెళ్ళాం పోయినట్టు ఫీల్ అవుతావేంట్రా. నువ్వేం బాధ పడకు. నా త్రిషను తీసేస్కో!" అన్నాడు. నేను నవ్వుతూ " అదేంట్రా నీ త్రిషను అలా ఇచ్చేస్తున్నావ్?" అన్నాను. "ఈ మధ్య దానికి బాత్ రూం షోలు, రోడ్ల మీద తాగి గొడవలు చేయడాలు ఎక్కువయ్యాయి. నేను ఈ మధ్యన ప్రీతి జింటా ఫాన్." అన్నాడు. "వార్నీ! ఇదెప్పన్నుండి.." అని ఇంకేదో మాట్లాడ బోతుంటే మా ఫ్రెండ్స్ లో పెద్దన్న "రాజన్న" వచ్చాడు. మా ఫ్రెండ్స్ లో మా వయసు కన్నా పదేళ్ళు పెద్ద అవడం వలన పెద్దన్న అనడం అలవాటయింది.
చూడండి తమ్ముళ్ళూ! మీకు అసలు రహస్యం తెలియదు. ఒక సీక్తెట్ రహస్యం చెప్తాను వినండి.. "పెద్దన్నా! సీక్రెట్ అన్నా, రహస్యం అన్నా ఒకటేనే!" అన్నాను తెలంగాణా స్లాంగ్ లో. విలన్ లా ఒక లుక్ ఇచ్చాడు. నువ్వు కంటిన్యూ అని అంతా అనడం తో.. ఒకసారి నిట్టూర్చి... జెమిని మ్యూజిక్ యాంకర్ లా బిల్డప్ ఇచ్చి..
"అసలు సావిత్రి, సౌందర్య ఎందుకు అంత గొప్ప నటులుగా పిలవబడుతున్నారు? " అని అందరికీ ఒక ప్రశ్న విసిరాడు అదేదో ఐ.ఎ.ఎస్ ప్రశ్న అడిగినట్టు.
"మామా! ఏదో చిన్న పిల్లలం! నువ్వు చెప్తే విని తరిస్తాం." అని అన్నాను.
"త్వరగా పోయరు కాబట్టి అంత ఫేమస్ అయ్యారు." అన్నాడు. ఇదేం లాజిక్ రా బాబు, అంటే.. "నాకు నిరోష, కుషుబు, దివ్య వాణి.. ఇంకా కొంత మంది ఇష్టం. వీళ్ళు ఎక్స్పైర్ అయ్యాక (సినిమాకు అన్ ఫిట్ స్టేజ్ అన్న మాట..) కూడా సినిమాలు తీసి, స్లిమ్ స్టేజ్ నుండి డ్రం స్టేజ్ కు వచ్చి, సీరియల్స్ కి క్వాలిఫై స్టేజ్ లో డైలి బుల్లి తెర మీద, అత్తల రూపం లో, డ్రంస్ (ఇయర్ డ్రంస్) పగిలేదాకా అరుస్తున్నారు. ఇంట్లో పెళ్ళాం టి.వి. వద్దు అంటే వినదు. సీరియల్స్ పిచ్చి దానికి. ఇప్పటి ఆ బుల్లి బోండాం ఆకారాలు చూడలేక చస్తున్నా. సో! ఫైనల్ గా చెప్పేదేంటంటే.. సినిమాలకు అన్ ఫిట్ అవగానే ఎక్స్పైర్ అయితే శని వదులుద్ది. వాళ్ళకు కూడా పేరు వస్తుంది."
అంటూ ఉపన్యాసం ముగించాడు.
ఇది కూడా నిజమే కదా!!
అంతా బాగానే ఉంది కాని, వాళ్ళంతా చచ్చిపోతే బుల్లితెరకు డ్రం అత్తలు కరువవుతారు కదరా? అన్నాను..
వాడు సింపుల్ గా ఒక స్మైల్ ఇచ్చి " నా పెళ్ళాం లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లే ఆ వేశానికి.. నా పెళ్ళాం కూడా ముందు స్లిం.. ఇప్పుడు డ్రం.. " అన్నాడు..
అప్పుడు కాని అర్థం కాలేదు, వాడు సినిమా హీరోయిన్లకు ఎందుకు డెత్ జడ్జ్మెంట్ ఇచ్చాడో..!!
జీవిత గమనం లో ఒక సారి వెనక్కు వెళ్తే... -4

హాస్టల్ అంటే ఆ అంకుల్ ఒక ఫైవ్ స్టారు హోటల్ ను కళ్ళ ముందు చూపించాడు. మా ఊర్లలో టిఫిన్స్ అంటే తెలియవు. పొద్దున లేవగానే అన్నం తినేవాన్ని. ఇప్పటికీ చాలా ఊర్లలో టిఫిన్స్ అంటే తెలియవు. ఈ అంకుల్ చాలా టిఫిన్ల పేర్లు, చాలా బాగుంటాయి అని.. ఇంకా చాలా చెప్పారు. స్విమ్మింగ్ పూల్, గేమ్శ్, తొక్క తొడిమ అని చాలానే చెప్పడం తో టెంప్ట్ అయిపోయి హాస్టలు లో వేసేదాకా గొడవ చేసి ఇల్లు పీకి చిన్న పందిరి వేశాను. తీరా హాస్టలు వెళ్ళాక అంకుల్ చెప్పినవి ఏం కనపడలేదు. స్విమ్మింగ్ పూల్ అంటే ఎక్కడ ఉంటుంది అని వార్డెన్ ను అడిగితే వాడు వాటర్ టాంక్ చూపించాడు. నేను అదే స్విమ్మింగ్ పూల్ అని చాలా రోజులు అనుకున్న. బట్టతల వాన్ని కోం(దువ్వెన) అడగడం అంటే ఇదే. ఆ వార్డెన్ కు ఏడ్చిన తెలివి అంతే మరి...
మిట్ట మధ్యాహ్నం ఇంట్లో ఒక్కన్ని వదిలేస్తే భయపడి చచ్చే పిరికి వాన్ని, స్మశానం లో అర్థరాత్రి కూర్చోపెట్టి, డి.టి.ఎస్. సౌండ్ తో "ఎవిల్ డెడ్" చూపిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి? నా చిన్నప్పటి హాస్టల్ లైఫ్ నాకు అలానే అనిపించేది. ఉదయం నాలుగున్నరకు కొట్టే బెల్, చలికాలం కూడా వదలకుండా చేయించే మార్నింగ్ జాగింగ్ లు, చింత కర్రల వాతలు, పెన్సిల్స్ అరిగిపోయేలా ఇచ్చే హోం వర్క్ లు... ఎన్నని చెప్పను.. పుస్తకాలు స్లిమ్ గా ఐశ్వర్యారాయ్ లా ఉండేవి, కాని క్లాసు వర్క్స్, హోం వర్క్స్ చూశాక కాని తెలిసేది కాదు, అది కల్పనా రాయ్ అని. 7 తరగతి వచ్చేదాకా అందరికి స్నానాలు ఒక్క చోటే. ఒక్కచోటే కదా అని తెలుగు సినిమాలో హీరోయిన్లలా అర్థనగ్న స్నానం అనుకుంటే పొరపాటే. (ఇంగ్లీషు సినిమా సూట్ లలో స్నానాలు చేయాల్సి వచ్చేది.) అప్పుడప్పుడూ అన్నం లో, కూరల్లో చిన్న చిన్న లోకల్ పురుగుల నుండి, పెద్ద పెద్ద నాన్ లోకల్ ఇంపోర్టెడ్ పురుగులు దర్శనం ఇచ్చేవి. మొదట్లో కొంచెం ఇబ్బంది అయినా, రాను రాను తీసి పక్కన పెట్టి తినడం అలవాటయింది. ఇంక టిఫిన్లు కూరలు, చూడ్డానికి మాత్రం అదుర్స్, తింటే ఎంతటోడయినా బెదుర్స్.
పేరెంట్శ్ వచ్చిన రోజు వాళ్ళకు స్పెషల్ గా పెట్టేవాళ్ళు. అవి బాగానే ఉండేవి. మామయ్యా! ఇక్కడ తిండి బాలేదు.. అని చెప్తే, "మీ అత్తయ్య వంట కన్నా చాలా బాగున్నాయి." అనేశాడు. నవ్వాలా ఏడ్వాలా? పిల్లలు చెప్తే పేరెంట్స్ నమ్మరు. నిజం వాళ్లకు తెలీదు, వాళ్ళకు వేరేవి పెట్టేవాళ్ళు అనే విషయం మాకు కూడా తెలిసేది కాదు చిన్నతనం లో. ఈ టైం లో నేను తెలుసుకున్న జీవిత పాఠం: తినగతినగా వేము తియ్యగా ఉండును. (తింటూ ఉంటే వేప చేదు తెలియదేమో కాని తియ్యగా మాత్రం మారదు కదా? పాడుతూ ఉంటే రాగం అతిశయించడం ఏమో కాని, రెగులర్ గా విన్నోడు మాత్రం శాశ్వతం గా శయనిస్తాడు. సో.. ఈ పద్యం గుర్తు వచ్చీ పాడ్డం ప్రాక్టీస్ చేయకండి సింగర్ మహాశయులారా. ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు జాగ్రత్త, సౌండ్ పొల్యూషన్ క్రింద బొక్కలో తోసినా తోస్తారు.)
ఇండియన్స్ కే కాక, ఇంకా కొన్ని డెవలప్ అవుతున్నట్టు గా భ్రమింపచేసే కంట్రీస్ లో ప్రజలకు ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే పక్కింటోడు దూరదర్శన్ లో పందుల పెంపకం చూసి, పందులను పెంచి ఏదో పది రాళ్ళు వెనుక వేస్కుంటే, వెనుకింటోడు కూడా అదే ఫాలో అయిపోతాడు. వీళ్ళను చూసి దారినపోయే ఒక బిఛ్ఛగాడు, తెల్ల పందులు కాకపోయినా కనీసం నల్ల పందులనయినా పెంచి గొప్పోడవ్వాలని అనుకుంటాడు. ఈ విషయం నేను చిన్నప్పుడే గ్రహించాను.
మా హాస్టలు లో పనిమనుషులంతా మైసూరు మహా రాణులు. కూరగాయలు, టమాటాలు, ఉల్లిపాయలు కోయడానికి మహా బద్దకం. అలానే వేసేవాళ్ళు అప్పుడప్పుడు. వాటిని తినకుండా వదిలేస్తే మా వార్డెన్స్ వదిలేవాళ్ళు కాదు. తినాల్సిందే అని ఆర్డర్ వేసేవాళ్ళు. నేను తినలేక జేబులో కవర్ పట్టుకెళ్ళి, తినలేనివి కవర్ లో వేసి, పాకెట్లో పెట్టుకుని బయట పడవేసేవాన్ని. నా ప్లాను అంతా కాపి కొట్టి చివరికి సార్ కు తెలిసి జేబులు వెతకడం కూడా స్టార్టు చేశారు. పక్కింటోడి పెళ్ళాం అందం గా లేకపోతే ఎదురింటోడు ఫీల్ అయినట్టు, మేం అది తినకపోతే వార్డెన్ లకు వచ్చే లాస్ ఎంటో నాకు అర్థం అయ్యేది కాదు. దీన్నే సాడిజం అంటారు అని జీవిత గమనం లో ఒక దుర్దినాన తెలుసుకున్నాను.
(మిగతాది తదుపరి పోస్టు.. ఈ పోస్టు ముగింపు లో ఒక చిన్న జీవిత సత్యం..)
ఒకరోజు నేను కళ్లారా చూసి చెవులారా విన్న ఒక జీవిత సత్యం చెప్తాను. కొన్ని ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ ఇంటికి లంచ్ కు వెళ్ళాను. మా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు వాళ్ల అమ్మ చేతి వంట అద్బుతం అని. నిజమే నేను కూడా చాలా సార్లు తిన్నాను వాడి బాక్స్. లంచ్ చేస్తున్న సమయం లో "అమ్మా! మీ చేతి వంట అద్భుతం. చాలా బాగుంటాయి. శ్రీధర్ ఎప్పుడూ మీ వంట గురించే చెప్తాడు." అని అన్నాను. అది విన్న అంకుల్ ఏమన్నారంటే.. "అవును నిజమే! పాతికేళ్ళ క్రితం ఇదే చేతి వంట తిని ఉంటే మీరు ఈ మాట అనేవాళ్ళు కాదు." అన్నారు. నాకు వెంటనే అర్థం కాలేదు. అర్థం అయ్యాక చచ్చేంత నవ్వు వచ్చినా ఆపుకున్నాను. "పెళ్ళయిన కొత్తలో పాల పొడి బదులు సర్ఫ్ వేసింది ఒకసారి. ‘అదేదో వాషింగ్ పౌడర్ నిర్మా- పాల లాంటి తెలుపు నిర్మా తో వచ్చింది.’ ఆడ్ చూసి సర్ఫ్ వేసిందేమో అనుకుని, నిర్మా మార్చి, వేరే బ్రాండ్ తెచ్చాను. నా మీద ప్రయోగాలు చేస్తే ఇరవై ఏళ్ళకు బాగా వండడం వచ్చింది." అని చెప్పారు. నాకు అనిపించింది, వేమన రాసిన "అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు" జీవితం లో అడుగడుగునా కనిపిస్తుంది.. అని....
,,,
,,,,,
కొత్త పెళ్ళి కొడుకులు పాపం..
...
.....
అయ్యయ్యో! పాపం అనడానికి కూడా లేదులే! తెలివి లేని వాళ్ళు కొత్త పెళ్ళాం మోజులో పడి ఏ చెత్త పెట్టినా తింటారు, కొంచెం తెలివయిన వాళ్ళు, పెళ్ళాం వంట తప్పించుకోవడానికి మరియు పెళ్ళాన్ని మురిపించడానికి రెస్టారెంట్లకు తీస్కెళ్తారు.. హ్హహ్హహ్హ
సోమవారం 17 డిసెంబర్ 2007
నల్ల కాకి, తెల్లకాకి రెండూ "కావు" అనే అరుస్తాయి...
తెలుగులో రాయాలి, తెలుగులో మాట్లాడాలి, తెలుగు సాహిత్య విలువలు తగ్గుతున్నాయి.... ఇలా చాలా రకాలుగా ఆర్గ్యూ చేసేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, పూనకం వచ్చినట్టు.. తీరా చూస్తే కొన్ని సాంకేతిక పదాల దగ్గర తెల్లమొహం వేయక తప్పడం లేదు. డిక్షనరీ తిరిగేయాల్సి వస్తుంది.
ఒకసారి నా స్నేహితునితో సంభాషణ ఇలా సాగుతుంది.
నేను: ఇంగ్లీషు వాడకుండా తెలుగు మాట్లాడడానికి ట్రై చేసి చూడు ఒకసారి.
స్నేహితుడి: భాష ఏదయినా భావం ఒకటే కదా! నల్ల మేకయినా తెల్ల మేకయినా "మే" అనే అరుస్తాయి. మేకలు వేరు అయినా అరుపులు ఒకటే కదా? అలాగే భాషలు వేరయినా భావం ఒకటే కదా?
నేను: అలాంటిదే ఇంకొకటి చెప్పు ఎక్సాంపుల్!!
స్నేహితుడు: నల్ల కాకయినా తెల్ల కాకయినా "కావు" అనే అరుస్తాయి..... (అనేసి నాలుక కరుచుకున్నాడు.)
భాషలు వేరు అయినా భావం ఒకటే కావచ్చు, కాని దేని రూపం దానిదే.. కొన్నిటికి రూపం అనేదే ఉండదేమో!! దేశ భాషలందు తెలుగు లెస్స...
ఒకసారి నా స్నేహితునితో సంభాషణ ఇలా సాగుతుంది.
నేను: ఇంగ్లీషు వాడకుండా తెలుగు మాట్లాడడానికి ట్రై చేసి చూడు ఒకసారి.
స్నేహితుడి: భాష ఏదయినా భావం ఒకటే కదా! నల్ల మేకయినా తెల్ల మేకయినా "మే" అనే అరుస్తాయి. మేకలు వేరు అయినా అరుపులు ఒకటే కదా? అలాగే భాషలు వేరయినా భావం ఒకటే కదా?
నేను: అలాంటిదే ఇంకొకటి చెప్పు ఎక్సాంపుల్!!
స్నేహితుడు: నల్ల కాకయినా తెల్ల కాకయినా "కావు" అనే అరుస్తాయి..... (అనేసి నాలుక కరుచుకున్నాడు.)
భాషలు వేరు అయినా భావం ఒకటే కావచ్చు, కాని దేని రూపం దానిదే.. కొన్నిటికి రూపం అనేదే ఉండదేమో!! దేశ భాషలందు తెలుగు లెస్స...
డ్రాయింగ్ నేర్చుకుందాం!!

Click Image to View Full Size!!
డ్రాయింగ్ నేర్చుకుందాం!!
డ్రాయింగ్ నేర్చుకుందాం!!
1) ముందుగా ఒక వృత్తం, దానికి హారిజంటల్ గా డయామీటర్ ను కలిపే ఒక లైన్ గీస్తే అది కళ్ళను తెలిపే గీత, దాని కింద గీత ముక్కు గీత, వృత్తం వర్టికల్ గా చివర నోరు, క్రింద గదువ ఎంత పొడవు కావాలో అంత పొడవున వర్టికల్ లైన్ మీద పాయింట్ పెట్టుకుని, నోస్ లైన్ ను, ఈ పాయింట్ ను కలపాలి. అప్పుడు (1) వస్తుంది.
2) ముక్కు నోరు కళ్ళు జుట్టు రప్ గా స్కెచ్ చేస్కోవాలి.
3) 3 లో చూపిన విధం గా కళ్లను, ముక్కును, నోరును మార్చుకోవాలి.
4) అనంతరం రంగులు అద్ది పూర్తిగా మాడిఫై చేసుకుని కావలసిన ఎక్స్ ప్రెషన్ మార్చుకోవచ్చు. ఉదాహరణకు 5,6 చూడండి.
స్కెచ్చింగ్ కు 2H పెన్సిల్, షేడింగ్ కు అండ్ డార్క్ లైన్ ఫినిషింగ్ కు 2B పెన్సిల్ వాడుట మంచిది. ఎరేజర్ తప్పనిసరి.
ఆదివారం 16 డిసెంబర్ 2007
జీవిత గమనం లో ఒక సారి వెనక్కు వెళ్తే... -3

(ఇది బూతుపురాణం కాదు. పాత పోస్టులు చదవకుండా ఇది చదివి అపార్థం చేస్కోకండేం....)
ముందు పోస్టులో చిన్న పిల్లల ముద్దు చిత్రం వెనుక విషయం ఏంటో చెప్పాలి మీకు. మా క్లాసుకు వచ్చే టీచర్ లలో ఒక టీచర్ పేరు నల్వరాణి. ఆమె అంటే అందరికీ భయమే. కొట్టేది చాలా. ఆమె కనపడితే "లక లక లక - చంద్రముఖి" ని చూసినట్టు భయపడేవారు. నాకు మాత్రం ఆమె అంటే భయం లేదు. కాని భయం కాని భయం ఒకటి ఉండేది. నేను దొరికితే పట్టుకుని బుగ్గలు వాచిపోయేలా ముద్దులు పెట్టి బుగ్గ గిల్లేది. ఒకసారి ఎందుకు అలా చేశారు అని అడిగితే ముద్దుగా ఉన్నావ్ కదా అందుకే అంది. నాకదేదో సంస్కృత పదం లా అనిపించి సందేహం గా.. "అంటే.." అని అడిగాను. అంటే పెద్ద పెద్ద బుగ్గలేసుకుని బాగున్నావ్.. అని చెప్పింది.
నాకు ఆ మాటల్లో తెలిసిన నీతి " పెద్ద పెద్ద బుగ్గలు ఉండి ముద్దుగా అనిపించి నచ్చితే ముద్దెట్టుకోవాలని. " రేణుక చొట్టబుగ్గలు నాకు బాగా నచ్చేవి. ఒకరోజు నల్వరాణి టీచర్ ను చూడగానే గతం గుర్తుకు వచ్చింది. నచ్చితే ముద్దెట్టాలని.. ఆ టీచర్ క్లాసులోనే రేణుక బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను. రేణుక బుగ్గ తుడ్చుకుని అందంగా ఒక స్మైల్ ఇచ్చింది. కాని ఆ సీన్ నల్వరాణి చూసేసింది.”ఏంటా పని క్లాసులో’ అంది. నాకు తెలిసిన నీతి "క్లాసులో ముద్దు పెట్టుకోకూడదు".
గతం గత: వదిలేద్దాం.. వదిలేసేముందు...
ఆ అమ్మాయి నాకు మళ్ళీ చాలా సార్లు కనిపించింది. నేను టెంత్ లో ఉండగా పెళ్ళయిపోయింది అని విన్నాను. నాలుగేళ్ళ క్రితం రేణుక రైల్వే స్టేషన్ లో కనిపించింది. నేను తనను గుర్తు పట్టలేదు. "విజయ్" అనే పిలుపు సికిద్రాబాదు రైల్వే స్టేషన్ల్ లో వినపడితే చూశాను. ఎవరో పెద్దావిడ అప్పుడే నాలుగు మేకలు తిన్న అనకొండ లా కనిపించింది. నన్నేనా అన్నట్టు సైగ చేశాను. అవును అంది. ఎవరా ఈ భీకరాకారి, ముందెప్పుడూ చూడలేదే అని దగ్గరకు వెళ్ళాక కాని తెలియలేదు. తనే మై స్వీట్ హార్ట్ "రేణుక." ఇంకొంచెం లావు అయితే ఫూట్ బాల్ లా ఉంటుందేమో అనిపించింది. ఆమె హస్బెండ్ ను పరిచయం చేసింది. తన పర్సనాలిటీ తగ్గడం కోసం వచ్చిందని తెలిసింది. తనకు ఒక కూతురు. అచ్చం చిన్నప్పటి రేణుకలా ఉంది. కాని నా కళ్లకు ఆ పాప అందంగా కాక మర్రి గింజ లా అనిపించింది. (కాబోయే మహా వృక్షం.) పాస్ట్ ఎక్స్పీరియన్స్ మహత్యం.
****
మళ్ళీ నాతో పాటు 1991 సం. కు వచ్చేయండి. మీకు అకామడేషన్, ట్రావెలింగ్ చార్జెస్, ఫూడ్.. అన్నీ నా బాధ్యతే. ముందుకు వెనుకకు టైం ట్రావెలింగ్ చేయిస్తున్నా అని ఏం ఫీల్ అవకండేం. ఈ సారికి అడ్జస్ట్..
****
అప్పుడు నేను ఒకటో తరగతి అయిపోయి హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్న టైం లో.. ఒక దుర్ముహూర్తాన ఒక అంకుల్ ఇంటికి వచ్చారు. వచ్చీ రాగానే చిన్నా నీ పేరేంటమ్మా అన్నారు. "శ్రీవిజయ్ కుమార్" నా పేరేదో అమెరికన్ ప్రసిడెంట్ ది అన్న లెవెల్ లో చెప్పాను తొక్కలో expression ఒకటి ఇచ్చి. గుడ్ చాలా ఆక్టివ్ గా ఉన్నావ్! అన్నాడు. అంతే ఇంక భూమి మీద ఆగుతామా మనం, "Active" అంటే అదేదో అవార్డు అనుకుని నాకు వచ్చిన సాహిత్యం (ఎ బి సి డి, వన్ టూ త్రీ, రైమ్స్ .. .. .. ) అన్నీ వద్దన్నా వినకుండా చెప్పేశాను. అప్పుడు కొంచెం ఓవర్ ఆక్షన్ ఎక్కువ లే. మా మామయ్యతో "మీ అల్లుడు వెరీ గుడ్, హాస్టల్ లో చేర్పించు. బాగా చదువుతాడు." అని చెప్పాడు. హాస్టల్ అంటే ఏంటి అంకుల్ అని అడిగాను.
ఆయన చెప్పింది నెక్స్ట్ పోస్టులో.
(ఆయన చెప్పింది వింటే తొంభై ఏళ్ళ ముసలోడు కూడా నేను హాస్టల్ పోత అంటాడు.)
జీవిత గమనం లో ఒక సారి వెనక్కు వెళ్తే... 2

అసలు విషయానికి వస్తే మా తాతయ్య నేటివ్ ప్లేస్ దగ్గరలో ఉన్న పల్లెటూరు. ఉదయం లేవగానే ఊరు అవతల ఉన్న వాగుకెళ్ళి చేపలు పట్టేవాడు. నేను కొంచం ఎదగగానే నన్ను తనతో తీసుకు వెళ్ళేవారు. నాకు అక్కడ ఆడుకోవడం, అలల మీద తాలం వేయడం, ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టడం, నీళ్ళలో రాళ్ళు విసరడం... ఆటలు బాగా ఆలవాటయ్యాయి. పక్షుల కిల కిలలు, అలల సవ్వడి, చల్లని పిల్లగాలి గిలిగింతలు పెట్టేలా చెవిలో చేసే అల్లరి అలవాటైన చెవులకు స్కూల్ లో అల్లరి, సార్ ల కేకలు, పలకల మీద ఎ, బి, సి, డి లు భయం తెప్పించడం సహజమే కదా? ఒకసారి మీ తొలి స్కూల్ దినాలు నెమరు వేస్కోండి. నేను వెళ్ళను అని మారాం చేస్తే ఇంట్లో వాళ్ళు తరిమి తరిమి స్కూలుకు పంపుతారు కదా? సాడిస్టుల్లా కనిపించేవాళ్ళు నాకు అప్పుడు. ఇప్పుడు తలచుకుంటేనే నవ్వు వస్తుంది.
ఏది ఏమయితేనేం.. మొత్తం మీద కుయ్యో మొర్రో అన్నా వినకుండా మామయ్య స్కూలుకు తీస్కెళ్ళేవాడు. కాని అక్కడ మామయ్యతో వెళ్ళడం వలన సార్ లు అంతా నాకు ఫాన్స్ అయ్యారు. పిచ్చి చూపులు, అల్లరి మాటలు, సరదా కబుర్లు.. ఎవరికి నచ్చవు మరి. మామయ్య స్కూలులో పార్ట్నర్ అవడం వల్ల నన్ను ఎవరు ఏం అనేవారు కాదు. ఏది అడిగినా కొని పెట్టే వారు. ఇంక అక్కడ నేను తైతక!! ఆడిందే ఆట.. పాడిందే పాట.
నేను కూర్చునే క్లాసులో ఒక పాప ఉండేది. బాగా మాట్లాడేది. ఆ పాపే రేణుక. అప్పటికి ఇప్పటి నాలెడ్గ్ ఉంటే "కత్తి ఫిగర్" అనేవాన్ని. ఎంత ముద్దుగా మాట్లాడేదో. నేను క్లాసులో ఎంత అల్లరి చేసినా సార్స్ ఏం అనకపోగా నవ్వేవారు. నాతో ఉంటే ఏం అనరు అని అర్థం చేస్కుందేమో ఆ పిల్ల. నా పక్కనే కూర్చునేది. నాకు ఆ పిల్లకు మంచి స్నేహం కుదిరింది. కొన్నాళ్ళకు తెలిసింది, ఆ పిల్ల కూడా మా సార్స్ లో ఒకరి కూతురు అని.
రోజులు గడుస్తుండగా ఒక రోజు మామయ్య తన డెసిషన్ చెప్పాడు. మా స్కూల్ లో ఉంటే విజ్జు చదవడు. వీన్ని ఇంకా ఏదయినా స్కూల్ లో జాయిన్ చేసేద్దామని అన్నాడు. వయసు చిన్నదయినా కొంచెం తెలివి పెద్దదే నాకు. ఆ స్కూల్ లో అయితే ఇంత స్వేచ్చ ఉండదు అనే విషయం గ్రహించేశాను. కాని నా మాటకు ఎవరు విలువ ఇస్తారు. ఫైనల్ గా ఒక స్కూల్ లో వేశారు. ఒక్కరోజుకే చుక్కలు కనపడ్డాయి నాకు. ఇంక నెక్స్ట్ డే నేను ఆ స్కూల్ కు వెళ్ళను అని ఏడ్పు.. ఎంతకీ వెళ్ళలేదు. కొట్టి బలవంతం గా పంపేశారు. స్కూల్ కు వెళ్ళాగానే జ్వరం చాలా.. జ్వరం తగ్గేదాకా రెస్ట్, తగ్గగానే మళ్ళీ స్కూల్. నాకు మళ్ళీ జ్వరం. ఇలా కాదు అని ఇంక రేణుక క్లాసులోనే జాయిన్ చేశారు. అలా స్కూల్ లో జాయిన్ అయిన కొన్ని డేస్ కే మామయ్యకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు స్కూల్ నుండి. ఏ రాయయితే ఏమి పళ్ళు రాలగొట్టుకోవడానికి.. ఈ స్కూలు కూడా అలానే మారింది. కొత్త స్టాఫ్ మారినా కొద్దీ నా గుర్తింపు తగ్గింది. రేణుకకు నాకు స్నేహం ఒక రెండేళ్ళ పాటు.
అనంతరం నేను కరీంనగర్ లోని ట్రినిటి కి తరలించబడ్డాను. (తరలించడం అనే పదం ఇక్కడ వాడకూడదేమో.. కాని తప్పలేదు. ఈ సారికి అడ్జస్ట్... )
నిప్పు చూడ్డానికి కలర్ ఫుల్ గా ఉంటుంది.. ముట్టుకుంటే కదా కాలేది.. కోరి హాస్టల్ కు వెళ్ళాను. కోలుకోవడానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది.
నేను నా స్కూలు లో నేర్చుకున్న నీతి..
తినగ తినగ వేము తీయనుండు.. మెల్లిగా అన్నీ అవే అలవాటవుతాయి..
అసలు హాస్టల్ లో జాయిన్ అవాలనే అద్బుతమయిన ఆలోచన నాదే.. ఐదు సంవత్సరాలకే హాస్తల్ వెళ్ళీపోయాను. అసలు వెళ్ళాలనే ఆలోచన రావడానికి కారణం, హాస్తల్ లో పడ్డ తిప్పలు సంక్షిప్తం గా నెక్స్ట్ పోస్టులో.......
జీవిత గమనం లో ఒక సారి వెనక్కు వెళ్తే...
11.45PM - SATURDAY, DECEMBER 15TH... 2007
చలికాలం అని గుర్తుచేసే చలి అంతగా లేదు.. బహుషా నాకు చలి అనిపించడం లేదు ఏమో..!! చలికాలం పిల్ల తెమ్మరలు గిలిగింతలు పెట్టకుండా, పెదవులను కోసి, చర్మంపై గాట్లు పెడతాయని తెలుసు. డిసెంబర్ చలి తెలియంది ఎవరికి?
కాని ఇప్పుడు అలా లేదు.
ఒక్కన్నే కంప్యూటర్ ముందు.
చుట్టూ చూశాను.. కొత్త ఏం లేదు. ఎప్పుడూ ఉండే ఒంటరితనమే! గత ఆరు సంవత్సరాలుగా....
దయ్యాలున్నాయేమో అనేభయం లేనే లేదు. ఎందుకంటే దయ్యాల భవనం అని చెప్పుకునే ఒక ఇల్లు కొత్తగా సిటీకి వచ్చినప్పుడు నాకు నీడనిచ్చింది. దయ్యాలు లేవు అనేది నా వాదన. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా.. ఆ వాదన ఫలితం ఒక రాత్రి నన్ను స్మశానం లో, కీచురాళ్ళ లాలి పాటలో, సంతోషానికి - దు:ఖానికి అతీతమయిన పూర్వ పురుషుల/స్త్రీల మరణ శయ్యల మీద గడిపేలా చేసింది.
****
నల్ల మార్బుల్స్ మీద వరుసగా మూడు బూట్ల జతలు,”హైదరాబాద్ బాంబ్ పేలుళ్ళ సమయం లో పరామర్శకు ఒకేసారి వచ్చిన ఆయా పార్టీల నేతల్లా’ ఉన్నాయి. పక్కనే పారగన్ చెప్పుల జత. వాటిని చూస్తే ఎలక్షన్ ల సమయం లో టికెట్ కోసం ఎదురు చూసే పార్టీ అభ్యర్తిలా అనిపించింది. అలా కారిడార్ లోకి వెళ్ళాలని ఉంది. బయట చలి ఉందేమో? చెప్పులా, బూట్లా? ఒకసారి వట్టికాళ్ళతో నడిచి చూస్తే..
****
చల్లగానే ఉంది. డోర్ తీస్తే కిర్రు మనే శబ్దం వినిపించాలి కదా? సిటీ అనే విషయం మర్చిపోయాను. బయట వాహనాల అలజడి ఇంకా ఉంది. ఇంటి వెనుక భాగానికి చేరి ఆకాశం చూశాను. చందమామ కాదు కదా, ఒక్క చుక్క కూడా కనిపించలేదు. పల్లెటూర్లో అయితే కుప్పలు కుప్పలుగా చుక్కలు. సిటీ లో లైట్ల వెలుగు వల్లనేమో, ఒక్క చుక్కా కనిపించలేదు. కారు చీకటి అనడానికి కూడా లేదు. నలుపు కాని నలుపు రంగులో ఆకాశం నిర్మలం గా ఉంది. అలా కాసేపు చూశాను. ఆ నల్లని ఆకాశం నన్ను హిప్నోటైజ్ చేసి 19 సం. వెనక్కు నెట్టింది.
****
రెండు మూడేళ్ళ వయసు. పసితనం పాల బుగ్గల్లో చిందులేస్తుంటే బహు ముద్దుగా ఉండేవాన్ని. (ఫోటో లో చూశాను. సెల్ఫ్ హిప్నోటైజ్ ప్రక్రియ ద్వారా నా చిన్న తనం చాలా వరకు నేను చూడగలిగాను. స్వీట్ మెమరీస్ అంటే ఎంటో నా పసితనం చూశాకే తెలిసింది.) బాగా తిండి పోతును అప్పుడు. "విజ్జూ! నీకోసం తినడానికి ఏం తెచ్చానో చూడు!" పెద్ద పిన్ని పిలిచేది. ఎక్కడ ఉన్నా క్షణం ఆలస్యం చేయకుండా పరుగెత్తుకు వచ్చేవాన్ని. నాకు చాలా ఇష్టమయిన వ్యక్తి మా పిన్ని. నాకన్నా వయసులో ఆరేళ్ళు పెద్ద. నేను తిండి అంటే ఎగబడతాను అనే విషయం ఎక్కడ బయట జనాలకు తెలుస్తుందో, ఎక్కడ దిష్టి తాకుతుందో అని పిన్ని, "అసలు తినడు వీడు" అని బయట అందరికీ చెప్పేది. నాకు అబద్దం చెప్పడం ఇష్టం ఉండేది కాదు. "అన్నీ అబద్దాలే! నేను బాగా తింటా!!" అని చేతులు రెండూ బాగా చాచి,”ఇంత తింటాను’ అని చెప్తే నోర్ముయ్, "ఏం మాట్లాడాలో తెలియదు నీకు!" అని విసుక్కునేది పిన్ని. నాకు అర్థం కాక పిచ్చి చూపులు చూస్తే, ఆ పిచ్చి చూపులకు ఫ్లాట్ అయ్యి అందరూ ఎత్తుకునే వాళ్ళు. (ఇప్పుడు ఎవరూ ఎత్తుకోవడం లేదనుకోండి.)
మామయ్య వస్త్తున్నాడు అని తెలియగానే వెళ్ళి మంచం కింద దూరే వాన్ని. చంద్రబాబు నాయుడు గడ్డం లో తెల్లె మచ్చలున్నట్టు, ఆ మంచానికి అన్నీ బొక్కలే! మామయ్యకు దొరికి పోయే వాన్ని. మామయ్య స్కూలు లో పని చేసే వాడు అప్పుడు. రాగానే "ఎ బి సి డి, అ ఆ ఇ ఈ, ఒకటి రెండు, వన్ టూ, పలక బలపం.." అనేవాడు. లాలూ ప్రసాద్ గడ్డి స్కాం టైం లో దొరికినప్పుడు ఎలా చూశాడో, అలా చూసేవాన్ని. ఆ చూపులుకు నవ్వేసే వాడు. "హమ్మయ్య! నవ్వాడు. ఇంక పలక అనడు." అని మనసులో అనుకునే లోగా నాతో పాటు స్కూలుకు రా అనేవాడు. యాక్సిడెంట్ లో చావని వాన్ని హాస్పిటల్ లో చంపడం అంటే ఇదేనా? పలక చిన్నగా ఉంటుంది, కాని స్కూలు చాలా పెద్దది. చాలా పలకలు ఉంటాయి. ఒక్కసారి సీన్ కళ్ళముందు కదిలేది. అంతే.." బా.... బా... " స్టార్ట్. బాబా బాబా బ్లాక్ షీప్ కాదండోయ్. అది నా ఏడ్పు.
నేను అమ్మమ్మ- తాతయ్య వాళ్ళ ఇంట్లో పెరిగాను. మామయ్య అనేవాడు, " నాన్నా! నువ్వే వీన్ని చెడగొడుతున్నావ్! వీడికి గారాబం ఎక్కువయింది" అని. ఇంతకీ మా తాతయ్య ఏం చేశాడంటే...
(నిద్ర.. రేపు చెప్తా..!!)
(నా చిన్నప్పటి ప్రేమకథ కూడా ఉంది. ఆ వయసులోనే.. మేరా జాన్ రేణుక.. తరువాత చెప్తా!!)
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)