చాలా రోజుల నుండి పుస్థకాలు ముట్టలేదేమో! ఈ రోజు పుస్తకాల రాక్ లో తల పెట్టి చూస్తే, డస్టులో పొర్లిన కోడిలా ఉన్నాయి పుస్తకాలు. నేను నాకు తోచిన మాటలు అప్పుడప్పుడూ రాసుకునే పుస్తకం వెతికి పట్టి బయటకు లాగితే దాని వెనకాల ఒక లారీ డస్ట్ బయటకు వచ్చింది. అతి కష్టం మీద ఆ పుస్తకాన్ని శుభ్రపరచి ఇదిగో.. ఈ సోది రాస్తున్నా.. "ఏంటో అంత ప్రత్యేకమయిన విషయం.." అనుకుంటున్నారా? అదేం పెద్ద విషయం కాదండీ.. మనకు తెలిసిన విషయమే... అదేనండీ!! "చేతులు కాలాక ఆకులు పట్టుకుందామంటే ఆకులే దొరకడం లేదు.."
అసలు ఈ విషయం మొన్ననే రాయాల్సింది. మన బాబు తెలుసు కదా! అయ్యో నా బాబు కాదండోయ్.. మాజీ సి.ఎం. బాబు.. తన హయాం లో వర్షాలు పడలేదని ఇప్పటికీ ఫీల్ అవుతున్నట్టు.. మన కె.సి. ఆర్. (టి.ఆర్. ఎస్) ఓట్ల వర్షం పడలేదని మొన్నట్నుండే ఫీల్ అవడం స్టార్టు చేశాడు. "చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం" అన్న సామెత కూడా ఇక్కడ పనికి వచ్చేలా లేదు. ఆనాటి హనుమంతుడు చిన్న తనం లో తెలియక సూర్యున్ని మింగబోయి ఎర్రగా మూతి కాల్చుకున్నట్టు, తెలిసి తెలిసి తెలంగాణాను మింగబోయిన కె.సి.ఆర్. నల్లగా మూతి మాడ్చుకున్నాడు. హనుమంతున్ని దేవుడు అన్నారు కదా అని.. తెలంగాణా నవ కల్కి అవాలనుకున్నాడేమో..! ఆ దెబ్బకు మనసారా ఏడ్వాలన్నా కూడా మీడియా వదలడం లేదు ఫ్రీగా..! (మీడియా వదిలేసరికి ఏడ్చే మూడ్ మారుతుందనుకోండి..)
పాత చింతకాయ పచ్చడి టేస్టు అదురుతుంది.. ఈ విషయం అందరికి విధితమే. కాని దాన్ని పాడవకుండా సంరక్షించాల్సిన బాధ్యత తీసుకుంటేనే నిల్వ ఉంటుంది. ఈ విషయాన్ని మన తాతలు పళ్ళు ఊడినా, పచ్చడి నాక్కుంటూ, మరీ మరీ చెప్పారు. ఈ విషయం కె.సి.ఆర్. తెలుసుకోలేదేమో! (కె.సి.ఆర్. ఇంట్లో పాత చింతకాయ పచ్చడి లేదనుకుంటా! పార్టీ కార్య కర్తలంతా కలిసి ఒక జాడీ కె.సి.ఆర్. కు గిఫ్ట్ గా ఇస్తే, కనీసం అది నాక్కుంటూ అయినా కర్తవ్యం తెలుసుకుంటాడేమో..!) తెలంగాణా అని పార్టీ పెట్టి ఆ పార్టీ నే రక్షించుకోలేక పోతే తెలంగాణానేం సాధిస్తాడు? సామాజిక విలువలను, అభివృద్దిని, ప్రజలలో తమపై నమ్మకాన్ని కాపాడుకుంటేనే ప్రజలు అబిమానిస్తారని మర్చిపోయి, కేవలం సెంటిమెంట్ కే ప్రజలు పట్టం కడతారని ఎలా అనుకున్నాడో పాపం.
ఎంతకాదనుకున్నా కె.సి.ఆర్ మీద నాకు ఒక సైడ్ సాఫ్ట్ కార్నర్ లేకపోలేదు. కారణం నేను కూడా తెలంగాణా వాన్ని అవడం అయి ఉండవచ్చు. కాని షడ్రుచులు లేని ఉగాది పచ్చడిలా రాష్ట్రం ముక్కలవడం నా మనసుకు ఇష్టం లేదు. కారణం భాషాభిమానం, కళల పట్ల మక్కువ. ... .. .. ఇలా ఏదయినా కావచ్చు. ఆలోచిస్తే కెసిఆర్ ది స్వార్హపూరిత రాజకీయం అనే విషయం ఎవరికయినా తడుతుంది. బలా బలాల పరీక్ష కోసం పార్టీ కార్య కర్తల నడ్డి విరగ తన్ని, తెలంగాణా పార్టీలోనే చిచ్చు రేపుకున్నాడు. స్టౌ కు నిప్పెడితే వంట చేసుకోవచ్చు కాని, సిలిండర్ కు నిప్పెట్టి చికెన్ బిర్యాని చేస్కోవాలనుకుంటే ఇల్లు కాలుతుందని ఇప్పుడిపుడే తెలుసుకున్నట్టున్నాడు..
మంగళవారం 3 జూన్ 2008
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
మొదటి మూడు పేరాలు చదివి పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వుకున్నా,ఆఖరి పేర చదివి నేను కూడా మీకు లాగే అనుకున్నాను.
ప్రత్యుత్తరంతొలగించుమీ విశ్లేషణ చాల బావుంది.
ఈ టపా కె.సి.ఆర్ చదివితే బాగుండు.
కనీసం కొంచెం ఆలోచించటం నేర్చుకుంటాడు.స్వార్ధ పర రాజకీయులకి చెంపపెట్టులాంటి తెలివయిన తీర్పు నిచ్చిన "తెలంగాణ వోటర్లందరికి అభినందనలు".
ఇంత మంచి టపా వ్రాసి నందుకు మీకు నా అభినందనలు. నూటికి నూరు శాతం మీ అభిప్రాయాలే నావి.
మీ నుంచి మరిన్ని మంచి టపాల కోసం ఎదురుచూస్తూ...
మీ పద ప్రయోగం చాలా బాగుంది..కలకాలం కలం ఝులిపిస్తూనే వుండండి!
ప్రత్యుత్తరంతొలగించుబాగుంది. ఆకులే లేకుండా చేసుకుని మరీ, చేతులు కాల్చుకున్న కేసీఆర్ అనుభవాన్ని ఉతికారేశారు. ‘సిలిండర్ వెలిగించి చికెన్ బిర్యానీ’ అదుర్స్.
ప్రత్యుత్తరంతొలగించు