నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే పాత సినిమాలలో బ్లాక్ అండ్ వైట్ అడవులను చూస్తూ కలర్ లో ఉంటే ఎంత బాగుండేవా అని ఊహించుకునేంత ఇష్టం. ఇప్పుడు టూబ్ లైటు వెలుగుల్లో కంప్యూటర్ తో కాపురం చేస్తున్న నేను, పుట్టింది మాత్రం నడి అడవిలో ఉన్న ఒక పది కుటుంబాల పల్లె లో. అందుకేనేమో పచ్చదనం పిచ్చి.
ఇదిలా కాసేపు పక్కన పెడితే పచ్చదనం పిచ్చి ముదిరి, ఎలాగో పార్కుల్లో తప్ప చూడలేని పచ్చదనాన్ని పాత ఫోటోలలో, అద్దాలు పెడితే తప్ప సరిగ్గ కనిపించని కళ్ళతో చూసి ఆనందిద్దాం అని అంతరాళాన్ని అణువణువు గాలిస్తుంటే దొరికిన ఫోటోలను నాతో పాటు మీరు అంతా చూసి ఆనందిస్తారని ఇక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నాను. అలాగని పచ్చదనం ఫోటోలు మాత్రం కాదు అన్నీ. కెమెరా కనిపెట్టిన కాలంలో తీసినవి, నాకు నచ్చినవి మాత్రమే ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను.
మీరేమంటారు.
రాయడానికి ఇంకు ఎలాగో వేస్ట్ అవదు కాబట్టి, మీ విలువైన సమయంలో ఒక నిమిషం కేటాయించి రెండు ముక్కలు కామెంట్లలో రాస్తే నాకు మహదానందం!
ఆ ఫోటోలను ఇక్కడ చూడండి.
క్లిక్ చేయండి. స్పామ్ కాదు. ఈ బ్లాగు లేబులు లింకే!
శుక్రవారం 4 మార్చి 2011
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
0 కామెంట్లు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి