నాకు నిన్న ఒక కల వచ్చింది. నిజానికి అది చాలా వింత కల. ఒక ఆంగ్ల సైన్స్ ఫిక్షన్ సినిమా చూసినట్టుంది. ఈ కల అందరూ తెలుసుకోవాల్సింది అని నేను చెప్పను కాని... ఈ ఊహ నిజంగా వాస్తవమైతే మాత్రం ఒక వండర్ ను చూస్తూ కలో నిజమో తెలియని పరిస్తితుల్లో కళ్ళుమూయడమే.
విషయానికి వస్తే...
ఊహాలోకం కాకపోయినా ఇది వాస్తవలోకంలో నిజంగా వాస్తవమే...
మన చుట్టూ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చెప్పగలరా..
ఆ నక్షత్రాలన్నీ మన సూర్యుడు లాంటివే అనేది వాస్తవం..
అలాగే ప్రతీ నక్షత్రానికి గ్రహాలు ఉపగ్రహాలు ఉన్నవనేది కూడా వాస్తవమే..
అంటే మనలాంటి ఎన్నో గ్రహాలు ఆ గ్రహాల మీద జీవన్మరణాలు.. సాంకేతిక పరిజ్ఞానం ఉండి ఉండే అవకాశాలు చాలా ఎక్కువే... ఇప్పటికే మనలాంటి గ్రహాలు మన శాస్త్రజ్ఞులు కనిపెట్టారు.. ఉదాహరణకు బ్ల్లూ మూన్..
కాని నా కల దానికి సంబంధించింది కాదు. మరీ సామాన్య శాస్త్రాన్ని చదివిస్తున్నాను అనుకోకపొతే కొన్ని విషయాలు ముందుగా చెప్పాలి. భూమికి సూర్యకాంతి చేరే సమయం ఎనిమిది నిముషాల ముప్పై సెకండ్లు. ఈ వేగంతో మనం ప్రయాణించ గలిగితే మనం ఎన్నో పాల పుంతలను, వేరే గ్రహాలను, విశ్వ రహస్యాన్ని కొంత వరకు ఛేధించగలం. కాని నిజంగా అంత వేగం తో మనం ప్రయాణించగలమా? అసాధ్యం అని అనను కాని... ఇప్పుడున్న సైన్స్ కు అది అసాధ్యమే. మన రాకెట్ల స్పీడ్ కు మిలియన్ల రెట్ల వేగం తో ప్రయాణించగలిగితే ఇది సాధించగలం.
అసాధ్యం అని ఎందుకు అనలేదు అంటే... ఒక అవకాశం ఉంది. అదే క్రిష్ణ బిలం ను సృష్టించడం. పేరు కొత్తగా ఉన్నా మనం అంతా విన్నదే.. అదే బ్లాక్ హోల్. అందరూ బ్లాక్ హోల్ అనే పదం విన్నవారే అయినా దాని గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువే. తెలుసుకోవాలని ఉన్నా తెలుసుకునే సమయం ఉండదు.
భూమిని అంతం చేయగల భయంకరమైన శక్తులు నాకు తెలిసిన రెండు చెప్తాను.. అవి ఒకటి బ్లాక్ హోల్ కాగా, రెండవది సూర్యుడి అసాధారణ సెగ. దీని గురించి చదివి చాలా కాలం అయినందున సరయిన వివరణ ఇవ్వలేకపోయినా ఒక చక్కటి ఉదాహరణతో వివరించగలను. కర్రల పొయ్యి అందరికి తెలిసే ఉంటుంది. బాగా వేడిగా ఉన్న నిప్పు ఖణిక ఒక్కసారిగ పగిలి లోపల నుండి నిప్పురవ్వలు బయటకు చిమ్ముతాయి. అలాంటిదే సూర్యుడి లో జరుగుతుంది. అంటే నా ఉద్దేష్యం నక్షత్రాలలో అని. హైడ్రోజన్ హీలియం ల నిరంతర అణు మార్పిడి ప్రక్రియ వల్ల సూర్యుడిలో వేడి గా ఉండే Electro magnetic radiated waves ఉత్పన్నమవుతాయి. ఎండలో వేడి కాంతి వల్ల వచ్చింది కాదు. ఈ వేవ్స్ వల్ల వచ్చినదే. ఒక్కసారిగా విస్పోటనం చెందిన వేడి సెగలు సూర్యుడిని దాటి బయటకు వస్తే... ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. ఎంత పెద్ద వస్తువుకు అంత సెగ. ఒక గ్రహాన్ని బూడిద కూడా మిగలకుండా చేయగలదు. కాని కొన్ని బిలియన్ల సంవత్సరాలలో ఒకసారి జరిగే ప్రక్రియ ఇది.
ఇప్పుడు బ్లాక్ హోల్ గురించి మాట్లాడుకుందాం. అణువులలో పరమాణువులను కూడా విడదీయగల శక్తి కలది బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ లో పడ్డ ఒక వస్తువు వేగం ఎంతో తెలుసా.. అనంతం. ఎవరూ లెక్క కట్టలేని వేగం. ఒక్కసారి బ్లాక్ హోల్ లో పడ్డ ఒక వస్తువు ఎంతకాలనికి, ఎక్కడికి చేరుతుందో చెప్పడం కుదరని పని. కాంతిని కూడా లాగేసే శక్తి ఈ బ్లాక్ హోల్ కు ఉంది అంటే దాని శక్తి అర్థం చేస్కోవచ్చు. ఈ బ్లాక్ హోల్ పరిమాణం ఎంతైనా ఉండొచ్చు. ఒక గ్రాహాన్ని మొదలుకుని ఒక నక్షత్రాన్ని మింగగల శక్తి దీనికి ఉంది. ఇంత శక్తి వంతమైన ఈ బ్లాక్ హోల్ ఎలా పుడుతుంది అనే సందేహం రాకపోదు.
మనిషికేనా జీవన్మరణాలు? కాదు.. నక్షత్రాలకు ఇది వర్తిస్తుంది. లైఫ్ టైం అయిపోయిన నక్షత్రాలు ఒక పెన్సిల్ మొన ఆనించేంత చిన్న ప్రదేశానికి కుదించుకు పోతాయి. అలా అయినప్పుడు ఆ నక్షత్ర పరిమాణాన్ని ఆక్రమించిన ప్రదేశం అంతా బ్లాక్ హోల్ గా మారి దాని శక్తికి అందినంత మేర లాగేస్తుంది. అప్పుడు అందులో పడిన ఏ గ్రహం కూడా వేరే నక్షత్ర కక్ష్యను వెతుక్కోవాల్సిందే. మన సూర్యుడికి ఇంకా మిలియన్ల సం. సమయం ఉంది. కాబట్టి మీరెవరు టెన్షను పడొద్దు. అలాగని వేరే నక్షత్రాల వల్ల ప్రమాదం లేదని చెప్పలేం. ఈ బ్లాక్ హోల్ ను కృత్రిమంగా సృష్టించడం వల్ల మనం వేరే మిల్కి వేస్, గెలాక్సీ లను చేరుకోగలం. రాబోయే కాలం లో ఇది సాధ్యపడే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడు నా కలకు వద్దాం. మన భూమి ఉన్నట్టుండి ఒక బ్లాక్ హోల్ లో పడి కొట్టుకు పోయింది. కాని పాక్షికంగా బ్లాక్ హోల్ ప్రభావం వల్ల అది అసాధారణ కక్ష్యలో ప్రయాణించి ఎన్నో నక్షత్రాలను దాటుతూ ఎన్నో గ్రహాలను త్రుటిలో తప్పించుకుంటూ చివరగా సేఫ్ గా వేరే నక్షత్ర కక్ష్యలో చేరింది. కాని ఈ క్రమంలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం తో పాటు సగం భూమి నాశనం అయింది. ఎన్ని గంటల కలనో నాకు తెలియదు కాని నాకు అన్నీ కళ్లకు కనిపించాయి. ఒక అద్భుతాన్ని నా కళ్లతో చూసినట్తుంది. అలాగని 2012 సినిమా నిన్న చూశానని కాదు. అది రిలీజ్ ఐనప్పుడే చూశాను. కల కు కారణం ఏదయినా నా కల నిజం గా అద్భుతం.
2012 లో ప్రపంచ అంతం అనడానికి ఎన్ని కారణాలున్నా, సినిమా కోసం ఆ అంశాన్ని ప్లాన్‘డ్ గా హైలైట్ చేశారనే చెపుకోవచ్చు. 2012 లో ప్రస్తుత కాలెండర్ అంతం అయిపోతుంది. కాబట్టీ ప్రపంచం మిగలదు అని అనే వారు కొంత మంది ఉండగా, బ్లాక్ హోల్ ఎఫెక్ట్ అనే వారు కొంత మంది కాగా, భూమి లో అంతర్గత పీడనం అని కొంతమంది చెప్పుకుంటున్నారు. ఎవరేం చెప్పుకున్నా ఇంకా కొన్ని వేల సంవత్సరాల వరకు మనం సేఫ్ అని నా ఉద్దేష్యం. ఆస్టరాయిడ్స్ వల్ల మనకు ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నా, వాటిని ముందే గ్రహించి వాటిని శూన్యం లోనే అంతం చేయగల అణు శక్తి మనకు ఉంది. ఒక వేల భూమి నాశనం అవాలంటే మూడవ ప్రపంచ యుద్దం అయినా కారణం అవ్వలి, లేదా కాలుష్యం అయినా కారణం అవాలి, లేదా ఆంత్రాక్స్ కన్నా ప్రమాదమైన వైరెస్ ను ఎవరైనా సైకో లు కనిపెట్టాలి. లేదా మితి మీరిన శాస్త్ర ప్రయోగాలు కూడా కారణం అవొచ్చు.
సూర్యుడి నుండి వచ్చే కాంతి నిజంగా కాంతి కాదు. ప్రమాదకరమైన రేడియేటెడ్ కిరణాలు. అవి మన మీద పడితే మందులు లేని రోగాలు వచ్చి పోతాం. ఆ రేడియేషన్ నుండి మనలను రక్షించేది ఓజోన్. ఇది చదివిన వారంతా మనకోసం కాకపొయినా మన రాబోయే తరాలకోసం అయినా కాలుష్య నివారణకు సహాయ పడండి. కార్బన్ మొనాక్సైడ్ (CO) ఓజోన్ కు ప్రథమ శత్రువు. మూడు పరమాణువుల ఆక్సిజన్ ని ఓజోన్ అంటాం O3. స్తిరత్వం లేని CO కార్బన్ మోనాక్సైడ్ O3 లోని ఒక O ని తీసుకుని O2 మరియు CO2 గా మారి స్తిరమైన రెండు అణువులను సృష్టించడం ద్వారా ఓజోన్ ను అంతం చేస్తుంది.
CO కార్బన్ మోనో ఆక్సైడ్ + O3 ఓజోన్ => CO2 కార్బన్ డై ఆక్సైడ్+ O2 ఆక్సిజన్ + శక్తి
కాబట్టి కాలుషాన్ని తగ్గించండి.
మంగళవారం 28 జూన్ 2011
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)